పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16452

  1. ది వేస్ట్‌ లాండ్: 1. కావ్యప్రవేశం గురించి Lyla yerneni అభిప్రాయం:

    01/01/2023 11:02 am

    Poun-ded Land

    ఒక్క వాన కురిస్తే బాగుండును
    నే మొక్క మొలిసి పోయేలా ఒక్క జడివాన కురిస్తే బాగుండును
    ఇసుక మేటుల కింద కప్పడిన నా గుండె, ఎండి బీటలు వారిన నా గుండె
    ఆకాశం గండిపడి జీవప్రవాహాలు ఒంపితే
    జలధారలకు ఒక్కసారిగా జలదరించి విచ్చిపోయి, ముక్క చెక్కలై
    గడ్డకట్టి విత్తుకట్టిన నా నెత్తురు జలజల దానిమ్మ గింజల్లా రాలి
    భూమి నెరియల్లో దూర దూరాలకు కొట్టుకుపోయి
    అనారు నారై, అంతటా నాటుకు పోయి, వేల వేల నాజూకు ఎరుపు పూలు పూసి
    చూసిన ఓ ప్రేమ హృదయం హసించి ఒక ముద్దిచ్చేలా
    ఒక్క లిప్త పాటు మురిసి తన మనసిచ్చేలా
    ఒక్క వాన కురిసిపోయి
    నే ననారు పూల తోటనై విరిసిపోతే
    అల్లా! బాగుండును.

    -Lyla
    Happy New Year All! Don’t miss the Rose Parade 1223.

  2. గడినుడి – 74 గురించి తః తః అభిప్రాయం:

    01/01/2023 10:48 am

    శ్రీ సురేశ్: పరి పరి తలెత్తే ప్రశ్న -మళ్ళీ మీ అభిప్రాయాన్ని చదివింతరవాత మరొకసారి – వాడుక, వ్యాకరణాల్లో ఏవి చెవులు? ఏవి కొమ్ములు?

    నా అన్నగారు తను రాసిన ఒక వృత్తములో వాడిన ‘చేతు’ అన్న పదాన్ని ఒక వైయ్యాకరణి ఒప్పదన్నారు. నేను ‘నేటికిప్పుడే చేతు’ అన్న ‘దాశరథీ’ శతక ప్రయోగాన్ని పేర్కొన్నాను.
    నమస్కారాలతో
    తః తః

  3. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 14 గురించి Srinivas అభిప్రాయం:

    01/01/2023 3:59 am

    The usage seems correct.

    Horse carriage is called victoria, in Mumbai. It was very prevelent in BBY till few years back. Government banned these carriages few years back, citing poor upkeep of animals.

  4. గడినుడి – 74 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    01/01/2023 2:54 am

    నిజానికి పద్నాలుగు అన్న సంఖ్యకు మహన్మహత్యర్థక బహువచనాంతాదేశము పద్నలుగురు అని ఉండాలి.

    సంఖ్య మనుష్యుల సంఖ్యా వాచకము
    ===== ======================
    నాలుగు – నలుగురు
    పద్నాలుగు – పద్నలుగురు

    “నీ వున్నచోటే నిత్యము నిఖిలమైనవారికి” అన్న అన్నమయ్య కీర్తనలో పద్నలుగురు అన్న ప్రయోగం ఉంది:

    పట్టపగలులోననే పద్నలుగురు దేవేంద్రు
    లెట్టుగాఁపురము సేసే దింద్రలోకమున

  5. అదృశ్య సముద్రం మీద వేట గురించి Kameswari Yaddanapudi అభిప్రాయం:

    12/30/2022 7:50 am

    చాలా బాగా వ్రాశారు. మీకు విషయమూ తెలుసు, విధానమూ తెలుసు.

  6. తేలిక తెలుగు గురించి మురళి అభిప్రాయం:

    12/29/2022 8:33 am

    అయ్యా, శ్రీ IAPS Murthy గారు ఇంగ్లీషు భాష గురించి కొంత అపార్థం చేసుకున్నారా అనిపిస్తున్నది. ఇంగ్లీష్ వారు ఏ దేశానికి వెళ్తే అక్కడి పదాలను కొన్ని తమ భాషలోకి స్వీకరించారు. వాటి రూపం తో సహా. అందుకే put but మనగలిగాయి. Walk talk , -gh, bour వంటివి కూడా అంతే.భాష స్వరూపం లో ప్రతి భాషకు ప్రత్యేకత ఉంటుంది. గాంధీ అని ఇంగ్లీష్ వారు సరిగా పలక లేక పోవడానికి కారణం gan ను గాన్/గాం అనే కాన్సెప్ట్ వారికి లేదు. అలాగే బుద్ధ ను బూడ అని పలుకుతారు. దీనికి వారిని తప్పు పట్టి ప్రయోజనం లేదు. pa ప,ku కు అని అనుకొనే అలవాటు కూడా వారికి లేదు. మనం వారికి ఎలా present చేశామో వారు అలా తమ భాషలో కూడ బలుక్కొని మాట్లాడతారు. మనం సరిగా చెప్పుకోలేక పోవడం వల్లే అలా జరిగింది.ఇక క్యాపిటల్ లెటర్స్… వ్యాకరణం… ఏ భాష సౌందర్యం దానికి ఉంటుంది. పోల్చుకుని బాధపడి ప్రయోజనం లేదు. తెలుసుకొని నేర్చుకుంటే అనుభూతి వేరుగా ఉంటుంది.

  7. గడినుడి – 74 గురించి డా. వై. కామేశ్వరి అభిప్రాయం:

    12/28/2022 11:07 am

    పద్నాలుగురు? పద్నాలుగు మంది?

  8. ఊహల ఊట 19 గురించి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ అభిప్రాయం:

    12/25/2022 10:55 am

    చుట్టాల వల్ల వచ్చే ఇక్కట్లనీ, వాళ్ళు ఎటువంటి వారైనా చక్కగా చూసుకునే గృహస్తు ధర్మాన్నీ చదువుతుంటే వేడి వేడి అన్నంలో ఆవపెట్టి వండిన, ఇంగువ ఘుమఘుమల పనసకాయకూర తిన్నట్టుగా అనిపించింది.

  9. మ్యాజిక్ గురించి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ అభిప్రాయం:

    12/24/2022 9:40 am

    వాడి గురించిన తీయటి కబుర్లు… ఎప్పటికీ వాడని కుసుమాల్లా…

  10. జనులా పుత్రుని కనుగొని గురించి Srinivas అభిప్రాయం:

    12/23/2022 8:45 am

    Best narration. ఆ తెలుగు పాటల రియాలిటీ షోని ఓంకార్ షోలా మార్చేశాడు అతని వారసరత్నం.