పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16452

  1. ఊహల ఊట 20 గురించి Lyla yerneni అభిప్రాయం:

    01/04/2023 6:30 pm

    ఈమాట అభిప్రాయాలలో కొన్ని పేర్లు నేను చూసినప్పుడు, ఇవి కల్పితం పేర్లు, కల్పిత పాఠకులు, ఇలాటి పేర్లు ఉండవు గాక ఉండవు అనుకునేదాన్ని. ఇప్పుడు కొందరిని నెట్‍లో వెదికాక వీరు నిజం మనుషులే, వీరు ఇండియాలో నివసిస్తూ, వారి బ్లాగుల్లో, వారి పత్రికల్లో ఇప్పుడు రాస్తూ ఉన్నారు, అని తెలుస్తూ ఉంది.

    ఐతే ఈ తెలుగువారిలో కొందరు ఈమాట ఇంటర్నేషనల్ పత్రికకు అభిప్రాయాల వేదికకు విజయం చేసేది ‘ప్రవక్త’ల రూపంలో మాత్రమే. ప్రత్యేకంగా ఈ శీర్షికలో – ప్రతిసారీ వంటకాలు, బైట వీధిలో అరిటాకులో వేంచుకుని, తిని తేన్చి, ఆ నెల ఉపదేశం సారాంశం చెప్పి పోతుంటారు. ఈ శిష్యుల మాటలు వింటూ, ఇక్కడి కార్టూనులు చూస్తుంటాను.

    కొన్ని నెలలుగా బోడిగుండు బామ్మ బొమ్మలు వరుసగా వేశారు. ఎందుకు! ఏళ్ల క్రితం అప్పటి ‘కులపు అత్యాచారాల’కు గురియైన స్త్రీలు మనసు రాయి చేసుకుని, వారి సంతానపు సంతానాన్ని సాకితే, ఇప్పటి స్త్రీ రచయిత -తన జుట్టు అందాలు తన తలంట్లు, కథలో చిన్న పిల్లగా వర్ణించుకుంటూ, ‘తనకు, అమ్మకు, జుట్టెందుకుందీ? మరి బామ్మకు గుండు ఎందుకు ఉందీ?’ అని చిన్న పిల్లగా, ఒక్కసారైనా అడగకపోటం చాలా వింతనిపిస్తుంది. పిల్ల చిటుకూ చిటుకూ అన్ని ప్రశ్నలడుగుతుంది మరి!

    బామ్మ బోడిగుండు ఊహా? నిజమా? ‘చిన్న పిల్లల వాయిస్‍లో’ రాయటం, ‘పిల్లల కార్టూన్లు,’ తన నాన్నమ్మ స్వంతజీవిత, మానసిక ఆవేదన గురించి అడల్ట్‌గా, రాయాల్సిన అగత్యం నుంచి షీల్డ్ చేస్తున్నదా? బామ్మతోనూ, పిల్లతోనూ ఊరందరికీ నీతులు చెప్పిస్తూ, తనింట్లోనే బాగా పరిచితమైన దురలవాట్లు ఇప్పటికీ రాయలేకపోటం, ‘అసలు రచయిత’ denial, evasionను సూచిస్తుందా?

    నేరస్థుల సైకలాజికల్ ప్రొఫైలింగ్ జరుగుతుంది. రచయితల సైకలాజికల్ ప్ర్రొఫైలింగ్ జరగదు కదా! ఏ రచయితలు ఇంకా oral stageలో ఉన్నారో, ఎవరు anal stageలో ఉన్నారో, Freud వచ్చి ఇక్కడ మనకు చెప్తాడు?
    గొప్పవర్గం లోని, గొప్పవారి గోత్రంలో, గొప్పల గోడగుర్రం ఎక్కి కూర్చుని, గొప్పగా స్వారీ చేస్తూ, సదా ఊంఛా రహేగ మై ఔర్ మేరా రచనా – తాపత్రయపు రచయిత – She is never going to come off that high horse. Are you kidding!

    కొన్నేళ్ల క్రితం, ఒక కన్నడ కథ సంకలనంలో ఎ.కె. రామానుజన్ రాసిన ఒక కథలో; షిప్‍లో అమెరికా వచ్చిన ఒక యువకుడు, ఒక యూనివర్సిటీలో రిసర్చర్ పనిచేస్తూ, ఒక సరికొత్త ఎన్సైక్లోపీడియాలో ఇండియాలోని అప్పటి ఆచారాల గురించిన పేజీలలో, తన తల్లిని గుండు గీసి, విధవ రూపంలో, ఫొటోలు చూపిస్తూ రాసిన మాటలు చదువుతాడు. He is shocked. అతడికి తన తండ్రి చనిపోయిన సంగతి కూడా తెలియదనుకుంటా. He is devastated. తండ్రి మరణం కన్నా, తల్లిపై చేసిన అత్యాచారం, అతనికి విపరీతమైన బాధ కలిగిస్తుంది. నా తల్లిని ఇలా చేసిన వాడిని, ఇలా వికృతపరచి ప్రపంచానికి చూపేవాడిని, నేను విడిచి పెట్టనంటూ, ఇండియా ప్రయాణమౌతాడు.

    నాకు గుర్తు లేక సరీగా చెప్పకపోతే మన్నించాలి. ఆ అనువాదపు కన్నడ కథ ఎవరి వద్దైనా ఉంటే ఈమాట పత్రిక ప్రచురిస్తుందేమో.

    -Lyla

  2. నిరీక్షణ గురించి Poduru v s Pardhasaradhi అభిప్రాయం:

    01/04/2023 4:47 am

    పద్మావతిగారి కవితలు సరళమైన బాషలో అపారమైన భావాన్ని సృజించే ప్రజ్ఞాశాలి… ఎందుకో ఈ కవిత నాకు అసంపూర్తిగా అనిపిస్తోంది.

  3. ఊహల ఊట 20 గురించి sumanaspati reddy అభిప్రాయం:

    01/03/2023 5:08 pm

    గొప్ప సామాజిక ఆశయాల సాధనకు తోడుండాల్సిన సమధికోత్సాహాన్ని చిన్ని చిన్ని సాహితీ జల్దారుల్లో పారకం చేసి విపులంగా పంచి పెట్టే పని చేపట్టారు తన పండు వయసులో తులసి గారు, ఈ ఊహల ఊటలతో! స్వతంత్ర దేశంగా ఆవిర్భవించబోతూ సమసమాజపు ఆశయాలను కూడా తెగ పంచుకుంటున్న ఎనిమిది దశాబ్దాల క్రింది చారిత్రక సన్నివేశాన్ని గుర్తుండి పోయేలా పిల్ల కుంతల, టీచరు సయీదాల మధ్య జరిగే సంవాదాలతో ఆవిష్కరించిన తీరు డబుల్‍కా మీఠా బ్రెడ్డంత రుచికరంగా ఉంది!

  4. మాస్కోలో ఒక అమెరికన్ మాథమటిషియన్ గురించి ఎరికలపూడి వాసుదేవరావు అభిప్రాయం:

    01/03/2023 9:30 am

    వేమూరి వారికి నమస్కారాలు. ఆంధ్ర విశ్వకళపరిషత్లో ‘వాచకాలు’ అంతర్జాతీయ స్థాయిలో ఉండేటట్టుగా చూచుకునేవారు. Gelfond and Fomin పుస్తకం కాల్కులస్ ఆఫ్ వేరియేషన్స్ మీద. ఈవ్యాసం ఈమాటలో రావటం సందర్భంగా అప్పుడే చెప్పవలసిన కృతజ్ఞతలు మాధవ్‍కి (శ్రీ మాధవ్ మాచవరం).

    ఎ వా రా

  5. ముగ్గు గురించి లోలా కోసూరి అభిప్రాయం:

    01/03/2023 4:58 am

    చాలా బాగుంది మిత్రమా

  6. మాస్కోలో ఒక అమెరికన్ మాథమటిషియన్ గురించి Venkateswararao VEMURI అభిప్రాయం:

    01/03/2023 4:02 am

    వ్యాసం చివరిదాకా ఆసక్తికరంగా చదివించింది. నా విద్యార్థి దశలో Gelfond and Fomin రాసిన ఒక పుస్తకం పాఠ్యపుస్తకంగా ఉపయోగించినట్లు గుర్తు ఉంది. లేక, అది కేవలం వారి పరిశోధన పత్రమయినా అయి ఉండవచ్చు.

  7. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 15 గురించి G K S Raja అభిప్రాయం:

    01/02/2023 11:46 pm

    ఓ చిత్రకారుడు, మరో చిత్రకారుని జీవితకథ రాయడం, కాస్త చిత్రం, చాలా అద్భుతం. లక్ష్మణ్ గారి ముద్రించని ఆ పొలిటికల్ కార్టూన్ల కట్ట సొరుగులో ఉందేమోనని ఒహటే ఆతృత.
    చాలా బావుంటోంది అన్వర్ భాయ్!

  8. ఊహల ఊట 20 గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:

    01/02/2023 10:08 pm

    ఊహల ఊట. 20 వ భాగం చదివాను
    ఎదుగుతున్న వయస్సుతో పాటు ఆలోచనలు కూడా మారడం కుంతల పాత్ర ద్వారా చక్కగా చూపిస్తున్నారు కథలో లీనమైన
    నేను కూడా మరో కుంతల ని అయిపోయాను
    తాపీ మేస్త్రి అనుభవ జ్ఞానం
    బీద గొప్ప తారతమ్యాలు పోగొట్టాలి అనుకోవడం
    అన్ని మతాల సారాంశం ఒకటేనని
    ఈ భేదాలు పోగొట్టాలి అనే భావం చిన్నతనం నుంచే పుడుతుంది అని కుంతల పాత్ర ద్వారా పలికించిన రచయిత్రి డాక్టర్ తులసి గారికి అభినందన వందనాలు

  9. ముగ్గు గురించి Rambabu Kopparthy Indian Bank అభిప్రాయం:

    01/02/2023 10:47 am

    చక్కటి కవిత. నూతన సంవత్సరానికి స్వాగతం

  10. ముగ్గు గురించి Agasthya అభిప్రాయం:

    01/01/2023 7:35 pm

    Excellent poem