పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16450

  1. ఆమె మొగుడు గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:

    09/28/2024 2:00 pm

    తిక్కపుట్టి తాను గడుపుతున్న జీవితం నుండి పారిపోవటం గురించిన కథ.

    నిజానికి నిత్యమూ ఎంతో మందికి ఎన్నో కారణాలవలన తాము గడుపుతున్న జీవితాల నుండి పారిపోవాలన్న గాఢమైన సంకల్పం అప్పుడప్పుడూ కలుగుతూ ఉంటుంది. ఐతే ఆసంకల్పం ఎంత తీవ్రంగా కలిగినా దానిలో చెప్పుకోదగినంత స్థిరత్వం కుదరక వారు పారిపోకుండా అవేజీవితాల్లో పడుంటున్నారు. ఆకోణంలో జరిగితే చదువరుల్లో కొందరైనా ఈచేతకాని వెధవ తమకంటే కొంచెం నయంగానే ప్రవర్తించి చివరకు తెగించి జీవితాన్నుండి పారిపోయాడు భలే అని ముచ్చటపడతారు. అదలా ఉంచితే పారిపోవటం అనేది ఎన్నటికీ నాయకలక్షణం కాదూ కాలేదూ కాబట్టి పారిపోయిన ఇతగాడి మీద చివరకు ఎక్కువమంది జాలిచూపుతారే కాని ఇతగాణ్ణి మాత్రం స్ఫూర్తిగా తీసుకొనే సాహసం చేయరు లెండి.

    నిజం చెప్పాలంటే నేను మీరు నిజంగానే మీకథనాయకుడికి హఠాత్తుగా నాయకలక్షణాలు ప్రసాదించి తిరస్కరణలను తిరస్కరించి నిలబడే సమున్నతుణ్ణి చేసిపారేస్తారేమో కథాంతంలో అని దురాశపడ్డాను. అలాచేస్తే మరీ సాదాసీదా కథ ఐపోతుందీ రొటీన్ ముగింపు ఐపోతుందీ అనుకున్నారు కాని ఇలాంటి వాడు హీరో ఐపోవటం రొటీన్ కాదు కదా అని ఆలోచించారు కాదు కదా.

    పోనీయండి.
    ఒక జీవితం మనం కోరుకున్నట్లు సాగాలని లేదు.
    ఒక కథ మనం అనుకున్నట్లు ఉండాలని లేదు.

    మీ అసమర్ధుడి జీవితయాత్ర ఇలా ముగిసినందుకు అతగాడికి నాసానుభూతిని తెలియజేయండి మీకు ఎక్కడన్నా ఎప్పుడన్నా తారసపడితే!

  2. ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము గురించి B Srinivasa Rao అభిప్రాయం:

    09/22/2024 1:18 pm

    నిజంగా ఔరంగ జేబు, ఒక మత చాందస వాది అయినప్పటికీ, ఆ సమయాల్లో గురువు గారికి ఉత్తరం రాయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఒక చక్రవర్తి కుమారుడికి ఏమి నేర్పాలి అనే విషయం (పరిపాలన, చారిత్రక,భౌగోళిక,ఆర్థిక అంశాలు) గురువుకి తెలియాలి… Letterతో వదిలి వేయబడినాడు… గురువు అని గౌరవంతో, కానీ ఒక చక్రవర్తి ఏమైనా చెయ్యవచ్చు…

  3. నడిరేయి గురించి విజయ్ అభిప్రాయం:

    09/19/2024 12:49 pm

    ధన్యవాదాలు

  4. నాన్న గొంతు గురించి వంశీ క్రిష్ణ అభిప్రాయం:

    09/18/2024 4:59 am

    ఎంత మంది కోసుకోవాలో గదా. సనాతనంగా జీర్ణించుకుపోయిన మాట చాలా కుటుంబాల్లో. చాలా బాగుంది కథ.

  5. మనమెరుగని మధ్య అమెరికా 1 గురించి సాయికిరణ్ పామంజి అభిప్రాయం:

    09/17/2024 11:43 am

    యాత్రలన్నా, యాత్రా సాహిత్యమన్నా నాకు చాలా ఇష్టం. తెలుగులో చాలామంది యాత్రారచనలు చేస్తున్నారు. కానీ దాసరి అమరేంద్ర గారు రాస్తున్నారంటే చదువుతుంటే కలిగే అనుభూతే వేరు. చదవడం మొదలు పెట్టడమే గానీ ఆపడం మనచేతిలో ఉండదు. ముగింపు వస్తే తప్ప. ఈయన పాపులర్ రచయితగా మారుంటే ఒక యండమూరిలా ఉండేవాడేమో. ప్రపంచం మీద నిజమైన మమకారం ఉంటే తప్ప ఇలా తిరగడం, ఇలా రాయడం సాధ్యం కాదు.

    నిమ్మగడ్డ శేషగిరి గారి మొరాకో శోధనలతో మొదలుపెట్టాను. ఇక్కడిదాక వచ్చాను. శేషగిరిగారి సోలో యాత్రలు సజీవ యాత్రలు. ఆ ప్రాంతాలు తిరగలేని మాలా‍ం‍టివారికి ఆ ప్రదేశాలన్నీ కళ్ళముందు కనిపిస్తున్నాయి. ప్రతిదానిలోను పాజిటివిటీ చూసే శేషగిరి గారి వ్యక్తిత్వం ఈ యాత్రానుభవాల్లో విశేషంగా ఆకర్షిస్తుంది. అంతేగాకుండా భౌగోళిక సమాచారం ఇవ్వడంలో కూడా ఇవి ఎంతో విలువైన రచనలు.

    నిజమైన యాత్రికులయిన మీ ఇద్దరి నుండీ ఇంకా ఎన్నో రచనలు వస్తే అవి తెలుగు సాహిత్యంలో ఒక భాగంగా ఉండి ఎందరినో అలరిస్తాయి.

    మీకు నమస్కారాలు. ధన్యవాదాలు.

  6. జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి రమేశ్ బాబు అభిప్రాయం:

    09/16/2024 2:55 pm

    వ్యాసం చాలా బాగుంది. ఇంత క్లిష్ఠమైన కావ్యాన్ని చాలా సులభం చేశారు. ధన్యవాదములు.

  7. చదువు అనే ఆరోవేలు గురించి Suprasanna Penna అభిప్రాయం:

    09/14/2024 12:24 pm

    అందమైన జ్ఞాపకాలు. అన్నీ ఙ్ఞాపకాలే. Down the memory lane; Thank you so much for bringing all the memories.

  8. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-3 గురించి Lakshmi Narasimha Rao Sista అభిప్రాయం:

    09/10/2024 1:08 pm

    చాలా పరిశోధనాత్మకమైన, మంచి వ్యాసం. చక్కగా ఉంది. ఆలోచింపచేశే వ్యాసం.

    గణపతి: అంతు చిక్కని వింత దేవుడు- 2 & 3 భాగాలు దొరికాయి. మొదటి భాగం దొరకలేదు.

    [మొదటి భాగం – సెప్టెంబర్ 2017; నాలుగవ భాగం – డిసెంబర్ 2017; ఐదవ భాగం – అక్టోబర్ 2018 – సం. ]

  9. ముష్టి పలురకములు గురించి VSTSayee అభిప్రాయం:

    09/10/2024 10:13 am

    కృష్ణరావుగారి ‘కటకట’ను “హితశ్రీ”గారు చెప్పినా, వీరి వ్యాసులవారు చాలాదూరం వెళ్లారు!

    ‘భిక్షాపాత్ర’ నాటిక ఇక్కడ.

    నమస్తే,
    వాడపల్లి శేషతల్పశాయి.

  10. ముష్టి పలురకములు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/08/2024 11:58 pm

    శాయి గారన్నమాట: “వీరిలాంటి గురువులకు/అధ్యాపకులకు భృతి సమాజమే కల్పించాలి.”

    1974 లో “నూట పదహార్లు,” పేరిట తెలుగులోని ఉత్తమ కథలని తాళ్ళూరి నాగేశ్వరరావు, హితశ్రీ సంకలనం చేశారు; మొదటి భాగం మాత్రమే చెయ్యగలిగారు. దానిని తిరిగి ఈ మధ్యనే విశాలాంధ్ర “శత వసంతాల తెలుగు కథ,” గా ప్రచురించింది. నేనివాళ ఉబుసుపోకకై దానిలో జి.వి.కృష్ణరావు గారి కథ “ఉదబిందువులు,” చదివాను. వారి ఇతర రచనలని తిరగేస్తే “భిక్షాపాత్ర” కనిపించింది. ఈ నాటికని ఆకాశవాణి జాతీయ నాటికగా ప్రసారం చేసిందన్నారు హితశ్రీ: https://archive.org/details/sahithichaithrar022777mbp/page/n123/mode/2up

    కొడవళ్ళ హనుమంతరావు