పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16451

  1. పేరు గలవాడేను మనిషోయ్ గురించి శేషుమాధవ్ చతుర్వేదుల అభిప్రాయం:

    05/21/2008 10:13 am

    ఈ కధ చదువుతుంటే, ఆ నేటివిటి లో ఉన్నట్టే అనిపించింది. కధంతా చదివాక, ఎదో సంతృప్తి తో కూడిన అనుభూతి. కొంచెం ఫిలాసఫి, చాలా ఫ్రెష్ నెస్, బలమైన కారెక్టరైజేషన్(“ఆడున్నొళ్ళు” తో సహా)… వెరసి, ఓ సున్నితమైన కధ.

  2. నీటి అద్దాలు గురించి Giri అభిప్రాయం:

    05/21/2008 7:15 am

    ఫణీ స్వామీ,
    మీ పేరు తప్పు రాసినందుకు సారి. దానికి మీ సమాధానం బావుంది.
    కవిత బావుంది.
    ఇట్లు
    గిరి

  3. త్రిల్‌ గురించి chavakiran అభిప్రాయం:

    05/21/2008 1:11 am

    బావుందండీ
    స్వాతీలో సరసమైన కథకు కొంచెం దగ్గరగా
    అదేదో పత్రికలో క్రైం స్టోరీ కథలా

    ఇంతకు ముందేమన్నా వ్రాశారేమో నాకు తెలీదు శైలి కూడా సులభంగానే ఉన్నది.

    కొన్ని రచనల ఉద్దేశ్యం ఉతోపియాను చూపడమో, సమస్యలను సాధించడమో కాదు అని ఒప్పుకొని తర్వాత విమర్శకులు ఆలోచిస్తే బాగుంటుంది.

    —–
    అన్నట్టూ శేఖర్ ను చంపాలంటారా? 🙂

  4. 3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు – ఒక పరిచయం గురించి Murhy అభిప్రాయం:

    05/20/2008 11:33 am

    సాహితీ సదస్సు వ్యాసం బావుంది. వక్తల ప్రసంగ విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మరిన్ని సాహితీ సదస్సులు జరగటానికి ఈ వ్యాసం ప్రేరణ అయితే మంచిది.
    మూర్తి

  5. త్రిల్‌ గురించి anuradha అభిప్రాయం:

    05/20/2008 11:23 am

    the most rubbish, damaging story about Indian women.Please stop posting this type of trash.

  6. అంతర్మథనం గురించి ko sya su ra అభిప్రాయం:

    05/20/2008 9:19 am

    స్వచ్చ మైన తెలుగు కధ.
    పాత్రలు ప్రాంతాలూ, పరిస్తితులు అన్ని పరిచయమైనవే .జాలిగా నవ్వించే కధ.
    కధముగిసాక ముఖం మీద చల్లని నీళ్ళు చల్లుకున్నట్ట ఇంది.
    కొ శ్యా సు రా

  7. వాడ్రేవు వీరలక్ష్మీదేవి “ఆకులో ఆకునై” గురించి giri అభిప్రాయం:

    05/20/2008 8:50 am

    హాయ్,
    మీ రచనలు బావున్నాయి.
    ఆహ్లదంగా వున్నాయి.
    Apologies for writing in English. I am new to this telugu typing. hoping to get used to this shortly.
    Dr. Veera lakshmi devi has mentioned about the Joe-Harry window. As per this theory the personal awareness is classifed in to four quardrants i.e., Open, blind, Hidden and Unknown.

    There are several theories on psychology. Not only Freudian Theories.
    I believe you better be prudent while writing a review.
    మీ రచనలు ఇంకా చదివి మళ్ళీ రాస్తాను.

    Regards
    ఇట్లు
    బందా గిరిబాబు.

  8. అటో యిటో గురించి ramya అభిప్రాయం:

    05/20/2008 8:13 am

    Lakshmi narayana ,rajasankar kasinadhuni గార్ల కి కథని చదివి అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  9. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    05/20/2008 7:25 am

    హనుమ గారూ:

    మీ సుదీర్ఘమైన వ్యాసాన్ని చదవటం ఇప్పుడే పూర్తి చేసాను. ఈ వ్యాసం రాయడానికి వెనక ఉన్న మీ కృషి, “ఈమాట” సంపాదకుల సంపాదకత్వం మెచ్చుకోవాలి. తెలుగులో ఇటువంటి వ్యాసాలు అరుదు. మీ లాగ సైన్సులో కాని ఇంజినీరింగులో కాని అత్యుత్తమ స్థాయిని చేరుకున్న తెలుగు వారు చాలా మంది ఉన్నా, తెలుగులో ఇటువంటి రచనలకి శ్రీకారలోచుట్టిన వారు తక్కువ. ముఖ్యంగా సైన్సు, ఇంజినీరింగు విభాగాల్లో అతి క్లిష్టమైన భావాలను తేలిక తెలుగులో రాయటం అంత తేలిక కాదు అన్న విషయం, అది ప్రయత్నించిన వారికి అనుభవమే!

    ఇటువంటి రచనల్లో ఎదుర్కొనే చిక్కుల్లో రెండు విషయాలు ప్రస్తావిస్తాను. మొదటిది: అత్యుత్తమ స్థాయిలో, సాంకేతికమైన పదజాలం తెలుగులో ఎక్కువ లేకపోటం. రెండవది: తేలికగా చదవటానికి వీలైన తెలుగు భాష. ఈ రెండు కష్టాలని దాటటం అంత సులభం కాదు. మీరు సమర్ధవంతంగా ఈ రెండు కష్టాలని ఎదుర్కొన్నారు. ఈ విషయంలో ముందు, ముందు మీ రచనల్లో మరింత పరిణితి వస్తుందని నేను నమ్ముతున్నాను.

    రెండు చిన్న సూచనలు: (1) ఎంతో అవసరమైతే తప్ప, తెలుగు కాని ఇంగ్లీషు కానీ కవితలని ఇటువంటి వ్యాసాల్లో ఉల్లేఖించకండి. చదువరుల ఆలోచనలను, ఇవి అసలు విషయం నుండి పక్కదారి పట్టిస్తాయి. (2) ఇంటర్నెట్ అందుబాటులో లేని సైన్సు లేక ఇంజినీరింగ్ చదువుతున్న తెలుగు విద్యార్ధుల కోసం, మీ రచనలను ఆంధ్ర దేశంలో ప్రచురిస్తున్న దిన, వార, మాస పత్రికల్లో ప్రచురిస్తే, అక్కడి వారికి సాయపడినవారు అవుతారు. ఇందులో కస్టాకస్టాలు నాకు తెలిసినా, ప్రయత్నించమని మనవి.

    ఈ వ్యాసాలు చదువుతుంటే, వృత్తి రీత్యా నాకు బాగా పరిచయమైన సెమికండక్టర్సు సిలికాన్ ఛిప్స్ తయారీ వెనుక ఉన్న ‘సిలికాన్ మహత్యం ” పై ఈమాట కోసం వ్యాసాలు రాయాలని అనిపిస్తోంది. వీలు చూసుకొని ఎప్పుడైనా…

    మంచి వ్యాసాలను అందించినందుకు, ధన్యవాదాలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  10. లింకన్ తో ఓ రాత్రి గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:

    05/19/2008 6:19 pm

    మాలతి గారు,

    ఎవరో కొందరు పాఠకులు పైమెట్టు మీద వున్నావని అనుకున్నందు వలన రచయితకి నష్టవేవిటండి? ఏ మెట్టుమీదున్నా విమర్శని తీసుకోవటం, తిరస్కరించటం రచయిత ఇష్టాఇష్టాలే కదా. రచయిత పైమెట్టు మీదున్నానని అనుకోకపోతే చాలు (అనుకుంటే రచయితకే నష్టం).

    “ఈమధ్య కొందరు పాఠకులు తమ ఆలోచనాసరళికి ఏమాత్రం భిన్నంగా వున్నకథ అయినా, దాన్ని పీకి పాకాన పెడుతున్నారు.” ఆ పాకం పాఠకుల హక్కు. పాకం బాగుంటే మరింత రుచిచూడండి, లేదనుకుంటే రుచిచూడకండి. ఎందుకు బాగలేదో చెప్పండి. కానీ పాకం బాగలేదని నిష్టూరపోతే ఎలా మాలతి గారు.