పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. ఓహో యాత్రికుడా.. గురించి ramakrishna peddada అభిప్రాయం:

    07/19/2008 3:26 am

    శ్రి రొహిణి ప్రసాద్ గారు,
    మీ వ్యాసం చలా బాగుంది.సాలూరి వారి అభిమానులలొ నెను ఒకడినడి.భీష్మ లొ ‘మనసులొని కొరిక”,’మహదేవ శంభొ’ ‘అలాగే ఆరాధన లొ
    ‘నా హ్రు దయం లొ నిదురించె చెలీ” ‘వెన్నెల లొనీ వికాసమే’,’నీ చెలిమీ” పాటల గురించి రాయగలరు

  2. పొలి గురించి Yuva అభిప్రాయం:

    07/19/2008 3:20 am

    ఇంత మంచి కథ చదవటానికి అవకాశం అందించిన ఈమాటకు ధన్యవాదములు. కథను అత్యద్భుతంగా మలిచిన తమ్మినేని యదుకులభూషణ్ గారి శైలికి జోహార్లు… ఈ కథ చదువుతున్న అరగంటలో రాలిన కన్నీరు చెబుతుంది, రచయిత గొప్పదనం.
    ఇంత పాత, మంచి కథపై అభిప్రాయాలేమీ లేకపోవటం కొంత ఆశ్చర్యం.
    – యువ

  3. రాగాలూ స్వరాలూ గురించి baabjeelu అభిప్రాయం:

    07/18/2008 5:56 pm

    వివరించినందుకు “థేంక్స్”.
    దేశి నుంచే మార్గ పధ్ధతి వస్తుంది.సహజంగా.
    దేశి పధ్ధతి అంటే జానపద సంగీతవా? జానపద సంగీతం కూడా, పాట అంతా తాళసహితంగా, లయతప్పకుండా, రాగం ప్రకారం వుంటుంది. ఇదెలా సాధ్యం?
    జానపదుల అనుభూతులు, అనుభవాలు రాగసాహిత్యాలుగా మారేయనుకుందాం.
    ఉదాహరణకి:
    “చితచిత్త వానా కురిసె, చిత్త వాన కురిసె,
    బంగారు వానగురిసే,
    ఔనొదిన
    బంగారు వాన గురిసె, బాగాయె పనులూ…”
    అనే జానపద గీతం తొలకరి కోసం ఎదురు చూస్తూ, చినుకు పడ్డంతోటే ఆ వూరి ఆడపడచు లందరి “అసంకల్పిత ప్రతీకార చర్య” అనుకుందాం. మొదటి సారి వింజమూరి సీత, అనసూయగార్లంత బాగా పాడివుండరు, ఆ అమ్మాయిలు. తరవాత్తరవాత కొన్ని తరాలకి “దేశి” రాజేస్వర రావు వరసని రసవంతం చేసి ఉంటాడు.

    అనుభవాన్ని అందరూ అనుభవించడానికి, రాగం, సాహిత్యం, తాళం అన్నీ ఒకేసారి వచ్చి వుండాలి.

    రాగం సాహిత్యానికి వెన్నుముకయి మంచి దన్నిస్తుందికదా? అలాటిది రాగం ప్రధానవయిపోయిందెందుకు, మన “మార్గం” లో? చదువెక్కువయిపోడవా? మనల్ని నేను అపహాస్యంచెయ్యట్లేదు.

    లేకపోతే, వానచినుకుల్లో తడిసిన ఆ అమ్మయిల కేరింతలకీ, గావు కేకలకీ, తరవాత ఆ వూళ్ళోవున్న సముద్రాల (సీ) గారు సాహిత్యం అతికుంచుంటారా?
    ఒక విషయం అనుభవమయింది. మీరు రాసిన “శ్రీ రఘురాం, జయరఘురా..” హంసధ్వని రాగం ఆధారంగా తయారయినదని తెలిసేక ఇంకా బాగునంట్టనిపిస్తోంది.
    పరికిణీ, కబ్బా వేసుకుని ఓ బుజ్జి పాప ని చూసి ఎంత ముద్దుగా వుందో అనుకుని, ఎవరిపిల్లో తెలిసేక తెలిసిన వాళ్ళ పిల్లయితే ఇంకా ముద్దనిపించినట్టు. ఇంటర్లూడ్స్ తో సహా గుర్తుండిపోయిన పాటల్లో ఇదొకటి.

  4. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి Rama Kanneganti అభిప్రాయం:

    07/18/2008 3:15 pm

    Few suggestions on improving the analysis: Apart from the theory of falsifiability, you also should consider Occam’s razor. That one eliminates the teacup in the orbit scenario. Finally, all these theories suffer from a problem — consistency is no guarantee for completeness or correctness (to qualify correctness of a model is that it denotes what you are seeking to model). Karl Popper does not consider the model theoretic point of view — perhaps you can look to philosophers like Wittgenstein to explain that better.

    :-), enough name dropping on my part,

    With thanks,
    Rama

  5. సంగీతానికి స్పందన గురించి baabjeelu అభిప్రాయం:

    07/18/2008 8:26 am

    నిజంగానే, శాస్త్రీయ సంగీతాభిమానులుకీ, గుడ్డిగా మతాన్ని నమ్మేవారికీ తేడా వుండదు.
    చిన్న తేడా ఏవిటంటే, బాలమురళీ కి బిస్మిల్లా ఖాన్ కీ తేడా శాస్త్రీయ సంగీతాభిమానులుకి వినబడదు.

  6. తొలి వలపు గురించి baabjeelu అభిప్రాయం:

    07/18/2008 7:45 am

    సుబ్రహ్మణ్యం గారూ,
    వాహ్ వాహ్ అనడం కన్నా ఇంకేం చేయగలం?
    వాహ్ వాహ్.

  7. సినిమా పాటల్లో తాళం నడకలు, విరుపులు గురించి baabjeelu అభిప్రాయం:

    07/18/2008 7:40 am

    ఇలాటి విశ్లేషణల వల్లే విని ఆనందించడం ఇంకా ఎక్కువవుతుంది.
    మరి “రామన్నరాముడొయ్..” లవకుశ సినిమాలో పాట, దీనిలొని తాళ వాద్యం ఏమిటి?
    రాముడు, సీతమ్మతల్లితో తిరిగి వచ్చెస్తున్నాడన్న ఆనందం అంతా వినిపిస్తుంది ఆ దరువులో.
    ఘంటసాలకి వేయి దండాలు. రాసిందెవరో?

  8. నా స్మృతి పథంలో గురించి baabjeelu అభిప్రాయం:

    07/18/2008 7:28 am

    రవికిరణూ, మూలా సుబ్రహ్మణ్యమూ,

    ఇది చదివేరా? దయచేసి చదవండి. కవిత్వానికి కావలసిన ప్రాథమిక రిక్వైర్ మెంట్స్ తెలుస్తాయి. ఆతరవాత మీ మీ ఆలోచనాధోరణులు, మీ మీ పొలిటికల్ నమ్మకాలూనూ.
    ప్రోజు లో రిథిమ్ చాలా కష్టం. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారికి మాత్రమే అది కుదురుతుంది.
    పోయెట్రీ లో రిథిమ్ కోసం కొంచెం కష్టపడండి నాయనలారా, తరిస్తాం.

  9. పాటల్లో లయవిన్యాసాలు గురించి baabjeelu అభిప్రాయం:

    07/18/2008 6:56 am

    ఇప్పుడర్ధమైంది.
    లలిత సంగీతం, సినిమా సంగీతాల ప్రజాదరణ సీక్రెట్ తెలిసిపోయింది.
    ఈ వ్యాసంకోసమే ఎదురుచూసేను.

    మీరు రాసింది అక్షరాలా నిజం, ప్రస్తుతం రిథిం పేడ్ మీద ఒకే బీటు, పాట మొదలయిన దగ్గర్నుంచీ. రెహమాను లాంటి వాళ్ళని వదిలేస్తే, అందరిదీ అదే ధోరణి.

    బహుశా “చక్రవర్తి” దగ్గర్నుంచీ ఇది మొదలయినట్టుంది. ఒకే బీటు. “యమగోల” తరవాత.

    కవి అనే పదానికి అర్ధం మారిపోయింది, మీరు రైటు.
    స్వరకర్త అనే పదానికి అర్ధం మారిపోయింది. మీరు రైటు.
    ఇప్పుడంతా “ఫిల్ ఇన్ ద బ్లేంక్స్”.

    హిందీ పాటలే ఇప్పుడు కూడా బావుంటున్నాయి.

    సీతారామశాస్త్రి గారు దేవీశ్రీప్రసాదుని తిట్టేరో, పొగిడేరో తెలీకుండా మంచి ముక్క అన్నారు.సక్సెస్ అనే వ్యసనానికి బానిసై పోయేడని.

  10. విలువలు గురించి k k suseela అభిప్రాయం:

    07/18/2008 4:42 am

    its really heart touching