పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. తెలుగు సినిమా పాట గురించి baabjeelu అభిప్రాయం:

    07/31/2008 4:45 am

    లక్ష్మన్నగారూ,

    తెలుగు సినిమా పాట గురించి రాయండి అని మీరు అడిగుంటారు “ఇలపావులూరి” వారబ్బాయి “ప్రైమరీ” కుర్రాళ్ళకి రాసిన రామాయణవో భారతవో రాసినట్టు రాసేరు.

    ఒకొక్కరి గురించి రాయమని మళ్ళీ అడగండి దయచేసి. బోల్డు మంచి వ్యాసాలు.

    లేకపోతే సీతారామశాస్త్రిని వదిలేసి తరవాతి కవుల మంచి పాటల గురించి రాయమనండి. సంపాదకులు మూసపధ్ధతిలో వుండకూడదుకదా?

  2. తెలుగదేమిటనిన… కాదు… తెలుగదెందుకనగ… గురించి pingali sasidhar అభిప్రాయం:

    07/31/2008 1:55 am

    నేను గత కొంత కాలంగా ఈమాట చదువుతున్నాను. ముఖ్యంగా కొందరి కవితలు ఎంతగానో ఆకట్టుకుంటున్నయి. ఉదా: వైదేహి శశిధర్ గారివి చాలా చాలా ఇష్టము.
    ఆయితే, నాకూ ఈమాటలో సభ్యుడినయ్యి నావీ కొన్ని కవితలు పంపాలని ఉంది. చాలా సార్లు యెలా పంపాలని అడిగాను. ప్రవాసాంధ్రులకే ఈ ఈమాట ప్రత్యేక మైతే సరే. అదే తెలియజేయండి. అదీ సంతొషమే ఒక పాఠకుడిగానే ఆనందిస్తా.

    పింగళి శశిధర్ (జాబిల్లి)

    [శశిధర్ గారు: ఈమాట ఎల్లలులేని ప్రపంచ పత్రిక. మీ రచనలకి ఆహ్వానం. దయచేసి రచయితలకి సూచనల పేజీ చూడండి. మీ రచనలని ఈ పేజీ క్రింద ఉన్న ఈమెయిల్ అడ్రస్‌కు మెయిల్ చెయ్యవచ్చు. అన్ని రచనలూ సమీక్షించబడతాయని గమనించగలరు. మీ నించి మంచి రచనలకై ఎదురు చూస్తాము.
    — ఈమాట సంపాదక వర్గం]

  3. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి నాగమురళి అభిప్రాయం:

    07/30/2008 5:02 am

    రాజేంద్ర గారూ, నేనా పుస్తకం చదవలేదండీ. అందులో జ్యోతిష్యం గురించి ఏం రాసారో కొంచెం క్లుప్తంగా వివరించగలరా?

  4. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం:

    07/29/2008 9:05 am

    మురళీ గారు,మీరు మాస్తి వెంకటేశ అయ్యంగారు రచించగా,అయాచితుల హనుమచ్ఛాస్త్రులు అనువదించిన చిక్కవీరరాజేంద్ర చదివారా?అందులో జ్యోతిష్య చర్చ చాలా ఉంది
    🙂

  5. గుల్మొహర్ గురించి baabjeelu అభిప్రాయం:

    07/29/2008 8:04 am

    వైదేహి గారూ,

    సమకాలీనులు మెచ్చరు ఎలారాసినా అని ఓ పాత కవిగారి బాధ నాకర్థం కాలేదు. మీ పునశ్చరణ కి “రవికిరణు”, “ఈ మాట” లో మీ సహవాసి, పులకించడం ముచ్చటేసింది.

    చక్కని అనుభూతి; అనుభూతిని అంతకన్నా చక్కగా అభివ్యక్తీకరించడం; అంతేకదా కవిత్వం అంటే.

    “నిరలంకారం” అంటే సరిగ్గా అర్ధం కాలేదు. మీరేం రాయకండి. ఏ భైరవభట్లగారో, కొడవళ్ళవారో ఇంకెవరో తీరికా ఓపికా వుంటే రాస్తారు.

    అభిప్రాయాల్ని పట్టించుకోకండి. పట్టించుకున్నా సమాధానాలివ్వకండి. కవిత్వం రాయండి.

  6. గ్రేడింగ్ అమ్మలు గురించి baabjeelu అభిప్రాయం:

    07/29/2008 7:46 am

    మహానుభావా,

    మీరసలు ఈ అనుభవాలన్నీ “ఏజిటీజ్” గా రాయండి. “అమరావతి కథ”లో, “గౌతమీ గాథ”లో, “పచ్చ నాకు సాక్షిగా” నో, “పసలపూడి కథలు” గానో తయారవుతాయి.

    నాలుగ్గంటలకే తిమ్మిరెక్కిన మీకాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తే అది మాఅద్రుష్టం తప్ప మా గొప్ప కానీ సంస్కారం కానీ కాదు.

    ఎన్నాళ్ళు వాళ్ళూ వీళ్ళూ రాసిన వాటికి వ్యాసాలు రాస్తారు? గోపీచంద్ చెప్పినట్టు, భాష రాని రచయత కి భాష నేర్పొచ్చు, బతుకు తెలియని రచయతకి ఏవీ నేర్పలేం. బతుకూ, భాషా రెండూ తెలిసిన మీరు రాయాలి. దయచేసి రాయండి.

  7. కవుల వాగ్వాదాల్లోంచి కవిత్వం – గీరతం గురించి baabjeelu అభిప్రాయం:

    07/29/2008 7:32 am

    అళియ రామరాయల సమయంలో హంపీ “పీక్ పీరియడ్” చేరుకుంది. సుఖాలకలవాటయిన సైనికులు బహమనీ సుల్తానుల్ని అడ్డుకోలేకపోయేరు. “తళ్ళికోట” యుధ్ధంలో అళియరామరాయలు ఓడిపోయేడు. తరవాత ఏవయిందీ అందరికీ తెలుసు.

    “శ్రీ తిరుపతి వేంకట కవులు” అళియరామరాయలు లాటివారు తెలుగు సాహిత్యం వరకూ. ఏంచేసినా “పడ్డ చన్నునెత్త బ్రహ్మ వశమే?” లాగా అయింది వ్యవహారం.

    “తిరుపతి వేంకట కవులు” అద్భుతవయిన కవులు. అయితే “ఒరిజినాలిటీ” లేని కవులు. మన అద్రుష్టం. “పాండవోద్యోగవిజయాలు” సహజవయిన ప్రక్రియ. కవిత్రయం ఏం సాధించారో మామూలు ప్రజకి అర్ధం కావడం కష్టం. “పాండవోద్యోగవిజయాలు” ద్వారా “తిరుపతి వేంకటకవులు” అంతకన్నా ఎక్కువ సాధించేరు. ఇంతకుముందు ప్రజా కవులని వ్యాసం, ఇప్పుడుఇలాటి వ్యాసాలు “చెళ్ళపిళ్ళ” వారు చదివితే రాసిన వాళ్ళ మర్యాద మిగల్చరు.

    “కొప్పరపు కవులూ, వేంకట రామక్రుష్ణ కవులూ” “తిరుపతి వేంకటకవు” లకి విమర్శకులు మాత్రవే. “తిరుపతి వేంకటకవుల్ని” ఢీ కొన్న కవులుగానే వాళ్ళు చరిత్రలో మిగిలి పోతారు. వారెవరివీ స్వతంత్ర రచనలు నిలబడలేదు కదా తరవాత.

    ఇప్పటికీ మా వూరి “సర్పంచ్” “చెల్లియో చెల్లకో..”అనీ, “బావా సత్యవతీ పౌత్రా..” అనీ”సెట్ పట్” లాడించీసి, ఇప్పటి కుర్రకారు ఈ పద్యాల్ని విని ఎందుకానందించరని తెగ బాధపడిపోతుంటాడు. “తెగ దీర్గాలు తీస్తాడెస్ ” అంటాడు వాళ్ళబ్బాయి.

    తెగ దీర్ఘాలే అనర్ధాలు, సాహిత్యవయినా, బతుకయినా.

  8. అమెరి గల్పిక ఆదా గురించి ఇంకో సుబ్బారావు అభిప్రాయం:

    07/28/2008 11:06 am

    అందరూ కాదనుకుంటానండీ సుబ్బారావు గారూ. ఎలాగో ఒకలాగా మహా కక్కుర్తిగా డాలర్లు ఆదా చేద్దామనుకునేవారే ఇలా సుబ్బారావులు అవుతారనుకుంటాను. పార్కింగు కూడా ఆదా చేద్దామనుకుని, కక్కుర్తి కొద్దీ, బోర్డులు చూసుకోకుండా, నష్టబోయి, సుబ్బారావయ్యాడు ఈ కధ హీరో. అలా కాకపోతే, చవగ్గా సంతలో చక్కగా కూరగాయలు దొరికేవే ఇంకగ్గా. ఆదా చెయ్యడం వేరూ, పిసినారి లాగా వుండటం వేరూ.

  9. అమెరి గల్పిక ఆదా గురించి subbarao అభిప్రాయం:

    07/27/2008 5:01 pm

    ఈ దేశంలో అందరూ ఏదో ఒక రోజు “సుబ్బారావు” లే.

  10. సామాజిక నవలల్లో కథనా శిల్పం గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    07/27/2008 3:16 pm

    కామేశ్వర రావు గారూ,

    మృణాలిని గారే “సామాజిక నవలల్లో కథనా శిల్పం” అన్న అంశం ఇచ్చారు. గంటన్నర పాటు ఉన్న చోటునుండి ఎవరూ కదలలేదు. అందరికీ, ఉపన్యాసం అప్పుడే అయిపోయిందా అన్న భావన కలిగింది.

    హాస్య నవలల గురించీ చెప్పారు. ముళ్ళపూడి వెంకట రమణ గురించీ ప్రస్తావించారని బాగా గుర్తు. ఎక్కడ మిస్సయ్యిందో తెలియదు.

    – సాయి బ్రహ్మానందం గొర్తి