పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. పట్టుకో పట్టుకో గురించి obul reddy అభిప్రాయం:

    07/01/2009 9:42 am

    కవితలో పదహారణాల భావుకత.. చక్కటి కవిత ..అభినందనలు !

  2. ఈ కానుకనివ్వలేను గురించి Vamsi M Maganti అభిప్రాయం:

    07/01/2009 8:15 am

    కథనం బాగున్నది. నామటుకు మొదటి సగభాగం నిటారుగా కూర్చోని ఆసక్తిగా చదివాను, తర్వాత సీట్లోకి నెమ్మదిగా జారగిలబడటం మొదలు అయ్యింది. అయితే ఇక్కడ నివసిస్తున్న, అంటే నాకు తెలిసున్న తెలుగువారి కుటుంబాల్లో (భవదీయుడిది కూడా కలుపుకుని) ఈ క్రింది తరహా మాటలు నేను వినకపోవటం, చూడకపోవటం మూలానో ఏమో మరి … “శాండిల్య ఆఫీసుకు రెడీ అయిపోయి సిరియల్ తింటూ చెప్పాడు, “పూర్ణా, సాయంత్రం నీతో మాట్లాడాలి. కొంచెం ముందు రావడానికి ప్రయత్నిస్తావా” “షూర్ ” అన్నాన్నేను. ” – ఇలా ఇంకా కొన్ని , కథలో నాకు కృతకంగా కనపడ్డాయి. నాకు అలవాటు లేకపోవటం మూలాన..

    కాకపోతే ఇక్కడి వారి జీవన విధానంలో కొన్ని పా(ర్)ట్లు తెలుగువారికి అన్వయించి చెప్పడానికి రచయిత్రి చేసిన ప్రయత్నం బాగున్నది. ఈ వాక్యాలు మటుకు బాగా నచ్చాయి – “ఆశల్ని మోసుకుంటూ వచ్చినవాళ్లు అర్థంతరంగా చచ్చిపోతే… నేను వాళ్లని పెట్టెల్లో పెట్టించి, ప్యాక్ చేయించి జాగ్రత్తగా తల్లిదండ్రులకూ పుట్టినూరికీ పంపించాలా? ఇవా మనం ఇక్కణ్నుంచి పంపేవి? ఇలాంటి కానుకలివ్వలేను పూర్ణా. అంతకుమించి… మనమూ అలాగయిపోతే…’’

    అభినందనలు…

  3. అంచులలో అందాలు గురించి Vamsi M Maganti అభిప్రాయం:

    07/01/2009 6:47 am

    JKM గారూ….ఇందుకే, ఇలాటివాటికే ఈమాట ప్రతి సంచికలోనూ, మిగతావి ఎలా ఉన్నా, చదివినా చదవకపోయినా – మీ వ్యాసాలకోసం నేను ఎదురు చూసేది…సహస్ర వందనాలు….

    PS: Thankyou for the “దర్పణ సాదృశ్యము” picture too !.. :)..

  4. అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    07/01/2009 6:05 am

    వేలూరి గారికి:

    ఒక ముఖ్యమైన విషయం పై మీ వ్యాసం ఇప్పుడు సందర్భానుసారంగా ఉంది.

    “తెలుగు నాడి” ప్రచురణ ఆగిపోవటం విచారకరం. జంపాల చౌదరి గారు మిగిలిన సంపాదక వర్గం సభ్యులు గత ఐదేళ్ళగా చేసిన కృషికి అభినందనీయులు. తెలుగునాడి ఆఖరి సంచిక ఇంత తొందరగా చూస్తామని అనుకోని అమెరికా తెలుగు ప్రియులకి ఈ వార్త నిరాశని కలిగించింది అనటంలో సందేహం లేదు! కానీ ఈ పరిణామాల వెనుక ఉన్న శక్తులేవి? అన్న ప్రశ్న ఆలోచింపతగింది.

    నిజమే! అమెరికలోనే కాక మరెన్నో చోట్ల అచ్చు పత్రికలకు మనుగడ కష్టమౌతోంది. కానీ, ఇది ఊహించని పరిణామమా? ప్రస్తుతం నడుస్తున్న ఆర్ధిక మాంధ్యమే పూర్తిగా ఈ పర్యవసానాలకి మూలమా? బహుశా కాదని నా అభిప్రాయం.

    ఇంటర్‌నెట్ వాడకంలోకి వచ్చిన దగ్గర నుంచి, అమెరికాలో ఉన్న ఐటి రంగంలోని నిపుణులే, ఇంటర్‌నెట్ యొక్క విశ్వరూపాన్ని సరిగ్గా అంచనా వెయ్యలేకపోయారు. ఇప్పుడు మనం మన జీవితాల్లో చూస్తున్న ఇంటర్‌నెట్ ప్రభావం Tip of the Iceberg మాత్రమే! ఇంటర్‌నెట్‌లో ఇప్పుడు అనేక భాషల్లో (తెలుగుతో సహా) స్వచ్ఛందంగా నడపబడుతున్న అనేక వెబ్ పత్రికల ఆవిర్భావం, ఇంటర్‌నెట్ విశ్వరూపాల్లో ఒక అతి చిన్న అంశం మాత్రమే. ఇప్పుడు ఇరవై ఏళ్ల ప్రాంతంలో ఉన్న అమెరికా తెలుగు కుర్రకారు ఒక్క సెంటు కూడా ఖర్చు పెట్టకుండా ఇంటర్‌నెట్‌లో ఉచితంగా అన్ని రకాలైన సినిమాలు (తెలుగుతో సహా), సంగీతం ఆనందిస్తున్నారు. ఇది పది, పదిహేనేళ్ళ క్రితం ఊహించని పరిణామం.

    వేలూరి వారి చివరాఖరి రెండు ప్రశ్నలకు నా జవాబు:

    “తెలుగునాడి అంతర్జాలంలో కూడా ప్రచురిస్తే ఇంకా నిలిచి ఉండేదా?”. బహుశా అవును. అచ్చులో ఈ ప్రతికను తీసుకు రావడమే ఇప్పుడు ఏర్పడ్డ నిరాశ పరిణామానికి కారణం.

    “ఈమాట అచ్చులో వచ్చుంటే?” – ఈపాటికి కాలగర్భంలో కలిసిపోయేది.

    “ఈ మాట” పుట్టటానికి కారణం మీకు నేను గుర్తు చెయ్యక్కర లేదు కదా!

    అభినందనలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  5. ఏడు గంటల వార్తలు గురించి mohanrazz అభిప్రాయం:

    07/01/2009 5:03 am

    excellent story!!!!

  6. చలంతో రజని ముఖాముఖి గురించి Naresh అభిప్రాయం:

    06/27/2009 3:32 pm

    చలం..
    చాలా రోజుల్నించి వెదుకుతున్నాను ఆయనకోసం. అక్కడక్కడా.. అప్పుడప్పుడూ.. పుస్తకాలలో కనిపించాడు కానీ, ఎప్పుడూ వినిపించలేదు. ఏమోలే.. మాటలు మర్చిపోయాడేమో అనుకున్నా..
    కానీ ఈన్నాళ్లకి, రజనీ గారు చేసిన ఇంటర్వ్యూతో- శ్రీనివాస్, మాధవ్ గార్ల సహాయ సహకారాలతో మాటలు గుర్తు తెచ్చుకున్నాడేమో అనిపిస్తుంది. ఈ ఒక్క ఆడియో ఫైల్ తో చలం మరోరకంగా కూడా చిరంజీవులైనట్లైంది.

  7. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి kasi viswanadham yeelswarapu అభిప్రాయం:

    06/27/2009 8:34 am

    ఈ వ్యాసం చాల బాగుంది. ఆదిశంకరుల రచనలు భక్తిని, ఆ మీదట ముక్తిని ఒసగే మంత్రములే కాని, మామూలు పదజాలముల కూర్పు కాదు.
    శారదా మాత తన దివ్యవాక్కును శంకరుల ద్వార మనకు అందించి మన మూఢత్వమును
    పారద్రోలిన ‘ అమ్మ’

  8. పునరపి గురించి Sri harinarayana అభిప్రాయం:

    06/27/2009 4:18 am

    పునరపి అని కధకు ఎందుకు పేరు పెట్టారు?

  9. శ్రీ ఆంజనేయ రక్షా కవచం గురించి Sri harinarayana అభిప్రాయం:

    06/27/2009 3:55 am

    Good Narration.. keep it up

  10. కవిత్వ భాష తీరుతెన్నులు గురించి M.S.Prasad అభిప్రాయం:

    06/26/2009 11:07 pm

    ప్రాచీనాద్యతన కవితా గుణ వ్యాసావలంబమై సహితానేక సాహిత్య చతుర విశ్లేషణా కదంబమైన మీ వ్యాసం చాలా బాగున్నది. ధన్యవాదాలు అభివందనలు కొన్నిపదాల/భావాల పరిభాషలు కొత్తగా తెలుసుకొని కొంచెం విశాలమైన దృక్పధాన్ని ఏర్పరచుకోడానికి తోడ్పడే మీ కృషి అభినందనీయం.

    మరొక్కమారుకృతజ్ఞతలతో

    భవదీయుడు