ఈ ప్రపంచం నుండి ఆకులా రాలిపోయే రోజు వస్తుంది
వైభవం మసకబారుతున్న ఇంద్రియాలూ
జారిపోతున్న స్మృతులూ మినహా నీ దగ్గర ఏమీ మిగలవునువు గమనించినా లేకున్నా
నీ దేహాన్ని చివరి బంగారురంగూ, చల్లనితెరలూ తాకుతుంటాయిఅప్పుడు ఏమనిపిస్తుంది నీకు
సముద్రంలో మునిగే నదిలా
అనంతం వైపుగా నీ జీవితం స్పందిస్తూ వుంటుందాతొలిసారి వీధిలోని ఉత్సవాన్ని చూస్తున్న బాలుని ముఖంలో వలే
జీవితంలోకీ, అనంతంలోకీ ఒకే ఆశ్చర్యం మెరుపులా వ్యాపిస్తుందాలేదూ, జీవితమంతా చేసినట్లు
ఖాళీపాత్ర నిండా గాలి నింపే ప్రయత్నం చేస్తుంటావానీ వెనుక అనంతం పచార్లు చేస్తూ వుంది
ఈ క్షణం నుండైనా వెనుతిరిగి చూడమని
ఎవరో నీకు సందేశం పంపుతున్నారు
రచయిత బివివి ప్రసాద్ గురించి: హైకూకవిగా, తాత్విక కవిగా సుపరిచితులు. మూడు హైకూ సంపుటాలు: దృశ్యాదృశ్యం, హైకూ, పూలు రాలాయి; నాలుగు వచన కవితా సంపుటాలు: ఆరాధన, నేనే ఈ క్షణం, ఆకాశం, నీలో కొన్నిసార్లు ప్రచురిత రచనలు. హైకూ సాహిత్యానికి గాను మచిలీపట్నం సాహితీసమితి అవార్డు, ఆకాశం సంపుటికి ఇస్మాయిల్ అవార్డుతో సహా మూడు అవార్డులూ వచ్చాయి. సంపుటాలన్నీ బ్లాగులో ఈ-పుస్తకాల రూపంలో చదవవచ్చును. ... పూర్తిగా »