దైవం

కడలి అడుగున
వెలిగే చేప
కడుపు లోపల
తిరిగే పాప

రక్తమంటిన
సింహపు కోర
చచ్చిన దుప్పి
జాలి మోర

గొంతు చీల్చే
హైనా కన్ను
ఒడ్డున మొసలి
గొగ్గిరి వెన్ను

కృష్ణ బిలం
రాక్షసి నోరు
దడ దడ ఊపే
తుఫాను హోరు

పిడుగుపాటుకి
కూలే వృక్షం
రాలే ఉల్క

ఊగే పైరు
రేగే ఆకలి
ఈయనేనట అన్నీ.

పువ్వుల విసురుకి
గంట గణగణలకి
తొణకడసలే
అగరొత్తుల పొగల్లోంచి
చూస్తూన్నాడు
నా ఉలికిపాటు
కళ్ళల్లోకి.