ఊర్మిళాదేవి నిద్ర

ఊర్మిళాదేవి నిద్ర

ప్రొ. మలయవాసిని గారు ఈమాట కోసం ప్రత్యేకంగా ఈ గీతాన్ని నవంబర్ నెల మొదట్లో, మిన్నెసోటాలో పాడి రికార్డ్ చేసి మాకు పంపించారు. అమెరికా పర్యటన ముగించుకొని తిరిగివెళ్ళే తొందరలో ఉండి కూడా, మేమడగ్గానే ఎంతో ఓపికతో ఈ పాట పూర్తిగా పాడి మాకందించినందుకు వారికి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.

పాఠకుల సౌలభ్యం కోసం ఈ క్రింద ఊర్మిళాదేవి నిద్ర పాట సాహిత్యం అందిస్తున్నాం. ఐతే, వెల్చేరు నారాయణ రావుగారు తన వ్యాసంలో చెప్పినట్లుగా, ఈ పాట ఎన్నిసార్లు అచ్చయినా కూడా తప్పులతోనే అయింది. మాకందుబాటులో ఉన్న ప్రతుల్లో ఎస్.వి. గోపాల్ అండ్ కో. ప్రచురణే కొంచెం మెరుగ్గా ఉండడంతో ఆ ప్రతినే ఇక్కడ ప్రచురిస్తున్నాం. – సం.