చలాన్ని దూషణ భూషణ తిరస్కరణలు చేసేవాళ్లంతా కూడా మైదానం నవల చదివారు, ఇక ముందు కూడా చదువుతారు. పూర్వం పడకగదుల్లో దిండు కింద దాచుకుని ఎవరికీ తెలియకుండా కూడా చదివేవారట. ఇప్పటికీ నేమో. మైదానం నవల ఆకర్షణ అంతటిది.
వాడ్రేవు వీరలక్ష్మీదేవి
వాడ్రేవు వీరలక్ష్మీదేవి రచనలు
ఈ సంవత్సరం జ్ఞానపీఠ్ అవార్డ్ ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన వినోద్‌కుమార్ శుక్లాకు లభించింది. ఈ సందర్భంగా ఆయన రాసిన ‘దీవార్ పర్ ఏక్ ఖిడికీ రహతీ థీ’ అనే హిందీ నవల గురించి భారతీయ నవలా దర్శనం అన్న పుస్తకంలో వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు రాసిన వ్యాసాన్ని ఈమాట పాఠకులకోసం పునర్ముద్రిస్తున్నాం.
ఇందులో ఎందరో మంచి మంచి స్నేహితులు, బంధువులు ఆత్మీయులుగా మారిన పరిచయస్తులు ఉన్నారు. చిన్న చిన్న సహాయాలు కూడా మర్చిపోని గొప్ప వ్యక్తులున్నారు. ప్రతిచోటా ఆదరించి అన్నం పెట్టిన తల్లులున్నారు, బీదరికంలో ఉంటూ కూడా. రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉంటే ఇంటికి తీసికెళ్ళి సేదదీర్చిన ‘లఖ్నవీ అమ్మ’లున్నారు.
నవలా రచయితగా సుబ్రహ్మణ్య శాస్త్రిగారి గురించి చెప్పుకోవలసిన అంశాలలో ప్రధానమైనది భాష. భాష విషయంలో ఆయనలో క్రమక్రమంగా వచ్చిన మార్పుకు ఈ నవలలు దర్పణాలు. మొదటి రెండు నవలల్లోనూ పండిత లోకం శిరసున ధరించే వరమ ప్రామాణికమైన గ్రాంథిక భాష. వర్ణనాత్మకమయిన శైలీ విన్యాసంతో అలరారిన భాష. నవల మొదలుపెడితే ఆపకుండా చదివించగల ధారాప్రవాహం లాంటి సారళ్యతను ఆ గ్రాంథిక రచనలో కూడా సాధించగలగడం శాస్త్రిగారి విశేష ప్రజ్ఞ.
ప్రతి సంవత్సరం కాకినాడ లోని ఇస్మాయిల్ మిత్రమండలి ఇచ్చే ఇస్మాయిల్ కవితా పురస్కారానికి గాను 2010 సంవత్సరంలో వచ్చిన ‘రెండో పాత్ర’ కవితా సంకలనం ఎంపికయ్యింది. కవి విన్నకోట రవి శంకర్.