Comment navigation


15714

« 1 2 3 4 5 6 ... 1572 »

  1. వచన రచనలో పదస్వరూపాలు, సింటాక్స్ గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    03/01/2025 6:56 am

    ఎంతో అవసరమైన వ్యాసం!

    ఎలనాగ గారికి ధన్యవాదాలు!

  2. బెష్టు ఫ్రెండ్స్ గురించి అన్వర్ గారి అభిప్రాయం:

    03/01/2025 6:51 am

    ఈ నెల ఈ మాటలో అంతకు ముందు నెల ఈ మాటలో వచ్చిన స్వాతికుమారి బండ్లమూడిగారి రెండు కథలు ఎంత మంచి కథలో, ఎంతెంత మంచి కథలో. ఇంత మంచి కథలు చదవడానికి లేక పతంజలిగారు మిస్సయి పోయారు కదా అని అనిపించేంత మంచి కథలు. ఇంత మంచి కథలకు బొమ్మలేయకుండా బాపుగారు కూడా మిస్సయి పోయారు అని కూడా దిగులు పడేంత ఉత్తమ కథలు. పోనీ ఆర్కే లక్ష్మణ్ ఉండి ఉన్నా నయంగా ఉండేది. ఆయన ఈ కథలలో ఒకటైన “బెష్టు ఫ్రెండ్స్”కు వేసే బొమ్మలతో మాల్గుడి వాళ్ళ నాయనమ్మ బండ్లమూడి డేస్ అంత గొప్పగా ఉండేది.

  3. కుడి ఎడమైతే పొరపాటు ఉందా? గురించి శారద ( బ్రిస్బేన్ ) గారి అభిప్రాయం:

    03/01/2025 2:00 am

    చాలా క్లిష్టమైన విషయాన్ని, వివరంగా, ఆసక్తికరంగా చెప్పారు. వ్యాసం చాలా బాగుంది. ధన్యవాదాలు.
    శారద

  4. శంభో తవారాధనం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:

    02/27/2025 11:50 am

    ఈమధ్యా కాలంలో నాజీవితం కొంత కల్లోలంగా ఉన్న కారణంగా ఎక్కువగా చదువటంలేదు. వీలు పడక.

    ఈ ఉదయం ఈ రచన నుండి ఈక్రింది పద్యం నాకొక మిత్రులు పంపారు.

    నెత్తిన బెట్టుకొంటి విధునెన్న సగంబె సితాద్రి కన్య క
    న్హత్తుక మేన దాల్చినది యయ్యదియున్ సగమే రతీపతి
    న్మొత్తము జంపలేదు విషమున్‍ బరిపూర్తిగ తాగలేదు గ
    మ్మత్తు సగాల దేవర శివా నిను చిందులు వేసి బాడెదన్! 10

    ఈపద్యంలో మొదటిపాదంలో అఖండయతి ఉన్నది, అది పెద్దదోషం కాదు. ఎందుకంటే అఖండయతిని పెద్దకవులు వాడిన సందర్భాలున్నాయి కాబట్టి. సమర్ధించిన సందర్భాలూ ఉన్నాయి కాబట్టి. అదటుంచండి.

    ఈపద్యంలో చివరిపాదంలో యతిమైత్రి కుదరలేదు. గమ్మత్తు అన్నది ఏకపదం కాబట్టి యతిమైత్రి స్థానంలో మకారానికి మైత్రి కల అక్షరంవాడక తప్పదు. శివా అన్న సంబోధనలోని ఆ-కారానికి మైత్రి కుదర్చటం సాధ్యపడదు నాకు తెలిసి.

    ఇక్కడ ఈ యతిమైత్రి భంగం కావటం గురించి ఒక్క ప్రశ్న ఈపద్యకృతిని ఈమాట వారు పండితపరిశీలకు పంపే ఉంటారు కదా! ఈదోషం గమనికకు రాలేదా అని ఆశ్చర్యం కలుగుతున్నది.

    నేనింకా ఈ రచనను పూర్తిగా చదువలేదు. ఐనా కొన్ని వ్యాఖ్యలను చూచి ఇది చాలా బాగుందన్న అభిప్రాయాలను గమనించి సంతోషించాను. వీలువెంబడి తప్పక చదువుతాను. తప్పులుపట్టేందుకు కాదు లెండి.

  5. శంభో తవారాధనం గురించి Srinivasa Chary Vuruputuri గారి అభిప్రాయం:

    02/26/2025 7:20 am

    చాలా రోజుల తరువాత మహాశివరాత్రి రోజున ఎక్కడా నిలవకుండా ఉన్న మనసుకు ఈ తహతహ పుట్టించే పద్యాలు గుర్తుకువచ్చాయి. అబ్బురపాటుతో ఒక్కో పద్యం చదువుతూ ఉండిపోయాను. తఃతః గారికి అనేకధన్యవాదాలు.

  6. ఎవరెస్ట్ బేస్ కాంప్ 4 గురించి Amarendra గారి అభిప్రాయం:

    02/19/2025 2:29 am

    శర్మగారూ, మీ అదనపు సమాచారానికి ధన్యవాదాలు. మీరు ఈ వ్యాస శృంఖలను ఎంత ఆసక్తితో చూస్తున్నారో తెలుస్తోంది.

    బైదవే… కోర్టులో కేసు విషయం ఏం చేసారూ?! బాబ్బాబు, వెయ్యండి.వెయ్యండి – మీకూ మాకూ పేరూ ప్రతిష్ఠా!

  7. ఎవరెస్ట్ బేస్ కాంప్ 4 గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    02/17/2025 8:56 am

    నెట్‍ఫ్లిక్స్‌లో ఈ విషయం మీద ‘మౌంటైన్ క్వీన్‘ అనే సినిమా వచ్చింది. ఈవిడ ఎవరెస్ట్ పది సార్లు ఎక్కారుట. ఎన్ని కష్టాలు పడ్డారో, జీవితం అదీ పూర్తిగా చెప్పారు. మంచి సినిమా. రివ్యూలు కూడా అద్భుతం. కనెక్టికట్‍లో అవార్డ్ వచ్చాక కె-2 కూడా ఎక్కారుట. మనోధైర్యం, పట్టుదల అద్భుతం. వేల మైళ్ళ దూరంలో ఎవరూ లేకుండా ఒక్కరూ జీవితంలో అలా నెట్టుకు రావడం అంత ఈజీవీజీ కాదు. హాట్స్ ఆఫ్!

  8. స్వల్ప విరామంలో… గురించి Chandra Shekhar Pratapa గారి అభిప్రాయం:

    02/14/2025 7:51 pm

    అమావాస్య రాత్రుల్లో సేద తీరే చంద్రుడు. తీరానికి కొట్టుకొచ్చిన విసిరేసిన గడియారం! చాలా నచ్చిన expressions. అభినందనలు సర్!

  9. రాగలహరి: హిందోళం గురించి వినోద్ కుమార్ ఆవల గారి అభిప్రాయం:

    02/11/2025 1:38 pm

    చాలా చక్కగా సంగీతం అంటే చాలా ఇష్టం నాకు కానీ అందులో రకరకాల ప్రయోగాలు ఉన్నాయని అపుడపుడు విన్నాను. అందులో ముఖ్యంగా శంకరాభరణం సినిమాలో సామజవరగమన పాటలొ హిందోళం అనే సంగీత ప్రక్రియ గురించి విన్నాను! ఒక ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పటికీ నాకు సంగీతం అంటే చాలా ఆసక్తి. తెలుగులోనైతే పాత పాటలు మరియు 60,70 దశకంలో వచ్చిన పాటలు నాకు చాలా ఇష్టం. అంతే కాదు హిందీలో కూడా మొహమ్మద్ రఫి మరియు కిషోర్ కుమార్ గార్ల పాటలు నాకు బాగా నచ్చుతాయి.

  10. కాలం కథ గురించి అల్లాడి మోహన్ గారి అభిప్రాయం:

    02/07/2025 4:25 am

    శ్రీ నౌడూరి సూర్యనారాయణ మూర్తిగారి “కాలం కథ” అనే వ్యాసం కలకాలం నిలిచే కాలాతీతమైన వ్యాసం!

    సాంకేతిక ప్రమాణాలూ, నిదర్శనలూ, ఆధారాలతో “కాలం” గురించి ఎన్నో విషయాలు తెలిపిన చక్కటి విశ్లేషణాత్మకమైన వ్యాసం “కాలం కథ”, ఒక సిద్ధాంత గ్రంథానికి సరిసమానమైనది.

    నేను చదువుకున్నది ఆంగ్లమాధ్యమ పాఠశాలలో అయినా, మాతృభాషలో విజ్ఞాన శాస్త్రం అభ్యసిస్తేనే సాంకేతికతపై పట్టువస్తుంది అనే ఉద్దేశ్యంతో ఇంటి వద్ద గణితం, భౌతిక, రసాయన, సాంఘిక శాస్త్రాలు తెలుగు మాధ్యమం పుస్తకాల సాయంతో అభ్యసించాను. దీనికి కారణం పురపాలక సంఘం ఉన్నత పాఠశాలలో తెలుగు మాధ్యమంలో గణితం బోధించే ఉపాధ్యాయురాలైన మా అమ్మగారి సలహానే. ఈ విధమైనటువంటి అధ్యయనం చెయ్యడం తరువాతి కాలంలో వైద్యశాస్త్ర పరిశోధనా రంగంలో అత్యున్నత స్థాయిలో రాణించడానికి నాకు దోహద పడింది.

    ఈ విషయం ఇక్కడ ఎందుకు ప్రసావిస్తున్నాను అంటే, ఈ వ్యాసంలో సమగ్రంగా, విస్తృతంగా, క్లిష్టమైన సాంకేతిక పదజాలాన్ని అందమైన, అందరికీ అర్థమయ్యే సులభమైన, తెలుగు పదాల ద్వారా పరిచయం చేసి శ్రీ మూర్తిగారు మహదానందాన్ని కలిగించారు. ఆవసరమైన చోట్ల కుండలీకరణాలలో సమాంతర ఆంగ్లపదాలను పొందుపరచడంతో సాంకేతిక భాషా ప్రవాహం సులభంగా అర్థం అవుతూ చక్కగా సాగింది.

    పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ విజ్ఞాన శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు ఇటువంటి వ్యాసాలను సూచించి, బోధిస్తే, విద్యార్థులకు సరియైన శాస్త్రీయ అవగాహన కలుగుతుంది, విజ్ఞాన శాస్త్రం అధ్యయనం చెయ్యాలన్న స్ఫూర్తి కలుగుతుంది. ఈ వ్యాసం భౌతిక, విజ్ఞాన శాస్త్రపరంగానూ, తెలుగు భాషా విలువల పరంగానూ ఉన్నతమైన విలువలు కలిగినది.

    చివరాఖర్లో ఒక మాట. “కాలం” కేవలం వైజ్ఞానిక అంశమే కాకుందా, అధ్యాత్మిక అంశం కూడా. ఈ వ్యాసం చదివాక కూడా, గతంలో ఈమాట, జులై 2022 సంచిక లో శ్రీ మూర్తిగారు వ్రాసిన “కాలరేఖ” చదివినప్పుడు మాదిరిగానే ఋగ్వేదాంతర్గతమైన నాసదీయ సూక్తం గుర్తుకు వచ్చింది.

    శ్రీ మూర్తిగారికి మరోసారి అభినందనలు.

    వారికి నమస్సులు.

« 1 2 3 4 5 6 ... 1572 »