వేమూరిగారి కథనం చక్కగా, ఉత్కంఠభరితంగా ఉంది. అంతకన్నా ముఖ్యంగా, ఈ సంక్షిప్తరూపం చదివిన తర్వాత పూర్తి కావ్యాన్ని ఆంగ్లంలో చదవాలనే ఆసక్తి కలిగించింది.
“ఈ ట్రాయ్ యుద్ధానికి సంబంధించి సీరియల్ చందమామలో వచ్చింది,” అని తాడిగడపగారు రాయగా వెతికాను. 1956–57 ప్రాంతంలో “భువనసుందరి,” “రూపధరుడి యాత్రలు” సీరియల్స్‌గా వచ్చాయి.
అక్టోబరు 1956 చందమామ సంపాదకీయం నుండి:
“ఈ కథకు చెందిన పాత్రల పేర్లు పాఠకుల సౌకర్యం కొరకు మార్చబడ్డాయి. కాని స్థలాల పేర్లలో గాని, కథలో గాని మార్పులేమీ లేవు. ఈ కథ చదువుకొనేటప్పుడు మీకు అనేక చోట్ల రామాయణ, భారత కథలు జ్ఞాపకానికి రావచ్చు. దీనివల్ల ప్రపంచ నాగరికత అంతా ఒకే కుటుంబం నుంచి వచ్చిందన్న సంగతి స్పష్టమవుతుంది.”
రూపధరుడు, ధీరమతి, పిపీలకుడు, పద్మముఖి, రారాజు — ఇలా పేర్లన్నీ తమాషాగా ఉన్నాయి. వర్ణచిత్రాలు అద్భుతం.
శ్రీ అమరేంద్ర : మీరు సూర్యారావు పేటలోని నక్కల రోడ్డులో ఉండిన డా పార్థసారథి గారి గురించేనా చెబుతున్నారు? డా. పార్థసారథి , డా. జార్జ్ ఒకే కాంపౌండ్ లో ప్రాక్టిస్ చేసేవారు. డా. జంధ్యాల దక్షిణామూర్తిగారి డిస్పెన్సరీ కిటకిటలాడిపోతుండేది. విజయవాడలో డా. నందివాడ హనుమత్సీతాపతి అని ఒక హొమియో డాక్టర్ గారి డిస్పెన్సరీ అయితే మరీనూ. “తిని తిరిగేవాడికి మందు ఇవ్వద్దని చేప్పేవారు, మా గురువుగారు” అంటూండేవారాయన. – హోమియో డాక్టర్ల గురించికూడా చెప్పుకోవాలేమో వారిలో చాలా మంది క్వాక్‌లే అయినా. నమస్కారాలతో – తః తః
కొంతమందిది మిడాస్ టచ్
హనుమంతరావు గారు ఏం రాసినా అది సూటిగా చదివేవారి మనసును తాకుతుంది – అసలు ఆయన రాసేదే మనసుతో.
*
నా చిన్నపుడూ ఒక అయ్యవారు మరో ఎమ్బీబిఎస్ డాక్టరూ పేషెంట్లను ఎంతో ప్రేమగా చూడటం గుర్తు. అరవైల రోజులవి. విజయవాడ అరండల్ పేట. చిన్న సమస్యలకు డాక్టర్ కోకా చలపతిరావుగారి దగ్గరికి వెళ్లేవాళ్లం. ఆయన మితభాషి. అయినా ఆయన్ని చూడగానే జ్వరం సగం తగ్గిపోయేది.
ఫైలేరియాలాంటి పెద్ద సమస్యలకు అమ్మ సూర్యారావు పేటలోని డాక్టర్ పార్ధసారధి ఎమ్బీబిఎస్ దగ్గరకు తీసుకు వెళ్లేది. రూపాయి డాక్టరు. చతుర సంభాషణాశీలి. గొప్ప హస్తవాసి.
ఇప్పటికీ అప్పటి సీవీయార్ హైస్కూలు క్లాస్మేట్లం కలుసుకున్నపుడు వీళ్లిద్దర్నీ ఇష్టంగా తలచుకొంటూ ఉంటూ ఉంటాం.
ఓడిస్సీ – చివరిమాట గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
09/04/2026 10:09 pm
వేమూరిగారి కథనం చక్కగా, ఉత్కంఠభరితంగా ఉంది. అంతకన్నా ముఖ్యంగా, ఈ సంక్షిప్తరూపం చదివిన తర్వాత పూర్తి కావ్యాన్ని ఆంగ్లంలో చదవాలనే ఆసక్తి కలిగించింది.
“ఈ ట్రాయ్ యుద్ధానికి సంబంధించి సీరియల్ చందమామలో వచ్చింది,” అని తాడిగడపగారు రాయగా వెతికాను. 1956–57 ప్రాంతంలో “భువనసుందరి,” “రూపధరుడి యాత్రలు” సీరియల్స్‌గా వచ్చాయి.
అక్టోబరు 1956 చందమామ సంపాదకీయం నుండి:
“ఈ కథకు చెందిన పాత్రల పేర్లు పాఠకుల సౌకర్యం కొరకు మార్చబడ్డాయి. కాని స్థలాల పేర్లలో గాని, కథలో గాని మార్పులేమీ లేవు. ఈ కథ చదువుకొనేటప్పుడు మీకు అనేక చోట్ల రామాయణ, భారత కథలు జ్ఞాపకానికి రావచ్చు. దీనివల్ల ప్రపంచ నాగరికత అంతా ఒకే కుటుంబం నుంచి వచ్చిందన్న సంగతి స్పష్టమవుతుంది.”
రూపధరుడు, ధీరమతి, పిపీలకుడు, పద్మముఖి, రారాజు — ఇలా పేర్లన్నీ తమాషాగా ఉన్నాయి. వర్ణచిత్రాలు అద్భుతం.
కొడవళ్ళ హనుమంతరావు
నింగీ, నీరూ, నికోబార్-1 గురించి బండ్ల మాధవరావు అభిప్రాయం:
09/04/2026 2:27 pm
నీకొబార్ మేము మిస్ అయ్యాము. మళ్లీ ఒకసారి అండమాన్‍లో విహరింపజేశారు. ధన్యవాదాలు అమరేంద్ర గారూ
నింగీ, నీరూ, నికోబార్-1 గురించి A R Babu Goud అభిప్రాయం:
09/04/2026 1:26 am
Excellent work 🙏
అయ్యగారు – కొత్త డాక్టరు గురించి Amarendra Dasari అభిప్రాయం:
09/03/2026 10:36 am
తఃతః గారు
అవునండి..ఆయనే
ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ గురించి Hanamtharao అభిప్రాయం:
09/03/2026 3:37 am
చాలా బాగుంది. చదవాల్సిన కథల గురించి చదవాల్సిన సంగతులు! నిజంగానే మాట్లాడుతున్నప్పుడు వినాల్సింది. నయం … కనీసం చదివాం!!
అయ్యగారు – కొత్త డాక్టరు గురించి తః తః అభిప్రాయం:
09/02/2026 10:58 pm
శ్రీ అమరేంద్ర : మీరు సూర్యారావు పేటలోని నక్కల రోడ్డులో ఉండిన డా పార్థసారథి గారి గురించేనా చెబుతున్నారు? డా. పార్థసారథి , డా. జార్జ్ ఒకే కాంపౌండ్ లో ప్రాక్టిస్ చేసేవారు. డా. జంధ్యాల దక్షిణామూర్తిగారి డిస్పెన్సరీ కిటకిటలాడిపోతుండేది. విజయవాడలో డా. నందివాడ హనుమత్సీతాపతి అని ఒక హొమియో డాక్టర్ గారి డిస్పెన్సరీ అయితే మరీనూ. “తిని తిరిగేవాడికి మందు ఇవ్వద్దని చేప్పేవారు, మా గురువుగారు” అంటూండేవారాయన. – హోమియో డాక్టర్ల గురించికూడా చెప్పుకోవాలేమో వారిలో చాలా మంది క్వాక్‌లే అయినా. నమస్కారాలతో – తః తః
అయ్యగారు – కొత్త డాక్టరు గురించి Amarendra Dasari అభిప్రాయం:
09/02/2026 7:21 pm
కొంతమందిది మిడాస్ టచ్
హనుమంతరావు గారు ఏం రాసినా అది సూటిగా చదివేవారి మనసును తాకుతుంది – అసలు ఆయన రాసేదే మనసుతో.
*
నా చిన్నపుడూ ఒక అయ్యవారు మరో ఎమ్బీబిఎస్ డాక్టరూ పేషెంట్లను ఎంతో ప్రేమగా చూడటం గుర్తు. అరవైల రోజులవి. విజయవాడ అరండల్ పేట. చిన్న సమస్యలకు డాక్టర్ కోకా చలపతిరావుగారి దగ్గరికి వెళ్లేవాళ్లం. ఆయన మితభాషి. అయినా ఆయన్ని చూడగానే జ్వరం సగం తగ్గిపోయేది.
ఫైలేరియాలాంటి పెద్ద సమస్యలకు అమ్మ సూర్యారావు పేటలోని డాక్టర్ పార్ధసారధి ఎమ్బీబిఎస్ దగ్గరకు తీసుకు వెళ్లేది. రూపాయి డాక్టరు. చతుర సంభాషణాశీలి. గొప్ప హస్తవాసి.
ఇప్పటికీ అప్పటి సీవీయార్ హైస్కూలు క్లాస్మేట్లం కలుసుకున్నపుడు వీళ్లిద్దర్నీ ఇష్టంగా తలచుకొంటూ ఉంటూ ఉంటాం.
అయ్యగారు – కొత్త డాక్టరు గురించి కె.వి.గిరిధరరావు అభిప్రాయం:
09/02/2026 12:25 am
మంచి తెలుగు, సరళమైన వచనంలో పంచుకున్న జ్ఞాపకాలు బాగున్నాయి. వ్యాసం చదువుతూంటే, నా చిన్నప్పటి జ్ఞాపకాలు కొన్ని గుర్తొచ్చాయి. రచయితకు ధన్యవాదాలు.
అయ్యగారు – కొత్త డాక్టరు గురించి v.srinivasa rao అభిప్రాయం:
09/01/2026 3:11 pm
వ్యాసం శైలీ, విషయం మనసుకు హత్తుకున్నాయి .
సోల్జర్ చెప్పిన లోగుట్టు: కరవాలానికి కులమా? గురించి TRNRAO అభిప్రాయం:
09/01/2026 9:24 am
కరవాలానికి కులమా? అంటూ భారత సైన్యం గురించి చక్కటి విశ్లేషణతో కూడిన అభిప్రాయం చాలా బాగుంది.