Comment navigation


15549

« 1 ... 138 139 140 141 142 ... 1555 »

  1. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి Veerabhadrappa Muchandi గారి అభిప్రాయం:

    07/15/2022 6:46 pm

    సురేశ్ గారు, పొరబడ్డట్టు ఉన్నారు.

    వేదాలలో కనిపించని గణపతి అన్నారు. మరి అథర్వశీర్ష మంత్రముల్లో గణపతి కీర్తించ బడ్దాదు కదా?

    పదవ శ్లోకం
    నమో వ్రాతపతయే| నమో గణపతయే| నమః ప్రమథ పతయే| నమస్తే అస్తు|
    లంబోదరాయైక దంతాయ విఘ్ననాశినే శివసుతాయ వరద ముర్తయే నమః||

    ఇక్కద “శివసుతాయ” అని స్పష్తముగా ఉన్నది.

    ఎనిమిదవ శ్లోకం

    ఏకద॒న్తాయ॑ వి॒ద్మహే॑ వక్రతు॒ణ్డాయ॑ ధీమహి|

    తన్నో॑ దన్తిః ప్రచో॒దయా త్||

    ఇంకా పూర్తి స్వరుప వివరణ తొమ్మిదో శ్లోకం లో

    ఏకద॒న్తం చ॑తుర్హ॒స్త॒o పా॒శమ॑ఙ్కుశ॒ ధారి॑ణం|

    రద॑o చ॒ వర॑దం హ॒స్తై॒ర్బి॒భ్రాణ॑o మూష॒కధ్వ॑జం|

    రక్త॑o ల॒ఒబోద॑రం శూ॒ర్ప॒క॒ర్ణక॑o రక్త॒వాస॑సం|

    రక్త॑గ॒న్ధాను॑లిప్తా॒ఙ్గ॒o ర॒క్తపు॑ష్పైః సు॒పూజి॑తం|

    భక్తా॑ను॒కమ్పి॑నం దే॒వ॒o జ॒గత్కా॑రణ॒మచ్యు॑తం|

    ఆవి॑ర్భూ॒తం చ॑ సృ॒ష్ట్యా॒దౌ॒ ప్ర॒కృతే పురు॒షాత్ప॑రం|

    ఏవ॑o ధ్యా॒యతి॑ యో ని॒త్య॒o స॒ యోగీ॑ యోగి॒నాం వ॑రః||

    గణపతి వేదము నందు ప్రతిపాదించ బడిన దేవత అనటానికి ఈ ప్రమాణలు చాలునేమో!

  2. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి రోజు గురించి Srinivas Bandaa గారి అభిప్రాయం:

    07/12/2022 3:22 am

    గిరీష్ గారూ, ధన్యవాదాలు!

  3. అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు గురించి ఎ. కె. ప్రభాకర్ గారి అభిప్రాయం:

    07/11/2022 9:30 pm

    చాలా మంచి సమీక్ష. కొత్త తరానికి పిచ్చేశ్వరరావు గారి కథల మీద ఆసక్తి కలిగించే విధంగా సమగ్రంగా ఉంది. పిచ్చేశ్వరరావు కథల్లో శిల్ప వైవిధ్యాన్ని , ఆయన రాజకీయ తాత్వికతనీ ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఆ విషయాన్ని సమీక్ష హైలైట్ చేసింది.

  4. కృష్ణ: లలిత గీతాలు గురించి తః తః గారి అభిప్రాయం:

    07/11/2022 6:49 am

    శ్రీ కిభశ్రీ: మీ అభిప్రాయము లో మీకున్న సాహిత్య పరిచయమూ, లలిత గీతాల పై మక్కువా, సంగీతం లో ఉన్న అభినివేశమూ కనపడి సంతోషమైనది.యాదృచ్చికంగా ఈ మధ్య మిత్రులు శ్రీనౌడూరి మూర్తి -వాట్స్యాప్ లో – పాత కాలంనాటి మరొక కృష్ణ లలిత గీతాన్ని గుర్తుకు తెచ్చారు. పాటలు పాడుకోటానికి’అనుమతి’ ఏమిటి?-If it is just a formality, please get going!

    గతం: కృష్ణ లలిత గీతాల మొదలు 1973-75 ప్రాంతాలు. కొన్ని పాటలను ఆంధ్ర విశ్వకళాపరిషత్ డా వాసిరెడ్డి శ్రీ కృష్ణ స్మారక గ్రంథాలయం లో కొన్నాళ్ళు పనిచేసి, తర్వాత ఢిల్లీ లో- [‘ఈమాట’ కు ఎన్నో విశిష్టమైన రచనలు చేసిన ఆచార్య ఏల్చూరి మురళీధర రావు గారు పనిచేసిన] శ్రీ వేంకటేశ్వర కళాశాలకు మారిన శ్రీ పింగళి సూర్య ప్రభాకర రావు గారు – శాస్త్రీయ సంగీతంలో ఎం యస్ బాలసుబ్రహ్మణ్యశర్మ గారి శిష్యులు, స్వరపరిచారు. వారు వాటిలో పీలూ లో చెసిన ఒక పాటను AIR External services లో పాడినానని చెప్పిన గుర్తు. వారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఏణ్ణర్థం క్రితం కోవిద్ రోజుల్లో మళ్ళీ వారితో సంభాషణం కొంత సాగింది. వారు వేరొక పాటను భాగీశ్వరి లో చెసారు. వారు ‘పగలు ప్రతి గడియ’ను ‘ధర్మవతి’ లో చేసిన గుర్తు I am not sure, ఆ వీడియో సరిగా డవున్లోడ్ అవలేదు, అప్పుడే కోవిద్ నుంచి కోలుకున్న వారిని’ మళ్ళీ పంపండని’ నేను ఇబ్బంది పెట్టలేదు.)

    నమస్కారాలతో -తః తః

  5. ఊహల ఊట 14 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:

    07/11/2022 1:25 am

    ముళ్ళచెంచా బాగుంది.

    13 ఎపిసోడ్ ల తర్వాత కుంతలనే పేరు చెప్పడం బాగుంది చిన్న వయస్సులో ఊహలు ఎంత తీపిగా ఉంటాయో అద్భుతంగా చిత్రీంచిన తులసి మేడం గారికి అభినందన వందనాలు.

  6. కృష్ణ: లలిత గీతాలు గురించి Srinivasa Bharadwaj Kishore (kiBaSrI) గారి అభిప్రాయం:

    07/10/2022 9:38 pm

    తఃతః గారు,

    రెండు రచనలూ అద్భుతమైన భావన కలిగి వున్నాయి. ఈ మధ్యకాలంలో నేను చదివిన భావగీతాలకు అనుగుణంగా వున్న రచనలలో అత్యుత్తమమైన స్థాయిలో వున్న వాటిలో చేరుతాయి ఈ రెండూ.

    మీ అనుమతి వుంటే వీటిని స్వరపరచి, నేను నిర్వహించే “లలిత భారతి” కార్యక్రమంలో మంచి గాయకులతో పాడించగలను.

  7. శిఖరారోహణ గురించి D Seetharam గారి అభిప్రాయం:

    07/10/2022 7:33 pm

    Lovely story! Very inspirational!

  8. కొన్ని నూతనచ్ఛందోరీతులు గురించి దేశికాచార్యులు గారి అభిప్రాయం:

    07/10/2022 10:04 am

    శర్మగారూ, ఆవ్యాసాన్ని చదివి మీ అభిప్రాయాన్ని వెలిబుచ్చినందుకు కృతజ్ఞతలు.

    1. నయాగరావృత్తం ఒక గురువు తక్కువైన శార్దూలవృత్తమే. అందుచేత శార్దూలాన్ని చదువగల్గినవారు దీనిని చదువుటలో ఇబ్బంది ఉండగూడదు. అందుకు ఉదాహరణంగా ఇచ్చిన ఓజోగుణసహితమైన ‘ఖడ్గాఖడ్గిగ’ అను దానిని చదువలేక పోయినను, రెండవ ‘రాజావాక్షిని’ అనే పద్యాన్ని సులభంగా చదువగలిగి ఉండాలి. అదిగూడ సాధ్యం కాదంటే, దానికి మూల మీ వృత్తలక్షణాల్లో కాక ఇతరత్రా ఉందని అనుకోవాలి.
    2. ‘సహవాసదోషేణ గుణాని భవన్తి’ అని ఉన్నదే కదా! నా బహుకాలపాశ్చాత్యదేశసహవాసవాసనాదోషము లా అభారతీయములైన నాల్గు వృత్తాల పేర్లు.
    3. ముందుగా యతిస్థానమేదో చెప్పినను, దానిని కంటికి సువ్యక్తంగా చేయుటకు ఆ స్థానం పద్యాలలో నొక అడ్డగీతతో చూపబడినది. ఇది కొత్తేమీ కాదు. మీరు వసుచరిత్రవంటి గ్రంథాల ప్రామాణికమైన ముద్రితప్రతులను చూస్తే వానిలో ప్రతిపద్యంలో యతిస్థానం § గుర్తుచేత చూపబడి ఉంటుంది. ఇక్కడ అది ఒక అడ్డగీతతో చూపబడ్డది.
  9. కాలరేఖ గురించి C.Suseela గారి అభిప్రాయం:

    07/09/2022 7:44 am

    అద్భుతమైన విషయం. చాలా లోతుగా విశ్లేషించారు. 🙏

  10. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి రోజు గురించి Gireesh Kunnathattil గారి అభిప్రాయం:

    07/09/2022 5:38 am

    ఓహ్…. ఎయిర్ ఫోర్స్, అడ్మిన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మొదటి రోజుల్ని గుర్తుకు తెచ్చాయి! కాకపోతే శారీరిక శిక్షణ కాస్త తేలికగానే ఉండేది. నేను ఆరు సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్ లో పని చేసాను.

    క్రితం నెల నా కామెంటుకి మీ జవాబు ఇప్పుడే చూసాను. మీ ఊహ నిజమే! నేను జన్మత: మళయాళీనైనా, పుట్టి పెరిగింది ఆంధ్ర ప్రదేశ్ లో కాబట్టి, తెలుగు వాడినే! 🙂

    మీ రచన చాలా సరళంగా, హృద్యంగా ఉంది!

« 1 ... 138 139 140 141 142 ... 1555 »