Comment navigation


15549

« 1 ... 139 140 141 142 143 ... 1555 »

  1. కాలరేఖ గురించి జయంతి ప్రకాశ శర్మ గారి అభిప్రాయం:

    07/06/2022 7:45 am

    కథలా అనిపించలేదు. ఓ అద్భుతమైన అనుభవాన్ని అందమైన సరళమైన భాషలో అక్షరమాలగా అందించారు. విజయనగర వీధుల్లో వివహరింపచేసారు. చంద్రం మావూరి వారు, అందులో అయ్యకోనేరు గట్టువమీద వారు అని తెలిసేసరికి మా ఛాతివకూడా పొంగింది. మూర్తిగారు చాలా బాగా రాసారు. విశేషమైన విశ్లేషణలు మరోసారి చదివించాయి. నమస్కారం!

  2. నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి Alati Sathish గారి అభిప్రాయం:

    07/06/2022 5:12 am

    ప్రవరుని స్వగతం నా 10వ తరగతి స్మృతులు గుర్తుకు తెస్తున్నాయి. ఇందులో అటజనికాంచె పద్యం ఎప్పటికీ గుర్తుండి పోయే పద్యం.

  3. కలలు రాని నిద్ర గురించి సుజాత గారి అభిప్రాయం:

    07/06/2022 12:46 am

    ఎంత బావుందో అండీ ఈ కథ! అనువాదం చాలా బాగా ఆ ఫీలింగ్స్ ని ప్రతిబింబించింది. పదే పదే చదువుకున్నాను. థాంక్స్.

  4. కొన్ని నూతనచ్ఛందోరీతులు గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    07/04/2022 9:28 am

    చాలా బాగున్నాయండి. ఛందస్సు అంటే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం ఆటవెలది, తేటగీతి “మా-త్ర-మే” అనుకునే నా లాంటి వారికి ఇది మంచి వ్యాసం. 13 కోట్ల వృత్తాలనే సరికే వళ్ళు జలదరిస్తోంది. నయాగరా వృత్తం ఎంత మెల్లిగా చదువుదామన్నా నోరు తిరగటం లేదు 🙂 విలాసిని సులభంగా ఉంది.

    రెండు పనికిరాని ప్రశ్నలు అడుగుతున్నా, మీరు ఏమీ అనుకోరని అనేసుకుంటూ.

    1. మీరిచ్చిన టేబుల్ లో మొదటి నాలుగు వృత్తాలకీ తెలుగేతర పేర్లు పెట్టడానికి ఏమిటండి కారణం?
    2. యతి ముందు “-” పెట్టినప్పుడు పద్యం చదువుతుంటే అది పంటి కింద ఇంగువ ముక్కలా తగుల్తోంది. యతి ఫలనా అక్షరం అని చెప్పాక ఇంక “-” చూపించక్కర్లేదని నేననుకుంటున్నా. ఏమంటారు?

  5. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 9 గురించి Srinivas గారి అభిప్రాయం:

    07/03/2022 11:10 pm

    The story is becoming interesting.

    Traslation style is too good. It appeas as if RKL is writing his story in telugu.

    Thank you Anwar garu for giving us an opportunity to enjoy this book.

  6. కాలరేఖ గురించి అల్లాడి మోహన్ గారి అభిప్రాయం:

    07/03/2022 10:05 pm

    నిన్న, జూలై నెల “ఈమాట” అంతర్జాల పత్రిక పుటలు చూస్తూవుంటే ఈ “కాలరేఖ” కథ కనిపించింది.

    అప్పుడు చదవలేదు.

    చదవాలనిపించలేదు.

    తెల్లదొర ఫొటోతో తెలుగు కథ (ఫోటో కింద ఆ మనిషి పేరు కనిపించలేదు), అదీ సైన్స్ నేపథ్యం తో … ఇప్పుడు వద్దులే అని చదవకుండా దాటేసాను. మళ్లీ చూద్దాంలే అనుకున్నాను.

    ఇంకేదో పరిశోధనా వ్యాసం వ్రాసుకుంటున్నప్పుడు అసంకల్పితంగా ఆ “తెల్లదొర ఫోటో “ పీటర్ హిగ్గ్స్ మహాశయుడిది కదా? అని స్ఫురించింది.

    అదే సమయంలో మిత్రులు (మెడికో) శ్యామ్ లంకె పంపి “కాలరేఖ” కథ చదవమన్నారు. కాలయాపన చెయ్యకుండా మరోమారు అంతర్జాల పుటను వెతికి పట్టుకుని కథను పూర్తిగా చదివాను.

    చివరాఖరుకు వచ్చాక అర్ధమయ్యింది ఇది faction అని (fact+fiction = faction). అటుపై మళ్లీ, మళ్లీ, నా పరిశోధకుడి పద్ధతి లో చదివాను నాలుగు మార్లు.

    తెలుగులో సైన్స్ ను ముఖ్యంగా గణితం-భౌతిక శాస్త్రం-ఖగోళ శాస్త్రాలను (mathematics-physics-astronomy) ఆధ్యాత్మికతతో మేళవించి ఇలా ఓ “faction” కథ వ్రాయడం – ఒప్పించేటట్టు వ్రాయగలగడం – అంటే సాధారణ విషయమేమి కాదు – మెచ్చుకోదగ్గ సాహసమే!

    నేను సంధ్యావందనం అయ్యాక, అనుష్ఠానంలో భాగంగా చెప్పుకునే ఋగ్వేదాంతర్గతమైన నాసదీయసూక్తం, దాని భావార్థం యొక్క ఘనత, … కార్ల్ సేగన్ తన కాస్మాస్ పుస్తకంలో, టీవీ సీరీస్ లో సృష్టి ప్రారంభం, దాని పూర్వ స్థితి గురించి భారతీయ ఋషుల శాస్త్రీయమైన ఆలోచనా విధానం:

    నాస॑దాసీ॒న్నో సదా॑సీత్త॒దానీం॒ నాసీ॒ద్రజో॒ నో వ్యో॑మా ప॒రో యత్
    .
    Then even nothingness was not, nor existence,

    ఇ॒యం విసృ॑ష్టి॒ర్యత॑ ఆబ॒భూవ॒ యది॑ వా ద॒ధే యది॑ వా॒ న .
    యో అ॒స్యాధ్య॑క్షః పర॒మే వ్యో॑మ॒న్సో అం॒గ వే॑ద॒ యది॑ వా॒ న వేద॑ .. 7..

    Whence all creation had its origin,
    he, whether he fashioned it or whether he did not,
    he, who surveys it all from highest heaven,
    he knows – or maybe even he does not know.

    (English translation by A.L. Basham from his book “The Wonder that was India)

    గురించి మాటల్లో, దృశ్యాలుగా విశ్లేషించిన తీరు;

    “తరుహీన జలహీన నిర్జీవ నిర్వేల మరుభూమి ఏ బుద్ధిశాలి భావించెనో..
    సాంద్రాంధకార బంధుర దుర్గమారణ్య సీమల ఏ మహామహుడు సృష్టించెనో..
    ఆకాశచుంబి మేఘాశ్లిష్ట హిమచూడ శైలాలి ఏ మహాశిల్పి కల్పించెనో..
    భీకరాగాథ దుర్లోక పాతాళ గహ్వర సీమనెవడు కల్పన చేసెనో
    పటుశైల భేదనోద్భట పాటవమ్ము నిర్ఝరులకు ఏ అజ్ఞాత శక్తి ఒసంగునో..
    ఏ మహాగాథ పాతాళ గర్భము నుండి ఈ నిరంతర తరంగాళి పొంగెత్తునో..
    విద్యుల్లతా స్ఫీత జీమూత నిర్ఘోష భూతవిక్షేపము యే ప్రభువు శాసించునో …
    ఈ మహా బ్రహ్మాండమెవరి నిర్మాణమో…

    1947 యోగి వేమన చిత్రంలో సముద్రాల రాఘవాచార్య (సముద్రాల సీనియర్) పద్యం భావార్థం యొక్క యాదీలు;

    వెరసి ఒక చక్కటి తెలుగు కథ చదివిన అనుభూతి కలిగింది.

    కథను డౌన్లోడ్ చెసి దాచుకున్నాను.

    ఇంత అద్భుతమైన కథ వ్రాసిన శ్రీ సూర్యనారాయణ మూర్తి గారికి నమస్సులు!

  7. లక్ష్మణుని జాగారము గురించి తాడిచెర్ల రవి గారి అభిప్రాయం:

    07/03/2022 7:45 pm

    ఛందశ్శాస్త్రంలో మీ అపార పాండిత్యమునకు శతాధిక వందనాలు. ఛందస్సు ఒక సముద్రమైతే దానిలో ఆసాంతము ఓలలాడుతున్నవారు జెజ్జాల కృష్ణ మోహన్ గారు. వారికి నా నమస్కారములు🙏🙏 వాయిస్ క్లిప్ play కావటంలేదండి. దయచేసి “లక్ష్మణుని జాగారము” మీ గానము నాకు పంపగలరు. నా దూరవాణి/వాట్సాప్ నం.8919800447. మీ సమాచారమంతా ఉంది కాని ఫోన్ నం. లేదు

  8. కలలు రాని నిద్ర గురించి శారద గారి అభిప్రాయం:

    07/03/2022 3:46 pm

    ధన్యవాదాలు మూర్తి గారు.

  9. లక్ష్మణుని జాగారము గురించి Lakshminarayanamurty Ganti గారి అభిప్రాయం:

    07/02/2022 9:30 pm

    అద్భుతమైన రచన. తెలుగు సాహిత్యంలో మరోసారి మెరిసిన స్త్రీలపాటల బాణీ. నలువరాణి వాణి.

  10. జులై 2022 గురించి జి కె యస్ రాజా గారి అభిప్రాయం:

    07/02/2022 9:15 pm

    నాలుగైదు కతలు గీకినవి అచ్చోసుకుని తిరిగాకా, నా కతలు మళ్ళీ చదువుకొని పక్కనబెట్టి కాస్త మంచి సాహిత్యం అనుకున్నది చదివి, తరువాత ఇదే ప్రశ్న వేసుకున్నాను. ఈ విషయమై ఓ వ్యాసం మంచిగా రాయగలిగిన స్పృహ, సామర్థ్యం ఉండి నేను రాసుకుంటే, అది ఇలాగే ఉండేదనిపిస్తోంది.
    మంచి దృక్పథానికి వ్యాసరూపం ఇచ్చిన మీకు అభినందనలు.
    రాజా.

« 1 ... 139 140 141 142 143 ... 1555 »