శ్రీమణి గారూ, నమస్తే అండీ. మీ అమూల్యమైన స్పందనకి ధన్యవాదములు. కథని చక్కగా అర్ధం చేసుకుని మీరు స్పందించిన విధానం నాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఈ కథ వాస్తవం కాదండి. అందులోని పాత్రకి మాత్రం ఒకామె ఇన్స్పిరేషన్.
అవసరమైన వ్యాసమే, కానీ చాలా అసంతృప్తి కలిగించిన వ్యాసం.
1. పదస్వరూపాల దోషాలను, సింటాక్స్ దోషాలను ఒకే వాక్యంలో చూపించవలసినఅవసరం లేదు. ధృవం, పరిణితి, శృతి లాంటి పదాలు ఏ వాక్యంలో, ఏ స్థానంలో ఉన్నా అవి తప్పే కదా!
2. వాక్యానికి సింటాక్స్ మాత్రమే కాక సిమాంటిక్స్ కూడా ముఖ్యమే. సింటాక్స్ వేరు, సిమాంటిక్స్ వేరు. చాలా క్లుప్తంగా చెప్పాలంటే, సింటాక్స్ వ్యాకరణాన్ని సూచిస్తుంది, సిమాంటిక్స్ అర్థాన్ని సూచిస్తుంది. వాక్యం వ్యాకరణపరంగా సరైనదని నిర్ధారించడానికి అవసరమైన నియమాలు సింటాక్స్; సిమాంటిక్‌గా సరైన వాక్యంలో అర్థ సందిగ్ధత ఉండదు.
3. వ్యాసకర్త ఉదాహరించిన వాక్యాలన్నిటిలో ఉన్నవి అర్థ సంబంధమైన దోషాలు. (సమిష్టి, సాంప్రదాయం లాంటి తప్పులను మినహాయిస్తే) చాలా వాక్యాలతో వచ్చిన సమస్య: విశేషణాన్ని అది వర్ణించే పదానికి ముందో, సమీపంగానో ఉంచకపోవడం, “స్థానభ్రంశం చెందిన విశేషణం” (మిస్‌ప్లేస్‌డ్ అడ్జెక్టివ్) అన్నమాట. ఇంటువంటి దోషాలను సింటాక్స్ దోషాలనలేం. సింటాక్స్ దోషాలకు, సిమాంటిక్ దోషాలకూ తేడా చూపే ఈ ప్రసిద్ధమైన వాక్యం చూడండి: Colorless green ideas sleep furiously.
4. రామారావు-షష్టిపూర్తి ఉదాహరణలో 1,3,4 వాక్యాలు (అక్షరదోషాలు మినహాయిస్తే) ఒకటే. రెండవ వాక్యం సరిగాలేదనడానికి వ్యాసకర్త చూపిన కారణం “వాక్యంలోని పదాలు సరైన క్రమంలో లేవు.” సరైన క్రమం అంటే ఏమిటో చెప్పకపోతే ఎలా? విశేషణం, అందులోనూ నామ్నీకృతమైన క్రియాజన్య విశేషణం, అది వర్ణించే పదానికి ముందు రావాలి. “కుటుంబంలోని” (= కుటుంబంలో ఉన్న) అన్న (క్రియాజన్య) విశేషణం “అందరూ” అనే సర్వనామానికి ముందరే ఉండాలి.
5. నిజానికి మూడవ వాక్యమూ తప్పే! ఈ వాక్యంలో ఉండవలసిన పదం “అందరూ”(పదాంత దీర్ఘం గమనించాలి) “అందరు” కాదు.
6. ఈ వాక్యాలు చూడండి. 1. ఆయనకు పద్నాలుగుమంది పిల్లలట! 2. అబ్బో! ఒక వ్యక్తికి అందరు పిల్లలా! 3. అందరూ ఆయన సంతానమే, కానీ, అందరూ ఒక తల్లి బిడ్డలు కారు. రెండవ వాక్యంలో “అందరు” = అంతమంది (that many kids). కానీ మూడవ వాక్యంలో “అందరూ” = ప్రతి ఒక్కరూ.
7. పరిమాణాన్ని సూచించే సర్వనామాలకూ, వాక్యఖండాలకూ పదాంతం దీర్ఘం అయితేనే, సంపూర్ణతనూ, కొనసాగింపునూ సూచిస్తుంది. ఉదా: ఆయన 1000 ప్రతులు కొన్నాడు. ఆయన అన్ని (that many) ప్రతులు కొన్నాడా? అవును, అన్నీ (all) ఆయనే కొన్నాడు. మరొక ఉదాహరణ: “అనుభవాలూ, జ్ఞాపకాలూనూ”. వాడుక భాషలో పదాంత దీర్ఘమే సముచ్చయార్థకం.
8. “ఉత్తర ధ్రువంలో …” “కృత్రిమమేధ ..” , “నెలరోజులలో..” ఉదాహరణలలో కూడా అయోమయం క్రియాజన్య విశేషణాలు స్థానభ్రంశం చెందడం వల్ల కలిగిందే. ఓకే రకమైన సిమాంటిక్ దోషానికి రకరకాల ఉదాహరణలు ఇవ్వడం మంచిదే కానీ, అవి ఎందుకు తప్పో వివరించిన పద్ధతి (“పదక్రమం సజావుగా లేదు”) మాత్రం శాస్త్రీయం కాదు.
9. స్థానభ్రంశం చెందిన విశేషణాలు కొన్నిసార్లు నవ్వు పుట్టిస్తాయి. వాట్సాప్‌లో తరచుగా తిరిగే ఈ వాక్యం చూడండి: “భార్య ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది”. ఏడ్చినది ఎవరన్న సందేహం వస్తుంది కానీ, కూర్చున్నది ఎవరన్న సందేహం కలగదు. ఎందుకంటే “ఏడుస్తూ” అన్న అసమాపక క్రియను (క్రియా విశేషణంలాగా పని చేయిస్తూ) “ఇచ్చింది“ అనే క్రియకు గానీ, “కూర్చున్న” అన్న విశేషణానికి గానీ వర్తింపచేయచ్చు కాబట్టి.
10. “పశువులూ కోటేశూ ఒక్కసారే వచ్చారు” ఈ వాక్యం సరైనదే, కానీ ఎందుకు సరైనదన్నదానికి ఇచ్చిన వివరణ — ఇంగ్లీషులో ఇలా చేస్తారు కాబట్టి తెలుగులో కూడా అంగీకరిస్తారు — విడ్డూరంగా ఉంది! ఇంగ్లీషులో క్రియకు కర్త (యొక్క) లింగ, వచన, పురుషలను సూచించే ప్రత్యయమే ఉండదు కదా! (Simple Present tense లో తప్ప) ఆ వాక్యం సరైనది అవడానికి కారణం అమహద్వాచకం (neuter gender), మహద్వాచకం కలిసిన బహుకర్తృక పదానికి మహద్వాచక బహువచన క్రియాపదమే వర్తింపచేయాలి, లేదా ఒక కర్త పదానికి “తో” చేర్చి అముఖ్య కర్తగా చేయాలి.
11. “ఇప్పుడు నాకు దేనిమీదా ఆసక్తి లేదు”: ఈ వాక్యానికి ఇచ్చిన వివరణకూడా అసమగ్రంగా ఉంది. ఇంగ్లీషులో “no one, nowhere, nothing, never not anyone, not anywhere” లాగా తెలుగులో స్థల కాలాలను సూచించే వ్యతిరేకార్థక క్రియావిశేషణాలు లేవు. వాటికి బదులుగా ప్రశ్నార్థక సర్వనామాలకే పదాంత దీర్ఘం చేర్చి, వ్యతిరేకార్థక క్రియతో వాడాలి. He never drinks coffee: ఈ వాక్యంలో never కు సమానంగా తెలుగులో ఎప్పుడు అనే ప్రశ్నార్థక సర్వనామాన్ని దీర్ఘం చేసి వ్యతిరేకార్థక క్రియతో కలిపితే “ఆయన ఎప్పుడూ కాఫీ తాగడు” అవుతుంది. ప్రశ్నార్థక సర్వనామానికి విభక్తి ప్రత్యయం చేరితే, విభక్తి ప్రత్యయాన్ని దీర్ఘాంతం చెయ్యాలి.
12. వ్యాసకర్త ఇంగ్లీషు రచయితలనూ, బుకర్ ప్రైజ్ వచ్చిన వారి రచనా శైలిని పొగుడుతూ, తెలుగు రచయితలను మాత్రం నామకార్థం పేర్కొన్నారు. ఇది చాలా అసంతృప్తి కలిగించిన విషయం. తెలుగు వాక్య నిర్మాణానికీ, ఇంగ్లీషు వాక్య నిర్మాణానికీ ఎంతో తేడా ఉంది. ఉదాహరణకు, ముఖ్యమైన విషయాలను వాక్యం ముందు పెట్టే “fronting” తెలుగుకు (సాధారణంగా) సహజం కాదు. తెలుగు వాక్యంలో సమాపక క్రియ వాక్యం చివరిలో వస్తుంది. (“వచ్చెను అలమేలుమంగ..”, “వెడలెను కోదండపాణి…” లాంటి కీర్తనల సంగతి వేరే) తెలుగు వాక్యంలో ప్రాధాన్య వివక్ష కలిగించడానికి వాడే పద్ధతి పదాలను క్రియకు దగ్గరగా, వాక్యం చివరలో పెట్టడం, వాక్యం ముందు పెట్టడం కాదు. “నిన్న ఆయన చెన్నైనించి కారులో హైదరాబాదు వచ్చాడు” లో ప్రత్యేకమైన ఊనిక (focus) ఏ పదం మీదా లేదు. కానీ, “నిన్న”, “ఆయన”, “చెన్నైనించి” అన్న పదాలు “వచ్చాడు”కు దగ్గరగా పెడితే, వాటిపై ఊనిక ఉంటుంది. ప్రాధాన్య వివక్షకు ఉపయోగించే మరొక పద్ధతి నామ్నీకరణ (pronominalization). “ఆయన వచ్చింది నిన్న”, క్రియ లేనేలేని ఈ వాక్యంలో ప్రాధాన్యత రావడం అనే చర్య మీద. (ఇంగ్లీషులో ఇటువంటి వాక్యాలకు సమానమైన వాక్యాలను “cleft sentences” అంటారు) క్రియలేని వాక్యాలు తెలుగుకు చాలా సహజం. (ఈ వాక్యం లాగా). ఇంగ్లీషులో క్రియలేని వాక్యం వ్యాకరణ సమ్మతం కాదు.
ఈ వ్యాసం చదివితే, అసలు సంపాదకులు ఈ వ్యాసాన్ని సమీక్షించారా అన్న అనుమానం కలుగుతుంది. వారే, ఈ పత్రికలో మరొకచోట “సమిష్టి” సరైనదే అని సమర్థించారు మరి. అవసరమైన వ్యాసమే, కానీ, అస్పష్టమైన, అసమగ్రమైన వివరణలతో అసంతృప్తి కలిగించిన వ్యాసం.
నమస్తే అండి. ఒక వర్గానికి సంబంధించిన స్త్రీల జీవితాలు ఎలా మారాయో ఎంత దయనీయమైన పరిస్థితులలోనుంచి వచ్చేరో ఒక స్త్రీ అభిరామిని — ఆవిడ జీవితం ఎలా ముగిసిందో అవన్నీ చదువుతుంటే బాధతో చలించిపోయాను. ఇదంతా నిజం కాదు కదూ! అయి ఉండదులే … ఇది మీరు వ్రాసిన కథే కదా? అని ఒక్క నిముషం నాలో నేను ఆలోచించుకుని ఇది కథ మాత్రమే నిజం కాదు అని నాకు నేను సర్దిచెప్పుకోవాల్సి వచ్చింది. అంతలా కదిలించింది ఈ కథ.
గుండె బరువెక్కి కథలను చదువుతూ ఉంటాము కానీ నాకు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే కథ ఇది. మనుషుల స్వార్ధాన్ని మూఢనమ్మకాన్ని ఒక పక్క చూపిస్తూనే మతిలేకున్నా దేవుడిని మాత్రం ఉన్నాడు అని గుర్తుపెట్టుకుని గుడికి వెళ్లడం… ఆ పాత్ర చాల బాగా డిజైన్ చేసారు. ఈ స్టొరిలో అభిరామిని పాత్రని మొదట పరిచయం చేయడమే శక్తిగా చూపించారు, అ పాత్ర ముగిసేటప్పుడు ఎంతో గౌరవముతో జనాల జయజయధ్వానాలతో వీడుకోలు చేయించారు. ఆఖరికి ఒక “దేవత”ని చేసారు. ఇలాంటి పాత్రను కథను మాకు పరిచయం చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు! 🙏
ఎంతో సరళమైన భాషలో, తేట తెలుగులో ఉన్న ఈ పద్యాలు (చెన్న మల్లికార్జున ముద్ర తొలగిస్తే) భావకులు అయిన ప్రణయైక జీవులు రాసుకునే ప్రేమలేఖలా అనిపిస్తున్నాయి! ఇవి చదివితే మోహ పారవశ్యానికీ, భక్తి పారవశ్యానికీ తేడా ఇంత స్వల్పమా అనిపిస్తుంది!
అన్వర్‍గారి రచనా శైలి నాకు చాలా ఇష్టం! ఎదురుగా కూర్చుని విన్నట్లు అనిపిస్తుంది! పతంజలిగారి రచనను పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు! వారి రచనలు మరికొన్ని పరిచయం చేయమని కోరుతూ… నమస్తే!
పుంతరేవమ్మ తల్లి గురించి Srinu.kudupudi గారి అభిప్రాయం:
03/16/2025 2:22 pm
శ్రీమణి గారూ, నమస్తే అండీ. మీ అమూల్యమైన స్పందనకి ధన్యవాదములు. కథని చక్కగా అర్ధం చేసుకుని మీరు స్పందించిన విధానం నాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఈ కథ వాస్తవం కాదండి. అందులోని పాత్రకి మాత్రం ఒకామె ఇన్స్పిరేషన్.
ఈ కథపై వచ్చిన మొదటి స్పందన మీదేనండీ.🙏🙏
ఈమాట మ్యాగజైన్ వారికి మరొక్కసారి ధన్యవాదములు.
ఒకటి నుంచి పదిల దాకా… గురించి Inkota ravikumar గారి అభిప్రాయం:
03/15/2025 10:02 pm
Super
వచన రచనలో పదస్వరూపాలు, సింటాక్స్ గురించి నేర్పరి గారి అభిప్రాయం:
03/14/2025 2:18 pm
అవసరమైన వ్యాసమే, కానీ చాలా అసంతృప్తి కలిగించిన వ్యాసం.
1. పదస్వరూపాల దోషాలను, సింటాక్స్ దోషాలను ఒకే వాక్యంలో చూపించవలసినఅవసరం లేదు. ధృవం, పరిణితి, శృతి లాంటి పదాలు ఏ వాక్యంలో, ఏ స్థానంలో ఉన్నా అవి తప్పే కదా!
2. వాక్యానికి సింటాక్స్ మాత్రమే కాక సిమాంటిక్స్ కూడా ముఖ్యమే. సింటాక్స్ వేరు, సిమాంటిక్స్ వేరు. చాలా క్లుప్తంగా చెప్పాలంటే, సింటాక్స్ వ్యాకరణాన్ని సూచిస్తుంది, సిమాంటిక్స్ అర్థాన్ని సూచిస్తుంది. వాక్యం వ్యాకరణపరంగా సరైనదని నిర్ధారించడానికి అవసరమైన నియమాలు సింటాక్స్; సిమాంటిక్‌గా సరైన వాక్యంలో అర్థ సందిగ్ధత ఉండదు.
3. వ్యాసకర్త ఉదాహరించిన వాక్యాలన్నిటిలో ఉన్నవి అర్థ సంబంధమైన దోషాలు. (సమిష్టి, సాంప్రదాయం లాంటి తప్పులను మినహాయిస్తే) చాలా వాక్యాలతో వచ్చిన సమస్య: విశేషణాన్ని అది వర్ణించే పదానికి ముందో, సమీపంగానో ఉంచకపోవడం, “స్థానభ్రంశం చెందిన విశేషణం” (మిస్‌ప్లేస్‌డ్ అడ్జెక్టివ్) అన్నమాట. ఇంటువంటి దోషాలను సింటాక్స్ దోషాలనలేం. సింటాక్స్ దోషాలకు, సిమాంటిక్ దోషాలకూ తేడా చూపే ఈ ప్రసిద్ధమైన వాక్యం చూడండి: Colorless green ideas sleep furiously.
4. రామారావు-షష్టిపూర్తి ఉదాహరణలో 1,3,4 వాక్యాలు (అక్షరదోషాలు మినహాయిస్తే) ఒకటే. రెండవ వాక్యం సరిగాలేదనడానికి వ్యాసకర్త చూపిన కారణం “వాక్యంలోని పదాలు సరైన క్రమంలో లేవు.” సరైన క్రమం అంటే ఏమిటో చెప్పకపోతే ఎలా? విశేషణం, అందులోనూ నామ్నీకృతమైన క్రియాజన్య విశేషణం, అది వర్ణించే పదానికి ముందు రావాలి. “కుటుంబంలోని” (= కుటుంబంలో ఉన్న) అన్న (క్రియాజన్య) విశేషణం “అందరూ” అనే సర్వనామానికి ముందరే ఉండాలి.
5. నిజానికి మూడవ వాక్యమూ తప్పే! ఈ వాక్యంలో ఉండవలసిన పదం “అందరూ”(పదాంత దీర్ఘం గమనించాలి) “అందరు” కాదు.
6. ఈ వాక్యాలు చూడండి. 1. ఆయనకు పద్నాలుగుమంది పిల్లలట! 2. అబ్బో! ఒక వ్యక్తికి అందరు పిల్లలా! 3. అందరూ ఆయన సంతానమే, కానీ, అందరూ ఒక తల్లి బిడ్డలు కారు. రెండవ వాక్యంలో “అందరు” = అంతమంది (that many kids). కానీ మూడవ వాక్యంలో “అందరూ” = ప్రతి ఒక్కరూ.
7. పరిమాణాన్ని సూచించే సర్వనామాలకూ, వాక్యఖండాలకూ పదాంతం దీర్ఘం అయితేనే, సంపూర్ణతనూ, కొనసాగింపునూ సూచిస్తుంది. ఉదా: ఆయన 1000 ప్రతులు కొన్నాడు. ఆయన అన్ని (that many) ప్రతులు కొన్నాడా? అవును, అన్నీ (all) ఆయనే కొన్నాడు. మరొక ఉదాహరణ: “అనుభవాలూ, జ్ఞాపకాలూనూ”. వాడుక భాషలో పదాంత దీర్ఘమే సముచ్చయార్థకం.
8. “ఉత్తర ధ్రువంలో …” “కృత్రిమమేధ ..” , “నెలరోజులలో..” ఉదాహరణలలో కూడా అయోమయం క్రియాజన్య విశేషణాలు స్థానభ్రంశం చెందడం వల్ల కలిగిందే. ఓకే రకమైన సిమాంటిక్ దోషానికి రకరకాల ఉదాహరణలు ఇవ్వడం మంచిదే కానీ, అవి ఎందుకు తప్పో వివరించిన పద్ధతి (“పదక్రమం సజావుగా లేదు”) మాత్రం శాస్త్రీయం కాదు.
9. స్థానభ్రంశం చెందిన విశేషణాలు కొన్నిసార్లు నవ్వు పుట్టిస్తాయి. వాట్సాప్‌లో తరచుగా తిరిగే ఈ వాక్యం చూడండి: “భార్య ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది”. ఏడ్చినది ఎవరన్న సందేహం వస్తుంది కానీ, కూర్చున్నది ఎవరన్న సందేహం కలగదు. ఎందుకంటే “ఏడుస్తూ” అన్న అసమాపక క్రియను (క్రియా విశేషణంలాగా పని చేయిస్తూ) “ఇచ్చింది“ అనే క్రియకు గానీ, “కూర్చున్న” అన్న విశేషణానికి గానీ వర్తింపచేయచ్చు కాబట్టి.
10. “పశువులూ కోటేశూ ఒక్కసారే వచ్చారు” ఈ వాక్యం సరైనదే, కానీ ఎందుకు సరైనదన్నదానికి ఇచ్చిన వివరణ — ఇంగ్లీషులో ఇలా చేస్తారు కాబట్టి తెలుగులో కూడా అంగీకరిస్తారు — విడ్డూరంగా ఉంది! ఇంగ్లీషులో క్రియకు కర్త (యొక్క) లింగ, వచన, పురుషలను సూచించే ప్రత్యయమే ఉండదు కదా! (Simple Present tense లో తప్ప) ఆ వాక్యం సరైనది అవడానికి కారణం అమహద్వాచకం (neuter gender), మహద్వాచకం కలిసిన బహుకర్తృక పదానికి మహద్వాచక బహువచన క్రియాపదమే వర్తింపచేయాలి, లేదా ఒక కర్త పదానికి “తో” చేర్చి అముఖ్య కర్తగా చేయాలి.
11. “ఇప్పుడు నాకు దేనిమీదా ఆసక్తి లేదు”: ఈ వాక్యానికి ఇచ్చిన వివరణకూడా అసమగ్రంగా ఉంది. ఇంగ్లీషులో “no one, nowhere, nothing, never not anyone, not anywhere” లాగా తెలుగులో స్థల కాలాలను సూచించే వ్యతిరేకార్థక క్రియావిశేషణాలు లేవు. వాటికి బదులుగా ప్రశ్నార్థక సర్వనామాలకే పదాంత దీర్ఘం చేర్చి, వ్యతిరేకార్థక క్రియతో వాడాలి. He never drinks coffee: ఈ వాక్యంలో never కు సమానంగా తెలుగులో ఎప్పుడు అనే ప్రశ్నార్థక సర్వనామాన్ని దీర్ఘం చేసి వ్యతిరేకార్థక క్రియతో కలిపితే “ఆయన ఎప్పుడూ కాఫీ తాగడు” అవుతుంది. ప్రశ్నార్థక సర్వనామానికి విభక్తి ప్రత్యయం చేరితే, విభక్తి ప్రత్యయాన్ని దీర్ఘాంతం చెయ్యాలి.
12. వ్యాసకర్త ఇంగ్లీషు రచయితలనూ, బుకర్ ప్రైజ్ వచ్చిన వారి రచనా శైలిని పొగుడుతూ, తెలుగు రచయితలను మాత్రం నామకార్థం పేర్కొన్నారు. ఇది చాలా అసంతృప్తి కలిగించిన విషయం. తెలుగు వాక్య నిర్మాణానికీ, ఇంగ్లీషు వాక్య నిర్మాణానికీ ఎంతో తేడా ఉంది. ఉదాహరణకు, ముఖ్యమైన విషయాలను వాక్యం ముందు పెట్టే “fronting” తెలుగుకు (సాధారణంగా) సహజం కాదు. తెలుగు వాక్యంలో సమాపక క్రియ వాక్యం చివరిలో వస్తుంది. (“వచ్చెను అలమేలుమంగ..”, “వెడలెను కోదండపాణి…” లాంటి కీర్తనల సంగతి వేరే) తెలుగు వాక్యంలో ప్రాధాన్య వివక్ష కలిగించడానికి వాడే పద్ధతి పదాలను క్రియకు దగ్గరగా, వాక్యం చివరలో పెట్టడం, వాక్యం ముందు పెట్టడం కాదు. “నిన్న ఆయన చెన్నైనించి కారులో హైదరాబాదు వచ్చాడు” లో ప్రత్యేకమైన ఊనిక (focus) ఏ పదం మీదా లేదు. కానీ, “నిన్న”, “ఆయన”, “చెన్నైనించి” అన్న పదాలు “వచ్చాడు”కు దగ్గరగా పెడితే, వాటిపై ఊనిక ఉంటుంది. ప్రాధాన్య వివక్షకు ఉపయోగించే మరొక పద్ధతి నామ్నీకరణ (pronominalization). “ఆయన వచ్చింది నిన్న”, క్రియ లేనేలేని ఈ వాక్యంలో ప్రాధాన్యత రావడం అనే చర్య మీద. (ఇంగ్లీషులో ఇటువంటి వాక్యాలకు సమానమైన వాక్యాలను “cleft sentences” అంటారు) క్రియలేని వాక్యాలు తెలుగుకు చాలా సహజం. (ఈ వాక్యం లాగా). ఇంగ్లీషులో క్రియలేని వాక్యం వ్యాకరణ సమ్మతం కాదు.
ఈ వ్యాసం చదివితే, అసలు సంపాదకులు ఈ వ్యాసాన్ని సమీక్షించారా అన్న అనుమానం కలుగుతుంది. వారే, ఈ పత్రికలో మరొకచోట “సమిష్టి” సరైనదే అని సమర్థించారు మరి. అవసరమైన వ్యాసమే, కానీ, అస్పష్టమైన, అసమగ్రమైన వివరణలతో అసంతృప్తి కలిగించిన వ్యాసం.
సద్భావనలతో,
నేర్పరి.
3.14
బెష్టు ఫ్రెండ్స్ గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
03/14/2025 3:59 am
సిన్నప్పుడు మా కనిగిరి ఇస్కూలు సంగతులు, పిలకాలయం మావందరవు పిక్కునిక్కు కెళ్లి కనిగిరి కోట, బావులు, లోదుర్గం సూసినవి అన్నీ కాపీ కొట్టి పేర్లుమార్చి రాసినావు స్వాతా. సాంబయ్య మొహం సూసి ఊరుకుంటున్నా. లేకుంటే నీమీద కాపీరైట్ కేసేసేవోడినే. మా కనిగిరి కాటమరాజు నెల్లూరు మనుమసిద్ధిపై యుద్ధం చేసినోడు తెలుసా.
మీద బాగా మీగడ కట్టేలా గడ్డ పెరుగు చెయ్యడం మా దుగ్గిరాల అమ్మమ్మోళ్లమ్మాయికి కూడా బాగా తెలుసు తల్లా.
“రామకథను వినరయ్యా, ఇహపర సుఖముల నొసగే సీతా రామకథను వినరయ్యా” అంటూ ఎంటీవోడి లవకుశ సిల్మా పాటలు విన్నావు కానీ యీ ‘పాలకొల్లు’ గొడవేందో మావెరగవు తల్లా.
సిన్నప్పటి కనిగిరి ఫ్రెండ్స్… దేశం నలుమూలకెళ్లినోళు, ఏడున్నారో కూడా తెలవని వాళ్లను తలుసుకుంటే కన్నీటి చెలమలు చెలియలికట్ట దాటి పొంగుతాయెందుకో!
పుంతరేవమ్మ తల్లి గురించి srimani గారి అభిప్రాయం:
03/13/2025 5:21 pm
నమస్తే అండి. ఒక వర్గానికి సంబంధించిన స్త్రీల జీవితాలు ఎలా మారాయో ఎంత దయనీయమైన పరిస్థితులలోనుంచి వచ్చేరో ఒక స్త్రీ అభిరామిని — ఆవిడ జీవితం ఎలా ముగిసిందో అవన్నీ చదువుతుంటే బాధతో చలించిపోయాను. ఇదంతా నిజం కాదు కదూ! అయి ఉండదులే … ఇది మీరు వ్రాసిన కథే కదా? అని ఒక్క నిముషం నాలో నేను ఆలోచించుకుని ఇది కథ మాత్రమే నిజం కాదు అని నాకు నేను సర్దిచెప్పుకోవాల్సి వచ్చింది. అంతలా కదిలించింది ఈ కథ.
గుండె బరువెక్కి కథలను చదువుతూ ఉంటాము కానీ నాకు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే కథ ఇది. మనుషుల స్వార్ధాన్ని మూఢనమ్మకాన్ని ఒక పక్క చూపిస్తూనే మతిలేకున్నా దేవుడిని మాత్రం ఉన్నాడు అని గుర్తుపెట్టుకుని గుడికి వెళ్లడం… ఆ పాత్ర చాల బాగా డిజైన్ చేసారు. ఈ స్టొరిలో అభిరామిని పాత్రని మొదట పరిచయం చేయడమే శక్తిగా చూపించారు, అ పాత్ర ముగిసేటప్పుడు ఎంతో గౌరవముతో జనాల జయజయధ్వానాలతో వీడుకోలు చేయించారు. ఆఖరికి ఒక “దేవత”ని చేసారు. ఇలాంటి పాత్రను కథను మాకు పరిచయం చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు! 🙏
సత్యం గురించి Akshay గారి అభిప్రాయం:
03/12/2025 3:31 pm
గొప్ప వ్యాసం. Ingersoll ను తెలుగులో చదవడం బాగుంది. చక్కని అనువాదం.
రెండు పతంజలులు, ఒక జ్ఞాపకథ గురించి Srinivasarao Chaavli గారి అభిప్రాయం:
03/10/2025 5:23 am
https://www.facebook.com/whoisanwar/
Link not working. Please check.
[Thanks for pointing out. We updated the author’s profile with his latest page. – Ed. ]
బెష్టు ఫ్రెండ్స్ గురించి Ramesh గారి అభిప్రాయం:
03/07/2025 8:31 am
కథ చాలా చక్కగా నెమ్మదిగా చిన్న ప్రవాహంలా సాగింది , ధన్యవాదాలు.
అక్కమహాదేవి వచనాలు – 3 గురించి మాధురి గారి అభిప్రాయం:
03/06/2025 4:33 pm
ఎంతో సరళమైన భాషలో, తేట తెలుగులో ఉన్న ఈ పద్యాలు (చెన్న మల్లికార్జున ముద్ర తొలగిస్తే) భావకులు అయిన ప్రణయైక జీవులు రాసుకునే ప్రేమలేఖలా అనిపిస్తున్నాయి! ఇవి చదివితే మోహ పారవశ్యానికీ, భక్తి పారవశ్యానికీ తేడా ఇంత స్వల్పమా అనిపిస్తుంది!
నమస్సులు!
రెండు పతంజలులు, ఒక జ్ఞాపకథ గురించి సురేష్ చుండూరు గారి అభిప్రాయం:
03/05/2025 1:48 pm