“ఈ మాట ” సంగతి దేవుడెరుగు, కానీ, ఏ మాట కా మాటే చెప్పుకోవాలి; చెప్పద్దూ! ఇది ముఖ్యంగా నామాటే అయినా కాస్తోకూస్తో మీమనసులో మాట కూడాను! కాదంటే నేనొల్లను. అస్సలు విషయం: వంద అంటే నాకు చచ్చే భయం, చిన్నప్పటినుంచీను. నేను అయిదో క్లాసులో చేరిన రోజులవి. పిరీడు అయిపోగానే ఘంట కొట్టే వాడు చాలా గొప్పవాడని అనుకొని గర్వంగా మురిసిపోయే వయస్సు అది. ఒక రోజు పొద్దున్నే మూడో పిరీడు ఇంకా పావుఘంట మిగిలివుందం గానే, దబదబ పరిగెత్తికెళ్ళి, ఘంట కొట్టేశాను. ముత్యంగా మూడుసార్లు! అంతే! మా గుండు శేషయ్య మేష్టారు నా చేత వంద గుంజీలు తీయించారు.
మా శేషయ్య మేష్టారు చాలా బాధలు, కష్టాలూ పడ్డ వ్యక్తి. ఆయన పెద్ద కొడుకు సుభాసు బోసు గారి సైన్యంలో చేరటానికని ఇంటినుంచి బర్మాకి పారిపోయి మళ్ళీ తిరిగి రాలేదు! శేషయ్య మేష్టారు మా నాన్నగారూ మంచి స్నేహితులు; అందుకే అనుకుంటా నాకు డబల్ ప్రమోషన్ ఇచ్చి అయిదో క్లాసులో కూచో పెట్టారు. నన్ను ఆయనేమీ అనడులే అన్న ధీమాతో ఘంట కొట్టేశాను! అందుకు గాను వందగుంజీలు. ఇంకా నయం. గోడ కుర్చీ వేయించలేదు. మోకాళ్ళు పడిపోయి వుండేవి.
మరి, ఆరో క్లాసు(మా కాలంలో ఫష్టు ఫారం అనేవాళ్ళు!)మా సైన్సు మేష్టారు క్వార్టర్లీ పరీక్ష పెట్టారు. ఆయన పేరు గుర్తులేదు; ఒక్కటి మాత్రం గుర్తుంది. ఆయనకి సైకిలు ఎక్కాలంటే, ఎలెట్రీ స్థంభం కావాలి. దగ్గిరలో ఎలెట్రీ స్థంభంలేకపోతే, ఆ స్థంభం వచ్చే వరకూ సైకిల్ని నడిపించుకొని పోయేవాడు. కట్టిన పంచ కొంగు సైకిలు ఛెయిన్ లో పడకండా, ఒక మెటలు రింగు కాలికి తొడిగే వాడు కూడాను! ఆయన పరీక్ష కాయితం పైన Science అని రాయడానికి బదులుగా, వచ్చీ రాని ఇంగ్లీషులో Since అని ఏడ్చాను. తెలుగులో సైన్సు అని రాయచ్చుగా! అప్పటినించీకూడా ఈ వెధవ ఇంగ్లీషుమీద వ్యామోహం! నా రోగం ఠక్కున కుదిరించాడు ఆ మహానుభావుడు. వంద సార్లు Science అని అందరిముందూ నల్లబల్లమీద తెల్ల సుద్దముక్కతో imposition రాయించాడు. అప్పటినుంచీ నాకు వంద అని ఎవడన్నా అంటే ఒళ్ళు గజగజ వొణికేది.
ఇండియాలో బి.యస్.సి. పట్టా పుచ్చుకున్న తరువాత postal department లో వుద్యోగం వెలిగించా. ఆ రోజుల్లో, ఎప్పుడన్నా వంద రూపాయలు జేబులో వుంటే బాగుండేది అని బలంగా ఒక కోరిక వుండేది. అది యెప్పుడూ, ఏనాడూ తీరలేదు. మా నారాయణరావు గారి “వందరూపాయల నోటు,” (ఇది Million Pound Note సినిమా కన్న చాలా ముందే అచ్చులోకి వచ్చింది అని నాకు చలమాల ధర్మారావుగారు చెప్పేవరకూ తెలియదు!)కథ “స్వతంత్ర వార పత్రిక ” లో చదివిన తరువాత, వందరూపాయల మీద ఆకాస్త వ్యామోహంకూడా పోయింది.
అసలు, వంద మీద ఈ ఆర్తి ఎందుకో, ఏమిటో! ఇది, గ్యారంటీగా ఆ ఇంగ్లీషు వాడి ప్రభావమే! కాకపోతే యేమిటి, చెప్పండి. మనకి, నూట ఎనిమిది పద్యాలుంటేనేకద; దాన్ని శతకం అని అంటారు! మరి ఆ పై ఎనిమిదీ కొసరు కాబోలు. మా ఊళ్ళో పరక అంటే, పధ్నాలుగు మామిడి పళ్ళలాగా! మన దేవుళ్ళకి శతనామాలు లేవు; అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలూ తప్ప! అందాకా ఎందుకు. మనకి ఏ యుద్ధమూ పద్ధెనిమిది రోజులకన్న ఎక్కువ రోజులు జరగలేదు; యూరపులో క్రిష్టియనులే crusades పేరుతో, Deus vult = God wills అని అరుస్తూ జనాన్ని రెచ్చగిట్టి, నూరేళ్ళ యుద్ధం చేయించారు. “చస్తే స్వర్గం, నెగ్గితే లంచం” అనికూడా మభ్యపెట్టేశారు; అప్పట్లో పోపులు, వాళ్ళూనూ!
మా చిన్నప్పుడు, భారసాలలకీ, అన్నప్రాసనలకీ, పెళ్ళిళ్ళకీకూడా చదివింపుల్లో కూడా వంద కాదు; నూట పదహార్లు ఆనవాయితీ! ఆ రోజుల్లోనే, కాస్త ఒళ్ళు కొవ్వెక్కితే వెయ్యి నూట పదహార్లు. ఇప్పుడు ఆ వ్యాపారం లక్షలమీద, కోట్లమీద జరుగుతున్నదనుకోండి! ఈ “మిల్లీనియం” గొడవ మనని చంపేస్తోందనుకోండి. అసలు, ఏదొచ్చినా పాశ్చాత్యపు పెద్దలకి వేలం వెఱ్ఱి! లేకపోతే ఏమిటి చెప్పండి. వంద గొప్ప సినిమాలు, వంద గొప్ప రాజకీయ నాయకీనాయకులు, వందగొప్ప వార్తలు, వంద గొప్ప పుస్తకాలు అని ఆ దౌర్భాగ్యుడు అంటీంచిన చీడ కాక మరేమిటి?
చాలా కాలం క్రిందట, ఎ.యస్. రామన్ సంపాదకత్వంలో, Illustrated Weekly లో, The Books that have Influenced me అన్న శీర్షికకి చాలా గొప్పగొప్పోళ్ళు రాశారు. సి.డి. దేశముఖ్, మొరార్జీ భాయి, వగైరా వగైరాలందరూ రాశారు! నాకు బాగా గుర్తున్నది మొరార్జీ గారిని మార్చి పారేసిన పుస్తకాలు! ఆయన్ని, తన మూడో యేట భగవద్గీత influenceచేసిందట! ఆ తరువాత, అంటే, ఆయన diapers వేసుకోడం మానేసి, మట్టె లాగూలు కట్టే రోజుల్లో ఉపనిషత్తులు ఆయన్ని ప్రేరేపించి కదిలించేశాయట! ఆయన సంగతేమో గానీ, బాలచంద్ర రాజన్ రాసిన వ్యాసం మహ గొప్పది. బాలచంద్రరాజన్ రాస్తాడు: తను ఇరవయ్యో పడిలో పడేవరకూ, Sexton Blake రాసిన Railway Stall Detective పుస్తకాలు తప్ప ఇంకేవీ చదవలేదని ఢంకా బజాయించి చెప్పాడు. నాకు నచ్చాడు. అయితే, బి.సి. రాజన్ Milton మీద పరిశోధన చేసి, చాలాకాలం France లోనూ, England లోనూ, వున్నాడు, English Professor గా! తరువాత కొన్నాళ్ళు, Delhi Universityలో కూడా పని చేశాడు!
నామటుకు నేను కాలేజీ చదువు ఏడ్చే రోజుల్లో కూడా, దొంగతనంగా కొవ్వలి వారి నవలలు, జంపన వారి నవలలూ తప్ప, ఇంకేమీ చదవలేదు. అసలు, ఇంకేవీ చదవ బుద్ధయ్యేదే కాదు. మహా అయితే, ఒకటో రెండో ఆ శరత్ బాబు గారి బెంగాలీ నవలలు చచ్చు తెలుగులో చదివాను! అవి చదివి, బెంగాలీ ఆడవాళ్ళ మీద యెనలేని అభిమానం వచ్చేసింది; నిజం బెంగాలీ పిల్లలని చూసి మాట్టాడే రోజులదాకా! కాలేజీ రోజుల్లో, Havelock Ellis చదవడం ఒక hobby అయ్యింది. చాలా ఇంగ్లీషు మాటలకి అర్థాలు తెలిసేదే కాదు! అయినా, అదొక గొప్ప!
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, నాపుస్తకం వీళ్ళ list లోనుంచి కొట్టేస్తే కొట్టేశారు! పోనీలే, పాపం అమాయకులు! ఓ దేవా! వీళ్ళని క్షమించు వాళ్ళు చేస్తున్నది వాళ్ళకి తెలియదు అని మా చర్చ్లో ప్రార్ధన చేస్తాను! దేవుడికి క్షమించడమే తప్ప వేరే పనిలేదుగద! కానీ, నాకు నచ్చిన కొవ్వలి, జంపనా కూడా “ఈ మాట ” వాళ్ళు వేసిన list లో లేకపోవడం అన్యాయం! అధర్మం!! అక్రమం!!! (అపార్ధం ఇక్కడ పట్టదనుకుంటా) వాళ్ళిద్దరూ, కొన్ని తరాల యువకులకి ఆదర్శం అయ్యారు. బహుశా, చలాన్ని కూడా ఉద్రేకపరిచారేమో తెలియదు. అందుకనైనా, “ఈ వంద సంవత్సరాలలో వచ్చిన వెయ్యినొక్క తెలుగు పుస్తకాలు,” అని మరో list తయారు చెయ్యాలి! అందాకా, నేను విశ్రమించను, అని శపథం చేస్తున్నాను!
ఇతి!!
షరా: ఇది ఎవరినో కించపరచడానికి నేను రాశాను అన్న అపవాదు నా మీద వేస్తే, ఆ అపవాదు వేసిన వాళ్ళకి, వినాయక చవితి నాడు పాల కార్టన్‌లో విరిగిన చందమామముక్క కనపడుతుంది. ఒక మాజీ దిగంబరుడు, ఒకానొకప్పుడు పెంచిన నల్ల గండుచీమ తప్పకుండా కరుస్తుంది.
This compilation seems to be highly biased.It is indeed amazing that one of the most major literary movements in Telugu has been completely overlooked. I do not know whether it was deliberate intentional reasons or it was simply a overlook.
If it is a overlook I would request Dr.Velcheru to correct it since still Telugu Literary circles have a great regard for him and his thesis. I am sure it should not be a problem for him to consider some of the greatest literary works produced by this literary movement ,that is the Revolutionary Movement and VIRASAM.One cannot simply overlook the impact this movement had over a period of 2 decades on Telugu Literature.
Infact it was Dr.velcheru who tried and projected the initial days of this movement in his thesis. It is quite amazing how he could forget it while doiing this selection. Well ,I would not attribute this solely to him but he could have definitely influenced the selection process. How could great poets like Sivasagar (Udyamam Nelabaludu,Nelavanka) ,VaraVararao(Bhavishyat Chitrapatam, Samudram, Sahacharulu (Prose), NK (Lalbano GulamiChodo), Vimala (Adavi Uppongina Rathri) Souda ,and prose writers like Allam Narayana, Tummeti Raghottham Reddy ,Rago etc (Only to mention a very few of the Virasam Writers ) be forgotten completely.
There was so much of literary work produced in these 3 decades of Virasam Literary movement.All that cannot be simply ignored in its entirety. And also there have been some great Dalith Poets who emerged to be great poets in this decade and all their work seems to be simply overlooked.
I sincerely expect that there shold not be any prejudice or bias amongst the those who made these selections and only then this list would gain real authenticity.Hence I would request that my sincere feelings about this compilation be considered and see that it is updated or modified ( If you think none can be removed to accomodate the works that I mentioned you may expand the list ,it is not necessary that we should have best 100 books, we may have best 150 or 200 books as long as they are best).The compilation should be the one the next millenium would remember and consider with great honor and grace.
Thanks and regards
Narayanaswamy.
అటో యిటో గురించి Sriram Bhagavathula గారి అభిప్రాయం:
11/30/-0001 12:00 am
కథ చక్కగా , మనుషుల మధ్య ప్రస్తుత సమాజ రీతికి అన్వయిస్తూ ఆద్యంతము రసవత్తరముగా రాసారు. చాలా బావుంది.
హుమ్… మీ కథలన్నీ నాకు ప్రత్యేకంగా అనిపిస్తాయి. కథలో ముఖ్య పాత్రకీ వైద్య వృత్తికీ సంబంధం కనబడ్డం తప్ప ప్రతి కథకూడా నాకు కొత్తగా ఉంటుంది. ఇది కూడా అంతే! ఈ డాక్టర్లతో కష్టం. మాట్లాడ్తూ మాట్లాడ్తూనే ఇలా బాంబులు పేల్చేస్తారు :).
చాలా బాగుందండీ మీ కథ. ఈ కథని ప్రింటవుట్ తీసి ఇంట్లో వాళ్ళకి కూడా చూపిద్దామనుకుంటున్నా ఇప్పుడే !
కానీ ముగింపు నాకేమిటో ఉన్నట్లుండి ఆగిపోయినట్లు అనిపించింది. ఇంకాస్త కథ ఉంటే బాగుండేది అనిపించింది. ఇది విమర్శ కాదు సుమా. కాంప్లిమెంటే. ఎంత బాగా రాసారంటే కథ ఆగాలనిపించలేదు అని అర్థం. (మళ్ళీ అపార్థం చేసుకునేరని నేనే చెప్పేస్తున్నా :))
ఈ శతాబ్దపు రచనా శతం గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:
07/01/1999 11:09 pm
ఒక వంద గురించి….

అభివాదాలతో,
వేలూరి వేంకటేశ్వర రావు వ్రాలు
ఈ శతాబ్దపు రచనా శతం గురించి Narayanaswamy V Venkatayogi గారి అభిప్రాయం:
07/01/1999 5:17 pm

అటో యిటో గురించి Sowmya గారి అభిప్రాయం:
11/30/-0001 12:00 am
బాగుందండీ కథ. సహజంగా ఉంది. ఏదో ఉన్నట్లుండి మనుషులు మారిపోయినట్లో చూపకుండా ఇలా మనుషుల్లో ఉండే హిపోక్రసీ ని బాగా చూపించారు.
కథ ఇదనీ, నిజమిదనీ… గురించి Sowmya గారి అభిప్రాయం:
11/30/-0001 12:00 am
హుమ్… మీ కథలన్నీ నాకు ప్రత్యేకంగా అనిపిస్తాయి. కథలో ముఖ్య పాత్రకీ వైద్య వృత్తికీ సంబంధం కనబడ్డం తప్ప ప్రతి కథకూడా నాకు కొత్తగా ఉంటుంది. ఇది కూడా అంతే! ఈ డాక్టర్లతో కష్టం. మాట్లాడ్తూ మాట్లాడ్తూనే ఇలా బాంబులు పేల్చేస్తారు :).
పేరు గలవాడేను మనిషోయ్ గురించి Sowmya గారి అభిప్రాయం: