Comment navigation


15786

« 1 ... 5 6 7 8 9 ... 1579 »

  1. మౌనంబంతట మాటలాడె… గురించి Vasu గారి అభిప్రాయం:

    04/02/2025 6:59 am

    భైరవభట్ల కామేశ్వరరావుగారూ,

    నమస్తే. నేను వాసుని. ఈ పద్యాలన్నీ ఎంతో తియ్యగా ఉన్నాయి. వాల్మీకిని మొత్తం అనువాదం చేయ సంకల్పించారా, సర్?

    -వాసు-

  2. లంకమల దారుల్లో – వలపటెద్దు కథల్లో గురించి C.Suseela గారి అభిప్రాయం:

    04/02/2025 6:17 am

    శ్రుతకీర్తి, చాలా మంచి విశ్లేషణ అందించావు. ప్రకృతి లోని అందాలు, దానితో పెనవేసుకున్న బంధం, అందులొ పొందే సాంత్వన, మూగప్రాణులతోని అనుబంధం, చదువుతుంటే ప్రతికథా మనసును హత్తుకున్నాయి. వివేక్ గారి కథలను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. రచయితకు అభినందనలు.

  3. సిద్ధార్థ ముక్కుపుల్లలు — స్థానీయ సాంస్కృతిక అధివాస్తవ ప్రతీకలు గురించి Rajasekharam Mallipudi గారి అభిప్రాయం:

    04/02/2025 2:50 am

    This is a fascinating and thought-provoking review that will make readers rethink their beliefs about cultural symbols. It is a tour de force into the heart of Siddartha’s poetry.

  4. సెక్యులరిజం ముసుగులో కమ్యూనలిజం గురించి Suraj Sayyed గారి అభిప్రాయం:

    04/01/2025 6:41 pm

    ఏది అసలు చరిత్ర

    ఏది ఏమైనా ఎమర్జెన్సీని ఆర్ఎస్ఎస్ సమర్ధించింది అనేది చారిత్రక వాస్తవం. ఇందిరా గాంధీని దుర్గగా కీర్తించిందెవరు? ఇంకాస్త వెనక్కు వెళితే గాంధీ హత్యకు ప్లానింగ్ చేసిన, A1గా ఉండాల్సినటువంటి సావర్కార్‌ని గాంధీ హత్యకేసు నుంచి ఎలా తప్పించారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ, అదే ఇందిరా గాంధీ సావర్కార్‌ని తమ నెత్తికెత్తుకొని స్వాతంత్ర యోధుడు హోదా ఇవ్వడం, సావర్కర్ జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేయడం మరచిపోతగునా? గాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం గురించి ప్రపంచమంతా తెలుసు. అలాంటిది ఆర్ఎస్ఎస్‌ను గాంధీ హత్య జరిగిన తర్వాత కేవలం ఒక 15,16 నెలలు మాత్రమే నిషేధించి తర్వాత వదిలేశారు కదా! ఇదేమిటి? నెహ్రూకు, పటేల్‌కు ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీకి ఆర్ఎస్ఎస్‌తో ఉన్న అక్రమ సంబంధాల్ని ఎవరైనా కాదనగలరా?

    ఆర్ఎస్ఎస్‌ను సంతృప్తి పరచడానికి ఇందిరాగాంధీ సిక్కుల స్వర్ణ దేవాలయం ధ్వంసం చేసింది. ఆర్ఎస్ఎస్ కళ్ళలో ఆనందం చూడడానికి రాజీవ్ గాంధీ బాబ్రీ మసీదు తాళాలు తీయించి పాత విషయాన్ని మళ్లీ తిరగదోడడం చరిత్ర ఎలా మరిచిపోతుంది? ఇక పీవీ నరసింహారావు సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. నగ్నంగా ఆర్ఎస్ఎస్‌ను హిందూ తీవ్రవాద సంస్థలను బలపడేలా చేశాడు. చివరగా చెప్పేదేమంటే కాంగ్రెస్ బిజెపి రెండు కూడా ఆర్ఎస్ఎస్‌కు రాజకీయ పనిముట్ల లాంటివి. ఓకే నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి, ఒకే మనిషికి రెండు కళ్ళ లాంటివి, రెండు చేతుల లాంటివి. ఇటీవల రాహుల్ గాంధీ చెప్పింది ఏమిటి? కాంగ్రెస్లో ఉండి, బిజెపి కోసం పనిచేస్తున్న నాయకుల్ని ఏరివేయాలి అన్నాడు. ఇది దేన్ని సూచిస్తుంది? కాబట్టి ఇక్కడ ఎటువంటి పక్షపాతం లేకుండా చరిత్రను పరిశీలించి ఎవరు రాసిన అది మాత్రమే నిజమైన చరిత్ర అవుతుంది. అంతేకానీ హేతుబద్ధత లేకుండా, మన అభిమానాలు దురభిమానాలు ప్రాతిపదికన చేసే చరిత్ర పరిశీలన వలన అసలు నిజాలు బయటికి రావు !

  5. వేలూరిగారితో ఒక సంభాషణ గురించి RAMARAO KANNEGANTI గారి అభిప్రాయం:

    04/01/2025 4:36 pm

    ఎంత అద్భుతంగా ఉంది! పెద్దయింతర్వాత వేలూరి గారిలా అవ్వాలని నిర్ణయించుకున్నా! ఎంత అద్భుతమైన జీవితం — ప్రవాహంలో ఒడ్డున ఉండకుండా, దూకి ఈదులాడిన జీవితం. 1992 నుంచీ ఆయన మాకు గురువుగారిలా ఉన్నాడు, అదీ నాకు సంతోషం!!

  6. కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    04/01/2025 1:54 pm

    వ్యాసం బాగుంది. మిగిలిన భాగాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నాళ్ళబట్టో thermionic emission, incandescent lamp, byproduct వంటి మాటలకి తెలుగు మాటల కోసం వెతుకుతున్నాను. ఇప్పుడు దొరికాయి!!

  7. కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం గురించి Srinivas గారి అభిప్రాయం:

    04/01/2025 12:18 pm

    ఈ వ్యాసం ఆసక్తికరంగా ఉంది. ఈ రోజుల్లో, ఈమాటలో పాపులర్ సైన్స్ పై అనేక వ్యాసాలు ప్రచురితమవుతున్నాయి. అనుభవజ్ఞులైన రచయితలు పాఠకులు సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా సంక్లిష్టమైన శాస్త్రీయ అంశాలను సరళీకరించి వ్యాసాలలొ అందిస్తున్నారు. రచయితకు ధన్యవాదములు. ఈ వ్యాస పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.

  8. సెక్యులరిజం ముసుగులో కమ్యూనలిజం గురించి బొల్లోజుబాబా గారి అభిప్రాయం:

    04/01/2025 11:40 am

    ఈ వ్యాసంలో కూడా ఎప్పట్లానే గందరగోళం, అయోమయం. ఇవి మీ హాల్ మార్క్. ఒకె
    ఇది ఎజెండా డ్రివెన్ వ్యాసం.
    సెక్యులరిస్టులు, ప్రగతిశీలవాదులు, కమ్యూనిష్టులు భారతదేశంలో కమ్యూనలిజం/ఫాసిజం పెంచటానికి దోహదపడ్డారు అని అనటం …. సమకాలీన హిందుత్వ వాదుల వాదన.

    రాణిగారు పైకి ప్రగతిశీల వాదిలా కనిపించినా కరడుకట్టిన హిందుత్వ వాది అని ఈ స్టాండ్ తెలియచేస్తుంది.
    దళిత, కుల ఉద్యమాలు, బ్రాహ్మణమతంపట్ల సరైన అవగాహన రావటాం మనుస్మృతిని తిరిగి అధ్యయనం చేయటమే. ఈ అంశాన్ని విస్మరించి మనుస్మృతిగురించి మాట్లాడటమే తప్పు అనటం అనవగాహన.

    ఇక హిందూకోడ్ బిల్ మత సంబంధం కాదు. 80% ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలతో బతికే హక్కులను కల్పించిన బిల్లు. అవి ఒదులుకొని మనుస్మృతుని తీసుకురావాలని హిందుత్వవాదుల వాదన చేస్తున్నారు రాణిగారు.

    హిందుత్వ అనేది దళితబహుజనులలో ఆదరణపొందటం ప్రగతికి సూచన కాదు. పతనానికి. హిందుత్వవాదులు స్ప్రెడ్ చేసిన విభజనకు, ద్వేషానికి సూచన.

    రాజ్యాంగంలో అనేక్ చెక్స్ అండ్ బౌన్సెస్ ఇచ్చారు డా. అంబేద్కర్ గారు. అవి దాని బలం. వాటిని లూప్ హోల్స్ గా చూడటం ఇంటలెక్చువల్ బాంక్రప్ట్సీ. డా.అంబేద్కర్ గారిపై హిందుత్వ వాదుల వలే కావాలని బురదజల్లే ప్రయత్నం. ఇది రాణిగారినుంచి రావటం ఆశ్చర్యం.

    సెక్యులరిజం, కమ్యూనిజం, దళితబహుజన ఉద్యమాలు, రాజ్యాంగం లాంటి సంబంధం లేని విషయాలను ఒకతాటిమీదకు తెచ్చి, వాటన్నిటినీ కమ్యునలిజానికి కారణం అని నిరూపించబూనటం ఈ వ్యాసంలో కనిపించే అయోమయం, గందరగోళం. ఏ ఒక్క అంశాన్ని కూడా సోదాహరణంగా ఉపపత్తులతో చెప్పలేకఫోయారు. పూర్తి వాట్సప్ బత్తాయిల వ్యాసంలా మిగిలిపోయింది. వాళ్ళేనయం, ఒక్కొక్కటితీసుకొని చెబుతారు, అన్నీ ఒకేసారి మింగేయాలని చూడరు…. ఈ వ్యాసంలోలా

    ఈ వ్యాసం హిందుత్వాని సమర్ధిస్తుంది
    ఇందిరాగాంధిని విమర్శిస్తుంది
    రాజ్యాంగం తప్పు అంటుంది
    సెక్యులరిస్టులు, అంబేద్కరిస్టులు, ప్రగతిశీలవాదులు నేటి ఫాసిజానికి కారణం అంటుంది……….. ఇవన్నీ హిందుత్వ వాదులు విడివిడిగా ఛేస్తున్న వాదనలు….. రాణిగారు అన్నికాకిరెట్టలనీ సేకరించి సమన్వయం కుదర్చలేక ఒక గందరగోళ వ్యాసంగా రాసారు.

    (రాణిగారిపట్ల నాకు గౌరవం ఆయన నాకు మిత్రులు. ఈ విమర్శ వ్యాసంపైనే)

    బొల్లోజు బాబా

  9. వేలూరిగారితో ఒక సంభాషణ గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    04/01/2025 9:42 am

    చాలా బాగుంది. ఆసాంతం చదివించింది. ప్రశ్నలు అడిగినవారు సమర్ధులు. సమాధానాలు చెప్పిన వ్యక్తి బాగా సమర్ధుడు!

  10. వేలూరిగారితో ఒక సంభాషణ గురించి anwar గారి అభిప్రాయం:

    04/01/2025 7:59 am

    ఆయన మాట్లాడారు, దానిని ఇట్లా చదువుతున్నాం అంటే ఎంత అదృష్టం అన్నమాట.

« 1 ... 5 6 7 8 9 ... 1579 »