Comment navigation


15790

« 1 ... 9 10 11 12 13 ... 1579 »

  1. కుడి ఎడమైతే పొరపాటు ఉందా? గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    03/01/2025 2:09 pm

    శ్రీనివాసరావు చావలి , మధు చిత్తర్వు, శారద గార్లకి :

    వ్యాసం చదివి మీ అభిప్రాయం వ్యక్తపరచినందుకు ధన్యవాదాలు.

  2. బెష్టు ఫ్రెండ్స్ గురించి P. Venkata Ramana గారి అభిప్రాయం:

    03/01/2025 12:52 pm

    Swathi, reading this story brought back our childhood memories. It feels so good.

  3. బెష్టు ఫ్రెండ్స్ గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:

    03/01/2025 12:18 pm

    చాలా రోజులయ్యింది కనపడి అనుకుంటున్నా!
    ఇలా చక్కని కథతో పలకరించావు ఈ శనివారం!
    బాగుంది. యామినికి టాంక్యూ!

  4. నో ఎగ్జిట్.3 గురించి మధు‌ చిత్తర్వు గారి అభిప్రాయం:

    03/01/2025 11:25 am

    ఇది ఒక టైమ్‍లూప్ ప్రక్రియ. అన్నీ తెలిసిన పాఠకులకు దీనిగురించి చెప్పవలసిన అవసరం లేదు. తెలియని వాళ్ళకు ఎలాగూ చెప్పలేం. Ground hog day సినిమా చూస్తే ఈ అద్భుతమైన ప్రక్రియ తెలుస్తుంది. నేను రాసిన వలయం అనే కథ ఈమాటలోనే ప్రచురణ అయింది.ఆ లూప్‍లో వీడియో గేమ్‍లా తిరిగి తిరిగి తనను తాను మార్పుకోవచ్చు. సంఘటనలు మార్చవచ్చు. కొంచెం ఎండింగ్ ఇంప్రూవ్ చేస్తే ఈ కథ చాలా గొప్ప టైమ్ లూప్ కథ అవుతుంది. నేను ఇదివరకు ఈ ప్రక్రియ అంతా బాగా స్టడీ చేశాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగా రాశారు. ఇంకా డెవలప్ చేస్తే అద్భుతంగా ఉంటుంది.

  5. బెష్టు ఫ్రెండ్స్ గురించి యామిని కృష్ణ బండ్లమూడి గారి అభిప్రాయం:

    03/01/2025 11:21 am

    అసలా… ముద్దపప్పులో మావిడికాయ పచ్చడి కలుపుకుని… ఆమ్లెట్టేసుకున్నట్టే సూపరుందిగా నీ ష్టోరీ! మా క్లాసులీడరు, అదే… సువాసినైతేనా, బలే మెచ్చుకుందక్కాయ్ నిన్ను.

    మల్లానేమో… బలే యేడిసాలే. మల్లేస్వరక్కాయ్ ఎంత మంచిదో గదా! ఎప్పటికి ‘మల్లె’.

  6. చరిత్రా సంస్కృతుల కథలు గురించి Ramesh గారి అభిప్రాయం:

    03/01/2025 7:06 am

    పుస్తక పరిచయం చక్కగా వుందండి, ధన్యవాదాలు.

  7. వచన రచనలో పదస్వరూపాలు, సింటాక్స్ గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    03/01/2025 6:56 am

    ఎంతో అవసరమైన వ్యాసం!

    ఎలనాగ గారికి ధన్యవాదాలు!

  8. బెష్టు ఫ్రెండ్స్ గురించి అన్వర్ గారి అభిప్రాయం:

    03/01/2025 6:51 am

    ఈ నెల ఈ మాటలో అంతకు ముందు నెల ఈ మాటలో వచ్చిన స్వాతికుమారి బండ్లమూడిగారి రెండు కథలు ఎంత మంచి కథలో, ఎంతెంత మంచి కథలో. ఇంత మంచి కథలు చదవడానికి లేక పతంజలిగారు మిస్సయి పోయారు కదా అని అనిపించేంత మంచి కథలు. ఇంత మంచి కథలకు బొమ్మలేయకుండా బాపుగారు కూడా మిస్సయి పోయారు అని కూడా దిగులు పడేంత ఉత్తమ కథలు. పోనీ ఆర్కే లక్ష్మణ్ ఉండి ఉన్నా నయంగా ఉండేది. ఆయన ఈ కథలలో ఒకటైన “బెష్టు ఫ్రెండ్స్”కు వేసే బొమ్మలతో మాల్గుడి వాళ్ళ నాయనమ్మ బండ్లమూడి డేస్ అంత గొప్పగా ఉండేది.

  9. కుడి ఎడమైతే పొరపాటు ఉందా? గురించి శారద ( బ్రిస్బేన్ ) గారి అభిప్రాయం:

    03/01/2025 2:00 am

    చాలా క్లిష్టమైన విషయాన్ని, వివరంగా, ఆసక్తికరంగా చెప్పారు. వ్యాసం చాలా బాగుంది. ధన్యవాదాలు.
    శారద

  10. శంభో తవారాధనం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:

    02/27/2025 11:50 am

    ఈమధ్యా కాలంలో నాజీవితం కొంత కల్లోలంగా ఉన్న కారణంగా ఎక్కువగా చదువటంలేదు. వీలు పడక.

    ఈ ఉదయం ఈ రచన నుండి ఈక్రింది పద్యం నాకొక మిత్రులు పంపారు.

    నెత్తిన బెట్టుకొంటి విధునెన్న సగంబె సితాద్రి కన్య క
    న్హత్తుక మేన దాల్చినది యయ్యదియున్ సగమే రతీపతి
    న్మొత్తము జంపలేదు విషమున్‍ బరిపూర్తిగ తాగలేదు గ
    మ్మత్తు సగాల దేవర శివా నిను చిందులు వేసి బాడెదన్! 10

    ఈపద్యంలో మొదటిపాదంలో అఖండయతి ఉన్నది, అది పెద్దదోషం కాదు. ఎందుకంటే అఖండయతిని పెద్దకవులు వాడిన సందర్భాలున్నాయి కాబట్టి. సమర్ధించిన సందర్భాలూ ఉన్నాయి కాబట్టి. అదటుంచండి.

    ఈపద్యంలో చివరిపాదంలో యతిమైత్రి కుదరలేదు. గమ్మత్తు అన్నది ఏకపదం కాబట్టి యతిమైత్రి స్థానంలో మకారానికి మైత్రి కల అక్షరంవాడక తప్పదు. శివా అన్న సంబోధనలోని ఆ-కారానికి మైత్రి కుదర్చటం సాధ్యపడదు నాకు తెలిసి.

    ఇక్కడ ఈ యతిమైత్రి భంగం కావటం గురించి ఒక్క ప్రశ్న ఈపద్యకృతిని ఈమాట వారు పండితపరిశీలకు పంపే ఉంటారు కదా! ఈదోషం గమనికకు రాలేదా అని ఆశ్చర్యం కలుగుతున్నది.

    నేనింకా ఈ రచనను పూర్తిగా చదువలేదు. ఐనా కొన్ని వ్యాఖ్యలను చూచి ఇది చాలా బాగుందన్న అభిప్రాయాలను గమనించి సంతోషించాను. వీలువెంబడి తప్పక చదువుతాను. తప్పులుపట్టేందుకు కాదు లెండి.

« 1 ... 9 10 11 12 13 ... 1579 »