Comment navigation


15786

« 1 ... 1319 1320 1321 1322 1323 ... 1579 »

  1. స్త్రీ గురించి REDDY గారి అభిప్రాయం:

    11/12/2008 8:35 am

    మీరు చెప్పే దానిలో నిజం ఉంది. అయితే ఎంత మంది ఆడవారు చేతులో ఉన్న శక్తిని కూడా కోల్పోయి జీవితాన్ని నరకంగా మార్చుకుంటున్నారో గమనించరాదా రేవతీదేవి గారూ?

  2. మూడు జ్ఞాపకాలు గురించి R.Vasundhara Devi గారి అభిప్రాయం:

    11/12/2008 8:06 am

    A beautiful evocation of a bygone era.
    (1) The bathroom scene with the scents of wood-logs, the dried cow-pats, the blood-sugar testing – are well-expressed through,a child’s naive perception.
    (2)The personal services of ‘orderlies’ , The folksy ways of Appala Raju,and the fiasco on the stage is pathetic and funny.
    (3) I could relate to the description of his mother’s quirks- my mother was like that too, like many other govt. officer’s wives – reflecting the bourgeoisie culture of those days. The village deities will be there for a long-time to come, but the ‘spells’ are not so common..
    I hope Vinnakota RaviShankar continues with his old-times tales !

  3. చంపకోత్పలమాలల కథ గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:

    11/12/2008 7:11 am

    చాలా కాలం కిందట ఆదినారాయణ శాస్త్రి గారి పుస్తకం తిరగేస్తూ ఈ పద్యాన్ని చదివి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను.ఆ తర్వాత ఎంతోమంది కవితాభిమానులతో ఈ పద్యం గురించి ముచ్చటించాను. కానీ,ఎవరూ ఎరిగినట్టులేరు ఈ తొలినాటి్ ఉత్పలమాలిక గురించి .అద్దంకి శాసనపద్యం (తరువోజ) మీద కొందరు శ్రద్ధ తీసుకుని చిరు పొత్తాన్ని ప్రకటించి ఉన్నారు. అలాగే,ఈ పద్యం గురించి కొంచెం చర్చ జరిపి విస్తృత ప్రచారంలోకి తీసుకు రావలసిన అవసరం ఉంది.నన్నయకు ముందు కవిత్వం లేదు అన్నఅపప్రధను తొలగించవలసి ఉంది.కారణం ,మొన్న ప్రాచీన భాష చర్చల్లో తమిళ పండితులు భద్రిరాజు గారి వ్యాసాన్ని ఉటంకించి నన్నయకు ముందు మీరే తెలుగులో కవులెవరూ లేరని సిద్ధాంతీకరించి ఉన్నారు,మరి ఇదెలా సాధ్యం అన్నట్టు పత్రికల్లో చదివాము.మొత్తానికి ప్రాచీన భాష (లేదా శ్రేష్ఠ భాష) హోదా లభించింది. అది వేరే విషయం.

    ముక్కలు ముక్కలైన శాఫో పద్యాలను ప్రకటించటంలో ముందుంటారు పాశ్చాత్య పండితులు.మనం కూడా అజ్ఞాతకవి రచనగా కొట్టిపారేయకుండా ,చదిపిరాళ్ళ కవిగా ప్రచారంలోకి తీసుకురావలసి ఉంది.బలమైన ఎత్తుగడ,స్ఫుటబలోక్తి , సూటిగా దూసుకు పోయే శైలీవిన్యాసాలతో అలరారుతున్నపద్యం నిస్సందే్హంగా ఎన్నదగిన పద్యాల్లో ఒకటి.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  4. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి baabjeelu గారి అభిప్రాయం:

    11/12/2008 6:05 am

    కొడవళ్ళ హనుమంతరావు గారూ, నమస్తే. మీరు రాసినట్టు ఈ పుస్తకాన్ని తెలుగులో రాసినట్టుంటే మరీ బాగుండేది. వేలూరి గారు ఇచ్చిన synopsis బాగుందనడం మాత్రం బాగోలేదు.

    She concludes it with clear understanding of feminism అని వేలూరి వారు వొప్పుకున్న paragraph ని ఎలా వొప్పుకోవాలీ? “blaming it on entirely on male population” lopsided ఎలా అయిందీ? మగవాళ్ళ వల్ల కాకపోతే ఇంకెవరివల్ల ఆడవాళ్ళు అలా వున్నారు? పశు పక్ష్యాదులూ, చెట్లూ చేమలూ అష్టదిక్పాలకులూ మరియూ పంచభూతములూ మధ్యలో జొరబడలేదే?
    లూషన్ చెప్పింది అక్షరలక్షలు కదా? ఆడపిల్ల పాడయిపోయిందని సంఘం బాధపడి పోవడం మగవాడివల్లేకదా? పాడైపోయింది, పాడైపోయింది. మన పరువు గంగలో కలిసిపోయింది అని గగ్గోలు పెట్టేది ఆ ఆడపిల్లని పుట్టించిన వాడూ, ఆ పిల్ల టోడబుట్టిన మగవాళ్ళూ కాదా? కాదా?

    ఆయనెవరో, “లక్ష్మన్న” గారి “రే” వ్యాసం కి రాసిన అభిప్రాయంలో ఇక్కడంతా పాత తరం అనీసేరు. నిజవేఁ కాబోలు. కానీ ఇంత పాత తరం అనుకోలేదు. పుస్తకాన్ని సమీక్ష చెయ్యడం అంటే అబ్బో అబ్బో అని పొగడక్కర్లేదు. వొప్పుకోని విషయాల్లో ? పెట్టలి సమీక్షకుడో, synopsis రాసేవాళ్ళో.

    హనుమంతరావుగారూ, మీరు చెప్పినట్టు ఈ పుస్తకం needs more critical review. అయినా 2008 లో డెబ్భయ్యైదు ముందు నవలామణులు రాసిన వాటి గురించి రాసిన పుస్తకం పాచి బూరి. పర్లేదు, బానేవుంది అనడం “సరస్పతికి” అపచారం. అలా అనడం వలన నిడదవోలు మాలతి గారిని అవమానించినట్టు కాదు. మనలోని lopsidedness ఇంకా అలాగేవుందని వొప్పుకోడం.
    హనుమంతరావుగారూ, మీరొప్పుకుంటారేమో గానీ, నేనొప్పుకోను.

  5. నాకు నచ్చిన పద్యం: భాస్కర రామాయణంలో వర్షాగమన వర్ణన గురించి mOhana గారి అభిప్రాయం:

    11/12/2008 6:00 am

    మనకు దొరికిన పుస్తకాలనుండి శార్దూలవిక్రీడితాన్ని అశ్వఘోషుడే మొట్టమొదట వాడినట్లు అనిపిస్తుంది. భాసుడు అశ్వఘోషుని పిదప జీవించాడు. సంస్కృత నాటకకర్తలలో ఇతడే బహుశా మొదటివాడు.
    కాళిదాసు కూడా ఇతడిని చాలా ప్రశంసించాడు. వెన్నెలపైన భాసుడి చాటువును కింద ఇస్తున్నాను –

    కపోలే మార్జారః పయ ఇతి కరాల్లోఢి శశిన-
    స్తరుచ్ఛిద్రప్రోతాన్ బిసమితి కరీ సంకలయతి
    రతాంతే తల్పస్థాన్ హరతి వనితాప్యంశుకమితి
    ప్రభామత్తశ్చంద్రో జగదిదమహో విప్లవయతి

    నేను తెలుగులో దీనిని అనువదించే బదులు ప్రొఫెసర్ బెర్రీడేల్ కీత్ గారి ఆంగ్లానువాదాన్ని ఇస్తున్నాను –

    When its rays fall on its cheeks
    the cat licks them, thinking them milk;
    When they are caught in the cleft of a tree
    the elephant deems them a lotus;
    When they rest on the couch of lovers
    the maiden seizes them, saying,
    “”Tis my robe”;
    The moon in truth, proud of its brilliance,
    doth lead astray all this world.

    విధేయుడు – మోహన

  6. కరుణ ముఖ్యం గురించి appaji గారి అభిప్రాయం:

    11/12/2008 3:33 am

    అర్ధమే లేని చదువు ఎందుకో తెలీక
    మృత దీవుల్లో కుళ్ళి పోయే నా మీద,
    చలానికి జాలేమో పాపం
    ఆనందపు అత్తర్ల
    తుంపర్లు అలా అలా జల్లుతాడు
    ఎంత అందం జీవితం!”

  7. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/11/2008 9:19 pm

    Congratulations to Malathi గారు on completing the project she started a quarter century ago! I wish she wrote this in Telugu as it would have gained a much wider well-deserved discussion. Veluri గారు gave a good synopsis of the work but what the book needs is a more critical review.

    Kodavalla Hanumantha Rao

  8. చంపకోత్పలమాలల కథ గురించి mOhana గారి అభిప్రాయం:

    11/11/2008 6:17 pm

    పుస్తకాలను తిరగవేస్తుంటే క్రింది పద్యము కనబడింది. ఇది కడప జిల్లా చదిపిరాళ్ళ గ్రామంలో క్రీస్తుశకం 9 – 10 శతాబ్దాల మధ్య కాలపు శాసనంలోని ఉత్పలమాల.
    ఈ పద్యాన్ని ఆదినారాయణ శాస్త్రి వ్రాసిన రాయలసీమ తెలుగు శాసనాల సాంస్కృతిక అధ్యయనం అనే పుస్తకంలో చూచాను.

    అర్థ మశాశ్వతమ్ము, యొడలన్నది తక్షణభంగురమ్ము, త-
    త్వార్థము గాదు జీవనమ్ము, కృతాంతక మారక, మ్మిట్టి దీనినిన్
    రత్తి గుఱించి నమ్మక పరార్థము నెన్నడు జేటు లేని ధ-
    ర్మార్థమ చేయుడి మ్మనుజు లమ్మెన పెగ్గడ యట్లు వేర్మిలోన్

    ధనము శాశ్వతమైనది కాదు. శరీరము నశ్వరమైనది. జీవము తత్వార్థము కాదు. యమునిచే దండనార్హమైనది. దీనిని నమ్మరాదు. పరార్థానికై, ఎన్నడు మాసిపోని ధర్మార్థమును అందఱు అమ్మన ప్రెగ్గడలా గొప్పగా చేయండి.

    ఈ ఉత్పలమాల బహుశా తెలుగులో మొదటి ఉత్పలమాలలలో ఒకటి అనుకొంటాను. విధేయుడు – మోహన

  9. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి ప్రజాపతి గారి అభిప్రాయం:

    11/11/2008 9:47 am

    మంచి రచన. చాలా పరిశోధన చేసి వ్రాసారు. త్యాగరాజు గురించిన ఇన్ని విశేషాలు ఒకే చోట చదవడం ఇదే ప్రథమం. రీసెర్చి పేపర్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్న వ్యాసం.

  10. డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష గురించి baabjeelu గారి అభిప్రాయం:

    11/11/2008 6:16 am

    కృష్ణమోహన్ గారూ, నమస్తే.
    చాలా వివరంగా, బాగా రాశేరు. పూర్తిగా చదివేక నాలాటి సత్తరకాయగాడికి తెలిసిందేటంటే, ఒకప్పటి “ఖర్గపూర్” కీ లేదా తత్సమానికీ, ఇప్పటి “డెట్రాయిట్” లేదా తత్సమానికీ తేడా ఏటీ లేదని.

« 1 ... 1319 1320 1321 1322 1323 ... 1579 »