ఇంద్రాణి గారూ! మీకు అలాంటి ఊరిలోకి పోవాలనే కోరిక ఎందుకు కలిగిందో! సాయంత్రం దాకా చూడండి. మరి ఎవరయినా చెప్పగలిగే వారు వస్తారేమో! సరదాగా అన్నాను. కోప్పడకండి. మీ కవిత బాగుంది.
నా రచనలు… audiseshareddy.blogspot.com లో వున్నాయి.
—- ఆదిశేషా రెడ్డి కైపు. నెల్లూరు.
వినీల్ గారు,
గణిత సమీకరణాల్లో ఉండేవి abstract symbols కదా. Symbolismకి imagismకి తేడా ఉంది.
ఎలానూ మళ్ళీ భూషణ్ గారి పుస్తకం తిరగేస్తానన్నారు కాబట్టి, అతనికి మీరు ప్రస్తావించిన గుయిర్నికా పైంటింగు గురించి ఉన్న అభిప్రాయం ఒకసారి చదవండి 🙂
చిత్రమైన కృతి కూడా, బాలమురళీది ఒకటి, UGC వారి కార్యక్రమం దూరదర్శన్ లో ఆయనే వివరించడం విన్నాను. “హనుమ అనుమ ఓ మనమా. అనుమానము వీడుమ…” సాహిత్యంలో “మ” వచ్చినపుడల్లా స్వరం లో “మ” వస్తుందిట. ఇలాటివన్నీ గమ్మత్తులు కాబోలు.
శాస్త్రీయ సంగీతం వదిలెయ్యండి, సినిమా సంగీతాన్ని కూడా సీరియస్ గా పట్టించుకోని వాళ్ళు కూడా “ఏమీ సేతుర లింగా, ఏమీ సేతుర” కి పరవశించడం ఆశ్చర్యంగా వుంటుంది.
అలాగే, అందాలరాముడు సినిమాకోసం, ఆరుద్ర రచన “పలుకే బంగారమాయెర అందాలరామా..” చివర చేసిన “హమ్మింగ్”, కచేరీ లో రామదాసు కీర్తన చివర చెయ్యడం కొంతమందికి నచ్చలేదు (95-96 ఢిల్లీ కచేరీలో) . బాలమురళీ సీరియస్ గా పాడడని ఒక వాదం.
“హమ్మింగ్” బదులు వాటి స్వరాలు పాడితే రైటా అని ఆ (వయసులో చాలా) పెద్దాయనని వినయంగా అడిగితే. నాలాటివాళ్ళు కచేరీలకి రావడం వల్లనే శాస్త్రీయసంగీతం “భ్రష్టు పట్టిపోతోందని” పక్కనున్నాయనతో తమిళంలో బాధపడిపోయేరు.
అద్భుతవైన వ్యాసం. అయితే ముఫ్ఫైల్లో మొదలెట్టిన బాలమురళీ సంగీతం, ఇప్పటిదాకా ఎలాటి మార్పులకు గురైయ్యిందో వివరించివుంటే ఇంకా బాగుండేది. బహుశా బాలమురళీ సంగీతం మీద ఇంకో వ్యాసం వస్తోందేమో? నాది దురాశ కాదని నా నమ్మకం.
ఈమాట జన్మానికి కారకులైన రామారావు గారికి అభినందనలు, కృతజ్ఞతలు. “వ్యాస విభాగం రాశిలోనూ, వాసిలోనూ పటిష్టంగా, ప్రతిష్టాత్మకంగా వుంది… వస్తువైశాల్యంతో పాటు …,” అని వారు అన్న దానితో నాకు భేదాభిప్రాయం ఉంది.
వ్యాసాల్లో ఎక్కువ భాగం సంగీత, సాహిత్య, విజ్ఞాన శాస్త్రాలకి పరిమితం. అది చాలదా, అంతకన్నా వైవిధ్యమేముంటుంది? అనిపించవచ్చు. కాని ఇవి ‘విషయభారమైన’ వ్యాసాలు; కొన్నయితే, జర్నల్స్ పేపర్లలాగా రెఫరెన్సుల జాబితాలతో సహా ఉంటాయి. 🙂 మహానుభావులు, విజ్ఞానవేత్తలు, కళాకోవిదులు – వీళ్ళ ప్రస్తావన లేని వ్యాసం అరుదు. ఇది ప్రవాసాంధ్రులలో ఉన్న లోపమా అన్న అనుమానం వచ్చింది.
కాని తన వచనం తన కవితలకే మాత్రమూ తీసిపోదని గర్వంగా చెప్పుకున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్యాసావళిని చూస్తే వాళ్ళ ఊళ్ళోని రావిచెట్టు మీద చెప్పిన ఓ అమూల్యాభిప్రాయం లాంటి ఒకటి రెండింటిని మినహాయిస్తే, మళ్ళా మహావ్యక్తులు, కవుల పరంపర, కవితా ప్రశస్తి – వాటికే ప్రాధాన్యత. వచనం చెప్పుకోదగ్గదేగాని, వైవిధ్యమెక్కడ?
కుప్ప తెప్పలుగా వ్యాసాలు రాసిన కొడవటిగంటి కుటుంబరావు ని తిరగేస్తే, “కళలు-శాస్త్రీయ విజ్ఞానం,” “సాహిత్య ప్రయోజనం,” “చరిత్ర వ్యాసాలు,” … – మళ్ళా అన్నీ విషయభారమైనవే!
సాహితీ ప్రక్రియలన్నిటిలోకీ సుళువైనదీ, అనేకానేక విషయాలకి అనువైనదీ, వ్యాసం: “There are as many kinds of essays as there are human attitudes or poses, as many essay flavors as there are Howard Johnson ice creams. The essayist arises in the morning and, if he has work to do, selects his garb from an unusually extensive wardrobe: he can pull on any sort of shirt, be any sort of person, according to his mood or his subject matter — philosopher, scold, jester, raconteur, confidant, pundit, devil’s advocate, enthusiast.” — EB White.
ఈమాట వ్యాసాల్లో కూడా వైవిధ్యం పెరగాలి. ఇప్పుడు రాస్తున్న వాళ్ళు వేరే విషయాల మీద కూడా దృష్టిసారించాలి. రాయనివాళ్ళు ఇదో బ్రహ్మవిద్య కాదని గ్రహించి ప్రయత్నించాలి.
అలాగని వ్యాసాలు రాసి పేరుప్రతిష్టలు గడించాలనుకుంటే అది దురాశే. ఆ భాగ్యం కలగాలంటే కవితలూ, కథలూ, నవలలూ రాయండి. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?” అన్న పాదం మన భాష ఉన్నన్నాళ్ళూ నిలుస్తుంది. పూలు పూసినంత కాలం “ఓ పువ్వు పూసింది” చదువుకుంటాం. “అతడు-ఆమె,” మనం, మధ్య సంబంధాల మాటొచ్చినపుడల్లా శాంతం గారు మన మనసులో మెదులుతూనే ఉంటారు. అందుకే వాటికున్న యోగ్యత వ్యాసాలకి లేదు, ఉండబోదు.
అందుకే సాహిత్యకారుల్లోకెల్లా కవులకీ, కథకులకీ, నవలాకారులకీ పెద్ద పీట. అందుకు తగ్గట్టుగా ఈమాట రచయితలు ఎదుగుతారని ఆశిస్తూ,
లైలా గారు, “జటిలుడు, కుటిలుడు లేనిదే కృష్ణలీల తెలియద”ని పరమహంస ఉవాచ. ఎంతటి గుగ్గురువులనైనా ప్రశ్నించడంలో తప్పులేదు. మీతో ఏకీభవిస్తాను.
కామేశ్వరరావు గారు, symbolism ( imagism ) కు కవి వ్యతిరేకి అని నేనెక్కడా చదివినట్టు లేదు. abstract expressions ని వ్యతిరేకించినట్టు గుర్తు. let me go back and read his book again.
మోహన గారు, you have eloquently put what I wanted to say. thank you.
వినీల్
అసమర్థులు గురించి ప్రవీణ్ గార్లపాటి గారి అభిప్రాయం:
11/08/2008 9:35 am
కథ బాగుంది.
విషయం ప్రెడిక్టబుల్‌గా ఉన్నా చెప్పిన విధానం ఆకట్టుకుంది.
[ప్రవీణ్ గారు, మీ సూచనలకు కృతజ్ఞతలు. వీటిని పరిశీలిస్తాము. — సంపాదకులు]
ఈమాట స్థాపనలో అనుకున్న కొన్ని సంగతులయినా నిజం అయినందుకు సంతోషం.
సాధించింది బాగున్నా ఇంకా సాధించాల్సినవి కూడా ఎన్నో ఉన్నాయి.
చిన్న చిన్న మార్పులు, జోడింపులతో ఈమాటని ఇంకొంచం బాగా తీర్చిదిద్దవచ్చేమో.
రీచ్: చక్కగా ఎన్నో ఫార్మాట్ లలో లభ్యమవుతున్న ఈమాటని అందరికీ రీచ్ అయ్యేలా కొద్ది కాలం పాటు ఒక న్యూస్ లెటర్ లాగా అందించవచ్చు. ఎలాగూ పీడీఎఫ్ ఫార్మాటు ఉంది కాబట్టి ఒక మెయిలింగు లిస్టు సృష్టించి దానిని జతచేసి ప్రతీ నెలా పంపించవచ్చు.
సంభాషణలకు వీలు: వ్యాసాలు, కథలకు ఈమాట ఇంటర్ఫేసు బాగున్నా సంభాషణలకు అంత వీలుగా లేదని నాకు అప్పుడూ అనిపిస్తుంటుంది.
చిన్న చిన్న మార్పులు చేసి ఇంటర్ఫేసుని ఇంకా చక్కగా తీర్చి దిద్దవచ్చు. ఉదా: వ్యాఖ్యలలో threading ప్రవేశపెట్టవచ్చు. ఒక చక్కని సంభాషణ కొనసాగించేలా చూడవచ్చు.
యూనీకోడు వాడకం పరంగా “ఈమాట” చాలా సంతృప్తి కలిగిస్తుంది.
మరచిపొమ్మంటున్నారు గురించి jagadeesh గారి అభిప్రాయం:
11/09/2008 6:51 am
చాలా బాగుంది…………
మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Audisesha reddy Kypu గారి అభిప్రాయం:
11/09/2008 5:16 am
ఇంద్రాణి గారూ! మీకు అలాంటి ఊరిలోకి పోవాలనే కోరిక ఎందుకు కలిగిందో! సాయంత్రం దాకా చూడండి. మరి ఎవరయినా చెప్పగలిగే వారు వస్తారేమో! సరదాగా అన్నాను. కోప్పడకండి. మీ కవిత బాగుంది.
నా రచనలు… audiseshareddy.blogspot.com లో వున్నాయి.
—- ఆదిశేషా రెడ్డి కైపు. నెల్లూరు.
సువర్ణభూమిలో … గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
11/09/2008 5:14 am
వినీల్ గారు,
గణిత సమీకరణాల్లో ఉండేవి abstract symbols కదా. Symbolismకి imagismకి తేడా ఉంది.
ఎలానూ మళ్ళీ భూషణ్ గారి పుస్తకం తిరగేస్తానన్నారు కాబట్టి, అతనికి మీరు ప్రస్తావించిన గుయిర్నికా పైంటింగు గురించి ఉన్న అభిప్రాయం ఒకసారి చదవండి 🙂
బాలమురళీకృష్ణ సంగీతం గురించి baabjeelu గారి అభిప్రాయం:
11/09/2008 12:03 am
చిత్రమైన కృతి కూడా, బాలమురళీది ఒకటి, UGC వారి కార్యక్రమం దూరదర్శన్ లో ఆయనే వివరించడం విన్నాను. “హనుమ అనుమ ఓ మనమా. అనుమానము వీడుమ…” సాహిత్యంలో “మ” వచ్చినపుడల్లా స్వరం లో “మ” వస్తుందిట. ఇలాటివన్నీ గమ్మత్తులు కాబోలు.
శాస్త్రీయ సంగీతం వదిలెయ్యండి, సినిమా సంగీతాన్ని కూడా సీరియస్ గా పట్టించుకోని వాళ్ళు కూడా “ఏమీ సేతుర లింగా, ఏమీ సేతుర” కి పరవశించడం ఆశ్చర్యంగా వుంటుంది.
అలాగే, అందాలరాముడు సినిమాకోసం, ఆరుద్ర రచన “పలుకే బంగారమాయెర అందాలరామా..” చివర చేసిన “హమ్మింగ్”, కచేరీ లో రామదాసు కీర్తన చివర చెయ్యడం కొంతమందికి నచ్చలేదు (95-96 ఢిల్లీ కచేరీలో) . బాలమురళీ సీరియస్ గా పాడడని ఒక వాదం.
“హమ్మింగ్” బదులు వాటి స్వరాలు పాడితే రైటా అని ఆ (వయసులో చాలా) పెద్దాయనని వినయంగా అడిగితే. నాలాటివాళ్ళు కచేరీలకి రావడం వల్లనే శాస్త్రీయసంగీతం “భ్రష్టు పట్టిపోతోందని” పక్కనున్నాయనతో తమిళంలో బాధపడిపోయేరు.
అద్భుతవైన వ్యాసం. అయితే ముఫ్ఫైల్లో మొదలెట్టిన బాలమురళీ సంగీతం, ఇప్పటిదాకా ఎలాటి మార్పులకు గురైయ్యిందో వివరించివుంటే ఇంకా బాగుండేది. బహుశా బాలమురళీ సంగీతం మీద ఇంకో వ్యాసం వస్తోందేమో? నాది దురాశ కాదని నా నమ్మకం.
పదేళ్ళ “ఈమాట” మాట గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/08/2008 11:49 am
వ్యాసాల్లో వైవిధ్యం
ఈమాట జన్మానికి కారకులైన రామారావు గారికి అభినందనలు, కృతజ్ఞతలు. “వ్యాస విభాగం రాశిలోనూ, వాసిలోనూ పటిష్టంగా, ప్రతిష్టాత్మకంగా వుంది… వస్తువైశాల్యంతో పాటు …,” అని వారు అన్న దానితో నాకు భేదాభిప్రాయం ఉంది.
వ్యాసాల్లో ఎక్కువ భాగం సంగీత, సాహిత్య, విజ్ఞాన శాస్త్రాలకి పరిమితం. అది చాలదా, అంతకన్నా వైవిధ్యమేముంటుంది? అనిపించవచ్చు. కాని ఇవి ‘విషయభారమైన’ వ్యాసాలు; కొన్నయితే, జర్నల్స్ పేపర్లలాగా రెఫరెన్సుల జాబితాలతో సహా ఉంటాయి. 🙂 మహానుభావులు, విజ్ఞానవేత్తలు, కళాకోవిదులు – వీళ్ళ ప్రస్తావన లేని వ్యాసం అరుదు. ఇది ప్రవాసాంధ్రులలో ఉన్న లోపమా అన్న అనుమానం వచ్చింది.
కాని తన వచనం తన కవితలకే మాత్రమూ తీసిపోదని గర్వంగా చెప్పుకున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్యాసావళిని చూస్తే వాళ్ళ ఊళ్ళోని రావిచెట్టు మీద చెప్పిన ఓ అమూల్యాభిప్రాయం లాంటి ఒకటి రెండింటిని మినహాయిస్తే, మళ్ళా మహావ్యక్తులు, కవుల పరంపర, కవితా ప్రశస్తి – వాటికే ప్రాధాన్యత. వచనం చెప్పుకోదగ్గదేగాని, వైవిధ్యమెక్కడ?
కుప్ప తెప్పలుగా వ్యాసాలు రాసిన కొడవటిగంటి కుటుంబరావు ని తిరగేస్తే, “కళలు-శాస్త్రీయ విజ్ఞానం,” “సాహిత్య ప్రయోజనం,” “చరిత్ర వ్యాసాలు,” … – మళ్ళా అన్నీ విషయభారమైనవే!
సాహితీ ప్రక్రియలన్నిటిలోకీ సుళువైనదీ, అనేకానేక విషయాలకి అనువైనదీ, వ్యాసం: “There are as many kinds of essays as there are human attitudes or poses, as many essay flavors as there are Howard Johnson ice creams. The essayist arises in the morning and, if he has work to do, selects his garb from an unusually extensive wardrobe: he can pull on any sort of shirt, be any sort of person, according to his mood or his subject matter — philosopher, scold, jester, raconteur, confidant, pundit, devil’s advocate, enthusiast.” — EB White.
ఈమాట వ్యాసాల్లో కూడా వైవిధ్యం పెరగాలి. ఇప్పుడు రాస్తున్న వాళ్ళు వేరే విషయాల మీద కూడా దృష్టిసారించాలి. రాయనివాళ్ళు ఇదో బ్రహ్మవిద్య కాదని గ్రహించి ప్రయత్నించాలి.
అలాగని వ్యాసాలు రాసి పేరుప్రతిష్టలు గడించాలనుకుంటే అది దురాశే. ఆ భాగ్యం కలగాలంటే కవితలూ, కథలూ, నవలలూ రాయండి. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?” అన్న పాదం మన భాష ఉన్నన్నాళ్ళూ నిలుస్తుంది. పూలు పూసినంత కాలం “ఓ పువ్వు పూసింది” చదువుకుంటాం. “అతడు-ఆమె,” మనం, మధ్య సంబంధాల మాటొచ్చినపుడల్లా శాంతం గారు మన మనసులో మెదులుతూనే ఉంటారు. అందుకే వాటికున్న యోగ్యత వ్యాసాలకి లేదు, ఉండబోదు.
అందుకే సాహిత్యకారుల్లోకెల్లా కవులకీ, కథకులకీ, నవలాకారులకీ పెద్ద పీట. అందుకు తగ్గట్టుగా ఈమాట రచయితలు ఎదుగుతారని ఆశిస్తూ,
కొడవళ్ళ హనుమంతరావు
సువర్ణభూమిలో … గురించి వినీల్ గారి అభిప్రాయం:
11/08/2008 11:21 am
లైలా గారు, “జటిలుడు, కుటిలుడు లేనిదే కృష్ణలీల తెలియద”ని పరమహంస ఉవాచ. ఎంతటి గుగ్గురువులనైనా ప్రశ్నించడంలో తప్పులేదు. మీతో ఏకీభవిస్తాను.
కామేశ్వరరావు గారు, symbolism ( imagism ) కు కవి వ్యతిరేకి అని నేనెక్కడా చదివినట్టు లేదు. abstract expressions ని వ్యతిరేకించినట్టు గుర్తు. let me go back and read his book again.
మోహన గారు, you have eloquently put what I wanted to say. thank you.
వినీల్
అసమర్థులు గురించి ప్రవీణ్ గార్లపాటి గారి అభిప్రాయం:
11/08/2008 9:35 am
కథ బాగుంది.
విషయం ప్రెడిక్టబుల్‌గా ఉన్నా చెప్పిన విధానం ఆకట్టుకుంది.
పదేళ్ళ “ఈమాట” మాట గురించి ప్రవీణ్ గార్లపాటి గారి అభిప్రాయం:
11/08/2008 9:32 am
[ప్రవీణ్ గారు, మీ సూచనలకు కృతజ్ఞతలు. వీటిని పరిశీలిస్తాము. — సంపాదకులు]
ఈమాట స్థాపనలో అనుకున్న కొన్ని సంగతులయినా నిజం అయినందుకు సంతోషం.
సాధించింది బాగున్నా ఇంకా సాధించాల్సినవి కూడా ఎన్నో ఉన్నాయి.
చిన్న చిన్న మార్పులు, జోడింపులతో ఈమాటని ఇంకొంచం బాగా తీర్చిదిద్దవచ్చేమో.
రీచ్: చక్కగా ఎన్నో ఫార్మాట్ లలో లభ్యమవుతున్న ఈమాటని అందరికీ రీచ్ అయ్యేలా కొద్ది కాలం పాటు ఒక న్యూస్ లెటర్ లాగా అందించవచ్చు. ఎలాగూ పీడీఎఫ్ ఫార్మాటు ఉంది కాబట్టి ఒక మెయిలింగు లిస్టు సృష్టించి దానిని జతచేసి ప్రతీ నెలా పంపించవచ్చు.
సంభాషణలకు వీలు: వ్యాసాలు, కథలకు ఈమాట ఇంటర్ఫేసు బాగున్నా సంభాషణలకు అంత వీలుగా లేదని నాకు అప్పుడూ అనిపిస్తుంటుంది.
చిన్న చిన్న మార్పులు చేసి ఇంటర్ఫేసుని ఇంకా చక్కగా తీర్చి దిద్దవచ్చు. ఉదా: వ్యాఖ్యలలో threading ప్రవేశపెట్టవచ్చు. ఒక చక్కని సంభాషణ కొనసాగించేలా చూడవచ్చు.
యూనీకోడు వాడకం పరంగా “ఈమాట” చాలా సంతృప్తి కలిగిస్తుంది.
ఈ మాటకి అభినందనలు.
డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష గురించి ప్రవీణ్ గార్లపాటి గారి అభిప్రాయం:
11/08/2008 9:05 am
బాగుంది. వివరాలు చక్కగా, సంక్షిప్తంగా అందజేసారు.
అసమర్థులు గురించి Audisesha reddy Kypu గారి అభిప్రాయం:
11/08/2008 6:03 am
రమ్య గీతిక గారూ..! కథ ఆసాంతం చదివాను. హృదయానికి హత్తుకునేలా యెంత బాగా రాశారు. కీపిటప్ …!
— కైపు ఆదిశేషా రెడ్డి.(నెల్లూరు )