Comment navigation


15786

« 1 ... 1318 1319 1320 1321 1322 ... 1579 »

  1. జనరంజని: మహానటి సావిత్రి గురించి PraveenReddy గారి అభిప్రాయం:

    11/13/2008 3:13 am

    శ్రీనివాస్ గారు మీకు చాలా థాంక్సు.

  2. రెండు తీరాలు గురించి kavya గారి అభిప్రాయం:

    11/13/2008 12:51 am

    చాలా బాగుంది.

  3. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి krishna a గారి అభిప్రాయం:

    11/12/2008 10:22 pm

    మేకలు తోలే పిల్లని అడగ వచ్చుకదా. మరి సమస్య ఏమిటి?

  4. రెండు తీరాలు గురించి krishna a గారి అభిప్రాయం:

    11/12/2008 10:16 pm

    నాకయితే ఈ కవితలో అంత గొప్ప ఏమీ కనిపించ లేదు.
    ఒకటి మాత్రం కరెక్టు గా చెప్పగలను. ఈ సైటులో ఏమి అర్థం కాకపోయినా అన్నీ గొప్ప గా వున్నట్లు వ్రాస్తారు.

  5. రామా కనవేమిరా! గురించి రాఘవ గారి అభిప్రాయం:

    11/12/2008 9:55 pm

    బాగుంది 🙂

  6. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి Malathi Nidadavolu గారి అభిప్రాయం:

    11/12/2008 3:33 pm

    I am grateful to Veluri garu for reading the book and the review.

    Vaidehi, thanks for your kind comments.

    Kodavalla Hanumantha Rao garu, thanks for your kind abhinandanalu. I explained my reasons for writing this book in English.

    Baabjeelu, Since you say you mean no offense to me personally, none is taken. Thanks for your expressing views. However, I would like to add that a sameeksha is intended only to introduce the book to the public.Maybe, meaningful discussion and critical reviews are possible after you read my book. (Maybe this is my way of getting a couple of books sold :))

    For the record, my book is not about feminism.

    Thanks.
    Malathi Nidadavolu

  7. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి seshagiri nookala గారి అభిప్రాయం:

    11/12/2008 2:57 pm

    చాలా బాగా చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మొత్తము చదివితే నాకు కళ్ళ వెంట నీరు వచ్చింది.

    -శేషు

  8. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    11/12/2008 12:55 pm

    లక్ష్మన్న గారూ,

    మీకు వ్యాసం నచ్చినందుకు సంతోషించాను.

    ఆన్నమయ్య కీర్తనల్లో సాహిత్యాన్ని ఎంతగానో పొగిడిన సాహితీవేత్తలు త్యాగరాజుకి అంత పెద్ద పీట వేయలేదు. కారణం సంగీత చట్రంలో సాహిత్యం బంధించే ప్రక్రియలో త్యాగరాజు చందస్సుని భంగపరిచాడన్న వాదముంది. రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు 1968లో అన్నమయ్య పై రాసిన వ్యాస పరంపర్లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. అలాగే కొన్ని పదాల వాడుక కూడా వారికి అంతగా రుచించలేదు. అలా అని త్యాగరాజు కీర్తనల్లో అసలు సాహిత్యమే లేదని ఆయన అనలేదు. సంగీతమున్నంత తారాస్థాయిలో సాహిత్యం లేదని వారి అభిప్రాయం. అదీకాక సంగీతానికిచ్చిన ప్రాముఖ్యత త్యాగరాజు సాహిత్యానికివ్వలేదని వారి వాదన. ఇవన్నీ రాబోయే భాగాల్లో వస్తాయి.

    త్యాగరాజు కటిక దరిద్రమనుభవించకపోయినా, ఆయన ఉద్యోగం చేయకపోవడం వల్ల ఇల్లుగడవడం కాస్త కష్టమే అయ్యిందని రాసారు. రోజూ ఆయనింట్లో పాతిక పైగా విస్తళ్ళు లేచేవి. ఒకరా ఇద్దరా శిష్యులు, అడగడం్ మహాపాపమన్నట్లుగా సంగీతం నేర్పాడు. అదీ ఉచితంగా.

    పోతననీ త్యాగరాజునీ పోల్చలేం. ఇద్దరిదీ భక్తి వాహకమే అయినా ఎంచుకున్న దారులు వేరు. అనుసరించిన తీరు వేరు. పోతన భాగవతం ప్రభావం త్యాగరాజు మీద ఉంది. ఆయన రాసుకున్న భాగవత ప్రతి తంజావూరు సరస్వతీ మహల్లో ఉంది. నేను వెళ్ళినప్పుడు నౌకా చరిత్రానికి ఫొటో తీసే అనుమతిచ్చారు కానీ, ఆ భాగవత ప్రతికి ఎంత బ్రతిమాలినా ఇవ్వలేదు. వ్యాస సూచికలో ప్రస్తావించిన పుస్తకాల సంఖ్య కంటే ఎక్కువే దొరికినా కొన్ని ప్రతులు సంపాదించలేకపోయాను. అమెరికాలో ఉండడం ఓ పెద్ద అడ్డంకయ్యింది. ఈ వ్యాసం రాయడానికి కష్టపడ్డం వాస్తవమే! ఆ కష్టంలో ఆనందం దొరికింది.

  9. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    11/12/2008 10:44 am

    సాయి బ్రహ్మానందం గొర్తి గారూ:

    మీ వ్యాసం చాలా బాగుంది. ఎన్నో పుస్తకాలను తిరగేసి, చాలా మందిని సంప్రదిస్తే తప్ప ఇటువంటి మంచి వ్యాసం రాదు.

    త్యాగరాజుపై ప్రజాభిప్రాయం మీరు రాసిన దానికన్నా ఎందుకు భిన్నంగా వస్తూ ఉందో తెలియదు. త్యాగబ్రహ్మ కటిక పేదరికం అనుభవించాడని అందరిలాగే నేనూ అనుకొనేవాడిని. కాని, దానికి భిన్నంగా తగినంత ఆస్తిపరుడేనని మొన్న మొన్న తెలిసింది.

    త్యాగరాజు మీద నాకు చాలా ఎక్కువ గౌరవం. అయితే, నన్ను ఎప్పుడూ ఒక్క విషయం కలవరపెడుతుంది. సంగీతంలో అనుమానం లేకుండా అసామాన్య ప్రతిభ కలవాడైనా, సాహిత్యకారుడుగా ఈయన గొప్పతనం ఎంతవరకు పెద్దలు ఆమోదించారు? భక్తి రసం పోషణ ఈయన సాహిత్యం అంతా అతి చక్కగా తెలుస్తూనే ఉంటుంది. కానీ, సాహిత్యంలో భక్తి రసం పోతన తీసుకెళ్ళిన ఎత్తులు, మరెవరూ చేరలేరేమో!

    సాహిత్యంతో బాగా పరిచయమున్న విజ్ఞులు దీనికి సమాధానం చెప్పగలరేమో!

    అభినందనలతో,

    లక్ష్మన్న

  10. చంపకోత్పలమాలల కథ గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    11/12/2008 10:44 am

    “బలమైన ఎత్తుగడ,స్ఫుటబలోక్తి , సూటిగా దూసుకు పోయే శైలీవిన్యాసాలతో అలరారుతున్నపద్యం నిస్సందే్హంగా ఎన్నదగిన పద్యాల్లో ఒకటి.” -తమ్మినేని యదుకుల భూషణ్.

    అర్థ మశాశ్వతమ్ము, యొడలన్నది తక్షణభంగురమ్ము, త-
    త్వార్థము గాదు జీవనమ్ము, కృతాంతక మారక, మ్మిట్టి దీనినిన్
    రత్తి గుఱించి నమ్మక పరార్థము నెన్నడు జేటు లేని ధ-
    ర్మార్థమ చేయుడి మ్మనుజు లమ్మెన పెగ్గడ యట్లు వేర్మిలోన్

    ఈ పై పద్యం గురించే మీరు చెప్పేది! ఈ పద్యం ఉత్పల మాల ఐతే అవునేమో గాని పద్యం స్ఫుట బలోక్తితో మాత్రం పిటపిట లాడిపోటల్లేదు. మొత్తం కలిపి చదివితే ఈ పద్యానికి అసలు అర్థమే లేదు అనిపిస్తున్నది. The conclusion (or rather the advice given ) is incongruous.

    Care to explain?

    లైలా

« 1 ... 1318 1319 1320 1321 1322 ... 1579 »