Rao Panganamamula గారికి,
చాలా మంచి ముచ్చట రాసేరు. 1981 లేదా 1982 లో, Luz corner “మెడ్రాస్” లో, శ్రీనివాస శాస్త్రి మెమోరియల్ హాల్లోనే అనుకుంటాను, ద్వారం వారి జయంతుత్సవంలో, బాలమురళీ కి చంద్రశేఖరరావుగారో, శాస్త్రి గారో, వయొలెన్ వాద్యం మీద సహకారం అందించేరు.”ఏమీ సేతుర లింగా..” అని బాలమురళీ మొదలెట్టీ సరికి, కమాను పక్కన పెట్టి, “టింగ్. టింగ్, టింగ్. టింగ్” అని చంద్రశేఖర రావు గారు మొదలెట్టేరు. ఆయన అంధుడు. బాలమురళీ ప్రశంసాపూర్వకంగా ఆయన్ని pat చేసేరు. ఆ తరవాత “గంగ ఉదకము తెచ్చి నీకు..” చివర్లో “ఉహూఁ” అని బాలమురళీ అన్నదానికీ వయొలెన్ వంత పాడింది. ఇంకో సారి మరీ మద్రంగా “ఉహూఁ” అన్నప్పుడు, చంద్రశేఖర రావు గారు వాయించడం ఆపి touched బాలమురళీ.
మీరు చెప్పినట్టు కృష్ణారావుగారు అద్భుతంగా వాయించుండొచ్చు, ఆ రోజు. నాకు తెలిసి, కన్యాకుమారి గారు (అనే అనుకుంటాను) ఒక కచేరీలో వయొలెన్ సహకారం మొదలెట్టి, మధ్యలో వాయిద్యాన్ని పక్కన పెట్టి, vocalist కి దండం పెట్టి కచేరీ అయీవరకూ అలాగే కూచున్నారు.రోహిణీప్రసాదు గారే ఇంకొక వ్యాసం లో రాసినట్టు, వయొలినిస్టుల్ని, బాగా వాయించీ వాళ్ళని, బాలమురళీ కచేరీకి వెతకడం చాలా కష్టంగా వుండీదిట. మంచి ముచ్చట రాశేరు.
దెహ్రాడూన్ లో కూడా కచేరీ చేసేడా ఈయన? కృష్ణారావుగారికి అభినందనలు అద్భుతంగా వాయించినందుకు.
నేను మీ పుస్తకం గురించి రాయలేదు. చదవలేదు కాబట్టి. “సినాప్సిస్” లో “ఉటంకించిన” ఆ “పేరాగ్రాఫ్” గురించే రాసేను. మీరే వేదిక మీదకొచ్చేరు కాబట్టి, సూటిగా మిమ్మల్నే అడగొచ్చు, మీ పుస్తకంలోని “పేరాగ్రాఫ్” ల గురించి. స్త్రీ వాదం గురించి కాదు మీ పుస్తకం, మీ దృ(సృ)ష్టిలో. బతికించేరు. కానీ, “The woman writers of this era were unassuming in their real life. Cherished traditional values. While registering their dissent.” says Malathi. దీని గురించేవంటారు?
మాలతిగారూ – Would you please explain why somebody has to be usassuming in their real life? Is it a virtue? Is it good? While maintaining unassuing in real life, cherishing traditional values. At the same time registering their dissent???? Have they cherished or maintained? My experience was their escape route is “cherishing” traditional values. I am writing about women of that era, not writers you listed..
మాలతిగారూ – మీ పుస్తకంలో మీ ఇష్టవొఁచ్చినట్టు రాసుకోవచ్చు. “రీడబిలిటీ” వుంటే (వేలూరి వారి భాషలో “అసాధారణ” పాఠకులు, మాలాటి సాధారణ పాఠకులు) కొనుక్కునో, కొట్టుకొచ్చో చదివేస్తాం.
If the book is not about feminism, ఈ “పేరాగ్రాఫ్” లెందుకు? ఇదంతా రాసిన తరవాత, ఒక ధర్మ సందేహం. మీరు రాసింది ఆ కాలపు రచయిత్రుల గురించి, వారి రచనల గురించి. మధ్యలో ఈ “స్త్రీవాదం” ఎందుకొచ్చిందీ?
ఒక పార్వతి ఒక ద్రౌపది ఒక దేవత ఒక రాధ……..ఇలా ఎన్నొ, ఎన్నెన్నొ పాత్రల్లొ విన్న. చూసిన మన సావిత్రి, సావిత్రిగా ఇలా వినపడుతూ….అద్భుతంగా ఉంది. ఇంత ఆనందాన్నిచ్చిన మీ అందరికి వందనాలు.
I did not find the exact reasons why you wrote in English – I might have missed. In your foreword, you did mention Women Writing in India and Knit India through Literature as two major works that set Telugu women’s writing in the larger context; I assumed you wanted to supplement them with a more critical analysis and hence you wrote in English.
మీకు పుస్తక సమీక్ష అంటే పుస్తక పరిచయం. నాకు సమీక్ష అంటే గుణదోష విచారణ చేసేది, కేవలం పరిచయం చేసేది కాదు. నిఘంటువు ప్రకారం సమీక్ష అంటే తీవ్రమైన చూపు, జాగ్రత్తగా పరిశీలించేది.
ఈ పై పద్యం గురించే మీరు చెప్పేది! ఈ పద్యం ఉత్పల మాల ఐతే అవునేమో గాని పద్యం స్ఫుట బలోక్తితో మాత్రం పిటపిట లాడిపోటల్లేదు. మొత్తం కలిపి చదివితే ఈ పద్యానికి అసలు అర్థమే లేదు అనిపిస్తున్నది. The conclusion (or rather the advice given ) is incongruous.
Care to explain?
-లైలా యెర్నేని
ఈ పద్యానికి అర్థమే లేదన్నారు. మొదట మీరు వ్రాసింది అదేనా అని ఒక రెండు సార్లు చదివాను. తర్వాత. వ్యంగ్య ప్రయోగమా అని సరి చూసాను. అదీ కాదు. అంటే నిజంగా మీకు అర్థం కాలేదు.
ఒక పద్యానికి అర్థమే లేదు అని చెప్పాలంటే కొంత మీమాంస అవసరమే. మీరు ఎంత ఆలోచించారొ తెలియదు. చాలా మంది ప్రస్తుతం తెలుగు “కవులు” ‘తెలియని వన్ని తప్పులని…” చెప్పడం పరిపాటి అయ్యింది. మీరలా కాదనుకొన్నాను. ఇక పద్యం లోకి వస్తే
ఇది చాలా సూటిగా దూసుకు పోయే పద్యం – భారతీయ తత్వంలో కర్మ ఫలానికి ఉన్న గొప్ప దనం కాస్తో కూస్తో పూర్వ రచనలతో పరిచయమున్న ప్రతి వారికి తెలుసు. జీవితంలో ఏది అశాశ్వతం , ఏది శాశ్వతం అనేది నిక్కచ్చి పదాలతో బలంగా చెపుతోందీ పద్యం. అర్థం అశాశ్వతం అనే బలమైన ఎత్తుగడతో మొదలై (కవి కాలాన్ని గమనించండి). శరీరం అశాశ్వతం అని ఆ తర్వాత ఏది శాశ్వతం అని చెపుతోందీ పద్యం. (మోహన గారి వివరణ తర్వాత అసలు ఈ పద్యానికి ఇంకా వివరణ అనవసరమనుకున్నాను. )
లైలా గారు అప్పుడప్పుడు కొంచెం భారతీయ సాహిత్యం చదువుతూ ఉండండి నిదానంగా అదే అర్దమవటం మొదలవుతుంది.
బాలమురళీకృష్ణ సంగీతం గురించి baabjeelu గారి అభిప్రాయం:
11/14/2008 7:23 am
Rao Panganamamula గారికి,
చాలా మంచి ముచ్చట రాసేరు. 1981 లేదా 1982 లో, Luz corner “మెడ్రాస్” లో, శ్రీనివాస శాస్త్రి మెమోరియల్ హాల్లోనే అనుకుంటాను, ద్వారం వారి జయంతుత్సవంలో, బాలమురళీ కి చంద్రశేఖరరావుగారో, శాస్త్రి గారో, వయొలెన్ వాద్యం మీద సహకారం అందించేరు.”ఏమీ సేతుర లింగా..” అని బాలమురళీ మొదలెట్టీ సరికి, కమాను పక్కన పెట్టి, “టింగ్. టింగ్, టింగ్. టింగ్” అని చంద్రశేఖర రావు గారు మొదలెట్టేరు. ఆయన అంధుడు. బాలమురళీ ప్రశంసాపూర్వకంగా ఆయన్ని pat చేసేరు. ఆ తరవాత “గంగ ఉదకము తెచ్చి నీకు..” చివర్లో “ఉహూఁ” అని బాలమురళీ అన్నదానికీ వయొలెన్ వంత పాడింది. ఇంకో సారి మరీ మద్రంగా “ఉహూఁ” అన్నప్పుడు, చంద్రశేఖర రావు గారు వాయించడం ఆపి touched బాలమురళీ.
మీరు చెప్పినట్టు కృష్ణారావుగారు అద్భుతంగా వాయించుండొచ్చు, ఆ రోజు. నాకు తెలిసి, కన్యాకుమారి గారు (అనే అనుకుంటాను) ఒక కచేరీలో వయొలెన్ సహకారం మొదలెట్టి, మధ్యలో వాయిద్యాన్ని పక్కన పెట్టి, vocalist కి దండం పెట్టి కచేరీ అయీవరకూ అలాగే కూచున్నారు.రోహిణీప్రసాదు గారే ఇంకొక వ్యాసం లో రాసినట్టు, వయొలినిస్టుల్ని, బాగా వాయించీ వాళ్ళని, బాలమురళీ కచేరీకి వెతకడం చాలా కష్టంగా వుండీదిట. మంచి ముచ్చట రాశేరు.
దెహ్రాడూన్ లో కూడా కచేరీ చేసేడా ఈయన? కృష్ణారావుగారికి అభినందనలు అద్భుతంగా వాయించినందుకు.
A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి baabjeelu గారి అభిప్రాయం:
11/14/2008 6:16 am
నిడదవోలు మాలతిగారికి,
నేను మీ పుస్తకం గురించి రాయలేదు. చదవలేదు కాబట్టి. “సినాప్సిస్” లో “ఉటంకించిన” ఆ “పేరాగ్రాఫ్” గురించే రాసేను. మీరే వేదిక మీదకొచ్చేరు కాబట్టి, సూటిగా మిమ్మల్నే అడగొచ్చు, మీ పుస్తకంలోని “పేరాగ్రాఫ్” ల గురించి. స్త్రీ వాదం గురించి కాదు మీ పుస్తకం, మీ దృ(సృ)ష్టిలో. బతికించేరు. కానీ, “The woman writers of this era were unassuming in their real life. Cherished traditional values. While registering their dissent.” says Malathi. దీని గురించేవంటారు?
మాలతిగారూ – Would you please explain why somebody has to be usassuming in their real life? Is it a virtue? Is it good? While maintaining unassuing in real life, cherishing traditional values. At the same time registering their dissent???? Have they cherished or maintained? My experience was their escape route is “cherishing” traditional values. I am writing about women of that era, not writers you listed..
మాలతిగారూ – మీ పుస్తకంలో మీ ఇష్టవొఁచ్చినట్టు రాసుకోవచ్చు. “రీడబిలిటీ” వుంటే (వేలూరి వారి భాషలో “అసాధారణ” పాఠకులు, మాలాటి సాధారణ పాఠకులు) కొనుక్కునో, కొట్టుకొచ్చో చదివేస్తాం.
If the book is not about feminism, ఈ “పేరాగ్రాఫ్” లెందుకు? ఇదంతా రాసిన తరవాత, ఒక ధర్మ సందేహం. మీరు రాసింది ఆ కాలపు రచయిత్రుల గురించి, వారి రచనల గురించి. మధ్యలో ఈ “స్త్రీవాదం” ఎందుకొచ్చిందీ?
అసమర్థులు గురించి sahithi గారి అభిప్రాయం:
11/14/2008 6:04 am
చాలా బాగావున్నది.
పురూరవ: శ్రవ్య నాటిక గురించి appaji గారి అభిప్రాయం:
11/14/2008 5:57 am
చాలా థ్యాంక్స్ అండీ
జనరంజని: మహానటి సావిత్రి గురించి sarada గారి అభిప్రాయం:
11/14/2008 1:52 am
ఒక పార్వతి ఒక ద్రౌపది ఒక దేవత ఒక రాధ……..ఇలా ఎన్నొ, ఎన్నెన్నొ పాత్రల్లొ విన్న. చూసిన మన సావిత్రి, సావిత్రిగా ఇలా వినపడుతూ….అద్భుతంగా ఉంది. ఇంత ఆనందాన్నిచ్చిన మీ అందరికి వందనాలు.
సార్ గారండీ… సార్ గారండీ… గురించి రాఘవ గారి అభిప్రాయం:
11/14/2008 1:25 am
ఆహా అనిపించింది! అభినందనలూ అభివందనములూ!
A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/13/2008 11:04 pm
మాలతి గారికి,
I did not find the exact reasons why you wrote in English – I might have missed. In your foreword, you did mention Women Writing in India and Knit India through Literature as two major works that set Telugu women’s writing in the larger context; I assumed you wanted to supplement them with a more critical analysis and hence you wrote in English.
మీకు పుస్తక సమీక్ష అంటే పుస్తక పరిచయం. నాకు సమీక్ష అంటే గుణదోష విచారణ చేసేది, కేవలం పరిచయం చేసేది కాదు. నిఘంటువు ప్రకారం సమీక్ష అంటే తీవ్రమైన చూపు, జాగ్రత్తగా పరిశీలించేది.
కొడవళ్ళ హనుమంతరావు
మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Indrani Palaparthy గారి అభిప్రాయం:
11/13/2008 10:11 pm
కృష్ణ గారు, ఎవరిని అడగాలా అని తికమక పడడం ఎవరి ఆనందాన్ని భంగం చేయడం ఇష్టం లేకే.ఆ మాటకొస్తే సన్యాసిని కూడా అడగ వచ్చును కదా!.
పాలపర్తి ఇంద్రాణి.
ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం! గురించి Jyothi గారి అభిప్రాయం:
11/13/2008 9:51 pm
ఈమాట సంపాదకవర్గానికి, పాఠకులందరికి పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు..
చంపకోత్పలమాలల కథ గురించి Garikapati గారి అభిప్రాయం:
11/13/2008 7:07 pm
ఈ పద్యానికి అర్థమే లేదన్నారు. మొదట మీరు వ్రాసింది అదేనా అని ఒక రెండు సార్లు చదివాను. తర్వాత. వ్యంగ్య ప్రయోగమా అని సరి చూసాను. అదీ కాదు. అంటే నిజంగా మీకు అర్థం కాలేదు.
ఒక పద్యానికి అర్థమే లేదు అని చెప్పాలంటే కొంత మీమాంస అవసరమే. మీరు ఎంత ఆలోచించారొ తెలియదు. చాలా మంది ప్రస్తుతం తెలుగు “కవులు” ‘తెలియని వన్ని తప్పులని…” చెప్పడం పరిపాటి అయ్యింది. మీరలా కాదనుకొన్నాను. ఇక పద్యం లోకి వస్తే
ఇది చాలా సూటిగా దూసుకు పోయే పద్యం – భారతీయ తత్వంలో కర్మ ఫలానికి ఉన్న గొప్ప దనం కాస్తో కూస్తో పూర్వ రచనలతో పరిచయమున్న ప్రతి వారికి తెలుసు. జీవితంలో ఏది అశాశ్వతం , ఏది శాశ్వతం అనేది నిక్కచ్చి పదాలతో బలంగా చెపుతోందీ పద్యం. అర్థం అశాశ్వతం అనే బలమైన ఎత్తుగడతో మొదలై (కవి కాలాన్ని గమనించండి). శరీరం అశాశ్వతం అని ఆ తర్వాత ఏది శాశ్వతం అని చెపుతోందీ పద్యం. (మోహన గారి వివరణ తర్వాత అసలు ఈ పద్యానికి ఇంకా వివరణ అనవసరమనుకున్నాను. )
లైలా గారు అప్పుడప్పుడు కొంచెం భారతీయ సాహిత్యం చదువుతూ ఉండండి నిదానంగా అదే అర్దమవటం మొదలవుతుంది.
భవదీయుడు
గరికపాటి