లోకం అనువాద కవితకు తమిళ మూలం: తెలుగు, తమిళ్ లిపులలో. ఉలగం – వైరముత్తు సంపుటి: తమిళుక్కు నిఱముండు – 1995 (తమిళానికి రంగుంది) […]

చిన్నప్పుడోసారి ఇంట్లో నన్నొదిలి నాలుగురోజులు ఎటోపోయి తర్వాత ఇంటికొచ్చారు అమ్మా నాన్నా. నేను ఆడుకొంటూ పట్టించుకోలేదు, కానీ కాసేపటికి అనుమానమొచ్చి లోపలికెళ్ళి చూశాను. అమ్మ వళ్ళో ఓ పాప పడుకొని ఉంది. ఎవరోలే పాపం అని నా మానాన నేను ఆడుకొంటూ కొంచెం సేపయ్యాక మళ్ళీ చూస్తే అదింకా ఆ ఫోజు లోనే ఉంది.

అరిచి గీపెట్టి, తనకు కావలసిన విధంగా కథ తయారు చేయించుకుని, పాటలు తన అభిరుచికి తగ్గట్టు సంగీత దర్శకుని నుంచి రప్పించుకుని, తన కష్టాన్నంతటినీ దర్శకుడి చేతిలో పెట్టి, మంచి సినిమా తయారు కావడానికి ఇతోధిక సాయం చేసి, ఆనక పక్కకు తప్పుకునేవాడు– ఒక విధంగా ఉత్తమ నిర్మాత.

ఇంతలో హడావిడిగా సుబ్బారావు అచ్చటికి వచ్చెను. నావైపుకి అభిముఖుడై వచ్చుచూ ఏమాలోచించుచున్నారని అడిగెను. భళారే విచిత్రం పాటను గూర్చి ఆలోచించుచుంటినని, అటులనా, ఎంతైనా నా ముందు తరము వారు కదా! అని వెటకారముగ బలికి నవ్వెను. వంకాయవంటి కూరయు వంకజముఖి సీత వంటి భార్యామణియు అన్న నానుడి తెలుసునా అనగా తనకు సంస్కృతము రాదనెను.

మేఘం మనిషైతే ఎంత బాగుండును
నాలుగు మాటలు చల్లగా విన్పించేది
మనిషైనా మేఘమైతే బాగుండును
వేచిన ఏ మనసుపైనో పన్నీటి జల్లు కురిసేది

తెలుగు, కన్నడము, హిందీ, మరాఠీ మున్నగు భాషలలో గణములను జ్ఞాపకములో ఉంచుకొనడానికి య-మా-తా-రా-జ-భా-న-స-ల-గం అనే ఒక సులభసూత్రము వ్యాప్తిలో నున్నది. ఛందస్సు నేర్చుకొనే విద్యార్థికి ఇది తెలిసిన విషయమే. గణము యొక్క పేరు ముందే ఉండడము వలన అందులోని గురు లఘువులను తెలిసికొనుట సులభము అవుతుంది.

ఈ పరిస్థితులున్న సమాజంలో భావ వ్యక్తీకరణ, వాక్‌-స్వాతంత్రము ఇవన్నీ నాగరిక ప్రపంచంలో మాటలుగానే వాడబడుతున్నాయి. కులవ్యవస్థ పాతుకుపోయున్న సమాజంలో ఈ కొత్త నిర్వచనాలేవీ చొచ్చుకుపోయి ప్రభావితం చేసేంతగా బలపడలేవు. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది చదువు లేకపోవడం. రెండవది, మనకు లభించే చదువుల నాణ్యత.

గడినుడి 12 కూడా ఎవరూ చివరిదాకా పూర్తిగా చేయలేకపోయారు, సరిచూపు ఆప్షన్ ఇచ్చేదాకా, ఒక్కరు మినహా. ఆ ఏకైక విజేత సతీష్‌కు మా అభినందనలు. సరిచూపు ఆప్షన్ ఉపయోగించుకొని గడి పూర్తిగా నింపిన మొదటి నలుగురు: ఉరుపుటూరి శ్రీనివాస్, వేదుల సుభద్ర, భమిడిపాటి సూర్యలక్ష్మి, పూల రమాదేవి.

గడి నుడి – 12 సమాధానాలు, వివరణ.

అడ్డం కయ్యం సరిగా ఆరంభమైతే అందమైన పక్షి (4) సమాధానం: కయ్యం అంటే కలహం. సరి అరంభంతో కలహంస జీవనుడు కడవరకూ లేకుండా బేజారైతే […]

“మేడమ్, మీ తీయని స్వరంలో రిపోర్ట్ అన్న మాట రావచ్చా? ఈ శాఖ మొదలైనప్పట్నుండి నేను బిల్లులన్నీ సరిగ్గానే చెల్లిస్తూ వస్తున్నాను. నాకు దేశభక్తి, భూభక్తి, భూగురుత్వాకర్షణభక్తి మెండుగానే ఉన్నాయి. గురుత్వాకర్షణ గురించి ఒక కవితైనా చదవకుండా ఏ రోజూ నేను నిద్రపోయినవాడిని కాను. మేడమ్, ఎలాగైనా నేను ఈ బిల్లు చెల్లించేస్తాను.”

తెలుగు పాత్రికేయ సాహిత్య రంగాలలో సుప్రసిద్ధుడైన మోహన్ గురించి ఆయనొక కార్టూనిస్టు అనో తెలుగులో మొట్టమొదటి గ్రాఫిక్ ఆర్టిస్టు, ఆనిమేషనిస్టు అనో మాత్రమే చెప్పి ఇప్పటిదాకా ఎవరూ ఆగిపోలేదు, ఇక ఆగిపోలేరు కూడా. చక్కటి ఆర్టిస్ట్ కావడం ఆయనలో కేవలం ఒక పార్శ్వమే. సాహిత్యకారుడు, కళా విమర్శకుడూ అయిన ఆయన ఎందరు రచయితలూ కళాకారులపై ఎంత ప్రభావం చూపింది, మోహన్ ప్రాంగణం ఎలా ఎందరో సాహిత్యకళాకారులకు ఒక పిట్టలు వాలే చెట్టు అయింది, ఆ నీడన ఎన్ని కొత్త కుంచెలు రంగు నింపుకున్నది, ఆయన మరణంతో వెల్లువెత్తిన నివాళులు, జ్ఞాపకాల తలపోతలు ఊహామాత్రంగానే మనకు పట్టిస్తాయి. అకాలంగా వెళ్ళిపోయిన ఆ విశిష్టకళాకారుడు, స్నేహశీలి, మోహన్‌కో నూలుపోగు: ఆయన గీతను పరిచయం చేస్తూ శివాజీ తల్లావజ్ఝల, గోవిందరాజు చక్రధర్ చేసిన ఒకనాటి ముఖాముఖీ; మారిషస్ వంటి బహుభాషీయదేశంలో తెలుగు రెండవభాషగా నేర్చుకునే వారి భాష, లేఖనాలపై పరభాషల ప్రభావం గురించి వివరిస్తూ రాజ్వంతీ దాలయ్య పరిశోధనావ్యాసం; అంతుచిక్కని వింతదేవుడు అంటూ గణపతి గురించి ఒక టీజర్ మాత్రమే ఇచ్చి ఎందరినో తన వ్యాసం కొరకు ఎదురుచూసేలా చేసిన సురేశ్ కొలిచాల వ్యాసం; ఇంకా, కథలు, కవితలు, వ్యాసాలు, సమీక్షలు, శీర్షికలూ…

జ్ఞాపకాలు కవితల్లాగో తీయని కలల్లాగో దుఃఖాంతపు నిర్వేదంలాగో మరెలాగో వుండటం ఒక ‘సంగతి’. కానీ జ్ఞాపకాలు పరిశోధకులకు పనికివచ్చే పాఠాలుగా వుండటం మాత్రం కవిత్వ ప్రయోజనాన్ని మించిన ఆవశ్యకం. మోహన్ గీసిన రేఖలూ క్రోక్విల్ గీతలూ సౌందర్య సమీక్షకు సిసలైన సుబోధకాలు.

డాక్టర్‌తో నీ సంభాషణ గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తావు. ప్రిస్క్రిప్షన్ కోసం హేండ్‌బేగ్ అంతా తిరగతోడుతావు. చివరకు దొరుకుతుంది. అందులో పైన నీ పేరు, వయసు రాసుంటుంది. ఒక పక్కగా నీ ఎత్తు, బరువు, బిపి వగైరా వివరాలు. పేజీ మధ్యలో నువ్వు చెప్పిన లక్షణాలు అన్నీ వుంటాయి. డాక్టర్‌కు కాఫెటేరియాలో నువ్వు విన్నవి కూడా చెప్పావు. ఆమె ముఖంలో ఏ భావమూ లేకుండా విన్నది గుర్తొస్తుంది నీకు.

అది ఆరవయ్యో దశకం. నేను టీనేజర్ని, పిల్ల విద్యార్థినాయకుణ్ణి ప్లస్ కార్యకర్తని. నేను కృష్ణశాస్త్రి కవితలకీ బొలీవియన్ జంగిల్ వార్‌కీ టెట్ అఫెన్సివ్‌కీ బాపూ చిత్తప్రసాద్ బొమ్మలకీ పుట్టిన బిడ్డని. బయాఫ్రాలో చనిపోయిన బిడ్డల ఏడుపు నుంచీ మా పేటలో జూట్ కార్మికుల మురికి బ్రతుకులనుంచీ జామిని రాయ్, లాత్రెక్, ఇల్యా రెపిన్ పెయింటింగ్‌ల నుండీ పుట్టాను.

అలాగే అంతకు ముందు సాహిత్యంలో విఘ్నకారకులుగా, దుష్టులైన భూతగణాలతోపాటు వర్ణించబడ్డ వినాయకులు చివరకు ఒకే వినాయకుడి రూపు దాల్చడం, ఆ వినాయకుడు గజముఖుడైన గణేశునితో విలీనం చెందడం, గణేశుడు పార్వతి పుత్రుడిగా, స్కందుని సోదరుడిగా శివపార్వతుల కుటుంబంలో చేరిపోవడం– ఈ కథనాలన్నీ పురాణాల్లోనే కనిపిస్తాయి.

గంభీరముద్రతో కదులుతున్న ఒంటరితనాలు
చిక్కగా కమ్ముకుంటున్న మబ్బుల గుంపులై,
చివరికి ఎప్పుడో, ఎక్కడో నిష్పూచిగా కురిసేందుకు
సమాయత్తమవుతున్నట్టే ఉన్నాయి!