జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
Category Archive: సంచికలు
అడ్డం బడి చేతకాకపొతే మంత్రగాళ్ళు చేసేది (4) సమాధానం: చేతబడి. హిమాలయాల్లో విశేషంగా అప్పుడప్పుడు కనిపించే మోసకాడు (3) సమాధానం: మాయావి. రాత్రి ఉండే […]
కళావర్ రింగ్ (1908-1964) అన్న పేరు నేను మొదటిసారి విన్నది 1981-82 ప్రాంతాల్లో. ఆవిడ అసలు పేరు సరిదె లక్ష్మీ నరసమ్మ. కళావర్ రింగ్ అన్న పేరు రావటానికి ఒక శృంగార పురుషుని చేతికున్న కళావర్ మార్కు ఉంగరం కావాలి అని మారాం చేస్తే అతడు ఆవిడను చేరదీసినట్లు, అప్పటి నుండి ఆ పేరు స్థిరపడిపోయినట్లు చెప్తారు.
గడినుడి 14 పూర్తిగా నింపిన 1. కామాక్షి, 2. ఆళ్ళ రామారావు గార్లకు మా అభినందనలు. సరిచూపు సహాయంతో గడి పూర్తిగా తప్పులు లేకుండా నింపిన మొదటి ఐదుగురు: 1. రమాదేవి పూల, 2. కార్తిక్ చంద్ర, 3. GBT Sundari, 4. హేమంత్ గోటేటి, 5. రవిచంద్ర ఇనగంటి. వీరికి మా అభినందనలు.
ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల రాట్నము అనే పాట 1966లో వచ్చిన రంగులరాట్నం సినిమాలోది. రాసినది ఎస్. వి. భుజంగరాయ శర్మ. ఈ పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. భారతీయ తాత్త్విక దృక్పథాన్ని మొత్తం రంగరించి శర్మ ఈపాటలో నింపారంటారు శ్రీరమణ, శర్మగారి 92వ జయంతి (డిసెంబర్ 15న) సందర్భంగా రాసిన తన నివాళి వ్యాసంలో. అలాగే, వెంపటి చినసత్యం, పట్రాయని సంగీతరావులతో కలిసి కూచిపూడిత్రయంలో ఒకరిగా పేరుపొందిన భుజంగరాయ శర్మ తన పదం ద్వారా ఆ నాట్యకళకు చేసిన మరవలేని సేవను, మనిషిగా వారి మహనీయతనూ పరామర్శిస్తారు తను మాత్రమే చెప్పగలిగే మాటల్లో; ఆ రంగులరాట్నం సినిమా తీసిన బి. ఎన్. రెడ్డి మీద అప్పుడు రాసిన వ్యాసం తరువాత, వారి ఆకాశవాణి ఇంటర్‌వ్యూ ఇదే సంచికలో ఇప్పుడు పరుచూరి శ్రీనివాస్ అందించడం కాకతాళీయమే అయినా సందర్భోచితం; రజనీకాంతరావు, సంగీతరావుల గురించి కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఒకప్పుడు ఈమాటలో రాసిన వ్యాసం ఈ సందర్బంలో గుర్తుచేసుకోవడం సముచితం; సాహిత్యవిమర్శలో ఒక సరి అయిన బాట పరుస్తున్న చామర్తి మానస తన ఐదుకవితలు శీర్షికలో కవి రవి వీరెల్లి గురించి, అతని కవితాసంపుటి కుందాపన గురించి చేసిన విమర్శాసమీక్ష; పూడూరి రాజిరెడ్డి కథాసంపుటిపై జి. ఉమ రాసిన సమీక్షాపరిచయం; యాత్రాసాహిత్యకుడు, సాహిత్యయాత్రికుడు దాసరి అమరేంద్ర కొత్త పుస్తకం నుంచి ఒక అధ్యాయం; ఇంకా కవితలు, కథలు, శీర్షికలూ…
మాటలలో బొమ్మలు కట్టడం, వాటిని అంత అందంగానూ ఆకాశవాణి ద్వారా శ్రోతలకు చూపించడం వారికి తెలుసు. యస్వీ రేడియో ప్రసంగాలు మహత్తర చిత్రకృతులు, కనువిందు చేసే కొండపల్లి బొమ్మలు. నిజానికి శర్మ అచ్చులకు రాసింది తక్కువ. హల్లులకు, అంటే ప్రసంగ పాఠాలకు రాసిందే ఎక్కువ. కృష్ణశాస్త్రి బడి, పలుకుబడితో పాటు వొద్దిక వొబ్బిడితనం కలిసిన దినుసు యస్వీది.
కవి పదాల ఎంపిక కూడా స్పష్టమైనది. అందుకే, ‘గతాన్ని వెలిగించి గట్టిగా పీల్చాను’ అనడం ద్వారా, దిగులు పడడమనేది తనకొక వ్యసన ప్రవృత్తిగా మారిందని చెబుతున్నాడు. ఆ దుఃఖం వదిలించుకునే అవకాశం ఉండి ఉండవచ్చు గాక- దానినితడు వాడుకోలేడు. ప్రతిగా అతడేమి మూల్యం చెల్లించాల్సొస్తుందో కూడా తెలుసు.
2015లో దాసరి అమరేంద్ర ఆక్టివా స్కూటరు మీద దక్షిణభారతదేశమంతా తిరిగారు. ఆ అనుభవాలు ‘కొన్నికలలు ఒక స్వప్నం’ అన్న పేరుమీద పుస్తకంగా ఈ నెల వస్తున్నాయి. ఆ సందర్భంగా ఆ పుస్తకం నుంచి ఒక అధ్యాయం ఈమాట పాఠకుల కోసం.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దక్షిణ భారతంలో గణపతి చాలావరకు బ్రహ్మచారిగా కనిపిస్తే, ఉత్తర భారతంలో ఒక భార్యతో గానీ ఇద్దరు భార్యలతో కానీ కనిపించడం కద్దు. ఒక భార్యతో కనిపించే విగ్రహాలలో కనిపించే సతిని లక్ష్మీదేవిగా, శక్తిగా పరిగణించడం ఉత్తర భారతదేశంలో సర్వసాధారణంగా కనిపిస్తుంది.
వలపులు చిందే చూపులలోని అందమే వేరు! అందులోనూ, తొలిచూపుల పలకరింపులు మనసులను గిలింతలు పెడుతూ మరింతగా అలరిస్తాయి. పెళ్ళిపీటల మీద, సిగ్గుబరువుతో రెప్పలు ఎత్తలేక, పక్కనున్నవారిని కంటితుదలతో చూసే ప్రక్కచూపుల నేర్పు, మన్మథుడు నేర్పే ప్రథమ విద్య అంటారు విశ్వనాథ. ప్రేయసీ ప్రియల తొలిచూపులను శృంగార రసోల్లాసంగా తెలుగులో వర్ణించిన మొట్టమొదటి కవి నాకు తెలిసి తిక్కన.
ఘుమఘుమలాడే కాఫీ కప్పు కళ్ళకెదురుగా పట్టుకుని చరిత నా ముందు ప్రత్యక్షమై నా పరధ్యానం పోగొట్టింది. తనను చూసినప్పుడల్లా నన్ను భర్తగా స్వీకరించి నాకు ఈ విశ్వాన్ని బహుకరించినట్టు ఉంటుంది. పెళ్ళై ఐదేళ్ళైనా నాకు చరిత ఎప్పుడు ఒక విచిత్రమైన స్వప్నంలా ఉంటుంది. తన కళ్ళకో విశ్వసంగీతం తెలిసినట్టు ఉంటుంది.
ఆయినెవరో డైరెక్టరునని షేకాండ్ ఇత్తాడా, అంతలో శ్రీశ్రీ నీ చెవి పక్కక్కొచ్చి బానిసకొక బానిసకొక బానిసకొక బానిస అంటాడు. ఇంకో ఆయన నేనే మ్యానేజరునని షేకాండ్ ఇత్తాడా, మళ్ళా శ్రీశ్రీ ఎనకమాలగా వచ్చి బానిసకొక బానిసకొక బానిసకొక బానిస అంటాడు. ఇంకప్పుడు శ్రీశ్రీ మీన గయ్యిమని లేత్తావ్. నీ సాగిత్యాలన్నీ చెత్త బుట్టలో బెట్టి కిలోల్లెక్కన అమ్మిపార్నూకి, మేయ్, లగెత్తు!
ఏనాటివో గుర్తులేక
రంగు వెలుస్తున్న ఊహలు
రేకులు విప్పి అందంగా
కుండీలో కుదురుకుని
మళ్ళీ కొత్తగా పూసినట్లే నవ్వుతూ
ఒక సినిమా బతికి బట్టకట్టి, ప్రేక్షకులని చేరి, వారి దూషణ-భూషణలు, సత్కార-చీత్కారాలు, ఆదరణ-తిరస్కరణలు మున్నగు ద్వంద్వ సమాసాలకు గురికావడానికి పైన పేర్కొన్న వాటిలో ఏ ఒక్క పనికి మాలిన, అసంబంధిత కారణమైనా చాలు. ఇదే సినీ వైకుంఠపాళి.
వర్షం కురిసినపుడో
పూవు రాలినపుడో
సన్నజాజులు పలుకరించినపుడో
ఏ వెన్నెలరాత్రో
ఏ శ్రావణ మేఘం ఉరిమినపుడో
ఏ కోవెల ప్రాంగణపు కోనేటి నిశ్శబ్దంలోనో
జీవితపు ఏ శూన్యతో నిన్ను నిలవేసినపుడో
అలా వాకిట్లో మంచం వాల్చానో లేదో-
ఒక్కొక్కటిగా
నా జ్ఞాపకాలన్నీ పులుముకుంది
ఆకాశం.
ఎప్పట్లాగే
గతాన్ని వెలిగించి గట్టిగా పీల్చా
పూడూరి రాజిరెడ్డితో కథల ప్రయాణం అద్భుతమైన అనుభవం. మనకు విసుగు తెలీకుండా కబుర్లు చెబుతూనే వుంటాడు. తన అనుభవాలు చెబుతూనే, అందులోనుండి గ్రహించిన జీవిత సత్యాలను, తాత్త్విక అవగాహనను మనతో పంచుకుంటాడు. సమయం చూసి మంచి పంచులు విసురుతుంటాడు. కిటికీ తెరచి అందులోనుండి ప్రకృతిని చూడమంటాడు.
ఇదిగో
చీకటి గోడలకు చూపులనతికించి
నడిరాత్రి నడుం మీద
సమయాన్ని చేది పోస్తూ
అరతెరిచిన కళ్ళతో
ఒక్కొక్క జ్ఞాపకం పూసని
మునివేళ్ళతో మీటుతూ
ఎనుకటి తడి జ్ఞాపకాలను మోస్తూ
ఒళ్ళంతా విచ్చుకున్న పొడికళ్ళతో
ఎదురుచూస్తున్న చెరువును
సడిలేని మత్తడి
యెట్లా సముదాయిస్తది?
దాగుడుమూత లాడుతూ
బీరువాలో దాక్కున్న పిల్లోనిలా
ఇంట్లో ఉన్న ఆటబొమ్మలన్నీ
వాడి పాదాల సడి కోసం
చెవులు రిక్కించి వింటుంటాయి.