గడి నుడి – 12 సమాధానాలు, వివరణ

అడ్డం

  1. కయ్యం సరిగా ఆరంభమైతే అందమైన పక్షి (4)
    సమాధానం: కయ్యం అంటే కలహం. సరి అరంభంతో కలహంస
  2. జీవనుడు కడవరకూ లేకుండా బేజారైతే పిచ్చుక (3)
    సమాధానం: జీవనుడు చివరలేదు. బేజారై జీనువ గా మారింది
  3. మన గదుల్లో భద్రంగా దాచుకొనేది (3)
    సమాధానం: నగదు. అక్కడే భద్రంగా ఉంది.
  4. మాట గజిబిజిగా తిరిగితే బంకలాగుంటుంది (3)
    సమాధానం: జిగట. అటునుండి కనిపిస్తోంది.
  5. ధృఢత్వము అంటే ముట్టిన గత బంధనం (5)
    సమాధానం: గట్టితనము. తారుమారై అక్కడే ఉంది.
  6. కోలములు సరిచేస్తే ఎద్దుల్ని అదిలించడానికి పనికొస్తుంది (4)
    సమాధానం: ములుకోల. కోలములు సరిచెయ్యాలి.
  7. కోపంలో వాయించాలనిపించేవి వాయిద్యాలు కావు (3)
    సమాధానం: చెంపలు. కోపం వస్తే కొందరు వాయిస్తారు.
  8. బరంపురం వాళ్ళం మాటవరసకి చూ. నిలువు 22 (2)
    సమాధానం: మనం. మనం మనం బరంపురం అన్నది నానుడి.
  9. కీటకములో తిరిగి ఆలోచించకుండా వెంటనే (2)
    సమాధానం: టకీ. అక్కడే వెనుకనుండి చూడండి.
  10. జంతు కులమున పుట్టిన ముంగిస (4)
    సమాధానం: నకులము. చెల్లాచెదురుగా పుట్టింది.
  11. మగతోడు లేకుండా సహగమనము చెయ్యడానికి స్థైర్యం కావాలి (4)
    సమాధానం: సహనము. సహగమనము లో మగ తీసేస్తే వస్తుంది.
  12. రెండుతోకలపిట్టలో పండితుడు జాడించేది (3)
    సమాధానం: పిలక. అక్కడే ఉంది.
  13. అధ్యాయనములో అనలేని కామంచిగడ్డి (3)
    సమాధానం: ధ్యాయము. అధ్యాయనములో అన తీసెయ్యండి.
  14. మోహం తమ కంటిలో కనిపిస్తోంది (3)
    సమాధానం: తమకం. అక్కడే కనిపిస్తోంది.
  15. రాక ఎక్కడికి పోగలవు భూమి వదిలి? (3)
    సమాధానం: ఎకరా. అటునుండి చూడండి.
  16. ఆ శకటం అంటే పిలుపా? (5)
    సమాధానం: ఆవాహనం. శకటం అంటే వాహనం కదా.
  17. సంస్కృత వ్యాకరణానికి ఆదిశేషావతారం (4)
    సమాధానం: పతంజలి. ఈ వ్యాకరణకర్తకి ఆదిశేషావతారం అని పేరుంది.
  18. రాయలసీమభాషలో ఎదురొచ్చిన నాయిక (2)
    సమాధానం: భామ. ఎదురొస్తోంది.
  19. చివర పోలేని ప్రవర్తన (2)
    సమాధానం: కడ. పోకడ లో పోలేదు.
  20. టీ.వి. దినమంతా చూసి కరదీపికని వెదకండి (3)
    సమాధానం: దివిటీ. వెనుకనుండి వెదకండి.
  21. తేలిక తెర తేలేని అల్లరి గుంపు (4)
    సమాధానం: తెరలిక. తేలికతెర లో తే లేదు.
  22. ఉపవాసం ఇతరుల పొట్టకోసమా? (5)
    సమాధానం: పరకడుపు. పర అంటే ఇతరులు. పొట్ట అంటే కడుపు.
  23. ఆడయేనుగు నటించేది (3)
    సమాధానం: నర్తకి. అంటే ఆడ ఏనుగు మరియూ నటి అనే అర్ధాలున్నాయి.
  24. భక్తులు పుణ్యక్షేత్రాలకి తిరిగి వెళ్ళేటపుడు ముఖ్యంగా పసుపుగుడ్డలో కట్టేది (3)
    సమాధానం: ముడుపు. వెనుకనుండి కనిపిస్తోంది.
  25. ప్రార్ధనలో ఆరా తీస్తే ఆదాయం (3)
    సమాధానం: ధనము. ఆరాధనము అంటే ప్రార్ధన. ఆరా తీసేయండి.
  26. చింపి పీలికలు కనబడేలా చేసిన చీమ (4)
    సమాధానం: పిపీలిక. కనిపిస్తోంది.

నిలువు

  1. బ్రహ్మరాతలు రాసే ప్రదేశం కాబోలు (4)
    సమాధానం: లలాటము. బ్రహ్మ రాసేదిక్కడే కదా?
  2. మగ సహనం – సతికి అగ్నిపరీక్షా? (5)
    సమాధానం: సహగమనం. వేరే చెప్పనవసరం లేదుగా?
  3. జీతము మూటకూ కదిలే కొండ (6)
    సమాధానం: జీమూతకూటము. అంటే కొండ.
  4. నయగారములో పాడేవాడు సగంలో పోతే నాడి దొరికింది (3)
    సమాధానం: నరము. పాడేవాదు సగం అంటే గాయ[కుడు]. నయగారములో గాయ తీసేస్తే మిగిలింది.
  5. ఇస్లాం ప్రభువుల పాలనలో ముస్లింలు కానివారు కట్టినది (5)
    సమాధానం: జిజియాపన్ను. చరిత్రపుటలు తిరగెయ్యండి.
  6. ఇది పిండితే బాకీ వసూలవుతుందా? (2)
    సమాధానం: ముక్కు. బాకీ ముక్కుపిండి వసూలుచెయ్యడం అన్నది వాడుక మాట.
  7. ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాడు తల కోయడురా (6)
    సమాధానం: కోతలరాయడు. అక్కడే ఉన్నాడు.
  8. మేనత్తలతో ఉండే జీవి (2)
    సమాధానం: నత్త. అక్కడే దాగుంది.
  9. క్షీరముతో చెయ్యబడ్డ వంటకం (4)
    సమాధానం: పాలకోవా.
  10. సమ్మెటపోటులో ఉద్యోగుల పోరాటం (2)
    సమాధానం: సమ్మె. అక్కడే ఉంది.
  11. రకమునకొక దుర్గతి (4)
    సమాధానం: నరకము. అంటే దుర్గతి కదా?
  12. తార పర మతం లోకి మారితేనే పెరుగుదల సాధ్యం (6)
    సమాధానం: తామరతంపర. అంటే పెరుగుదల.
  13. బరంపురం వాళ్ళం మాటవరసకి చూ. అడ్డం 13 (2)
    సమాధానం: మనం. 13 అడ్డం చూడండి.
  14. శక్తి బలహీనపడితే దేవతలకి కానుక (2)
    సమాధానం: బలి. బలిమి అంటే శక్తి. బలహీనపడడం అంటే చివరలోపించింది.
  15. సముద్రము తలలేనివారికి కూడా కరతలామలకము (6)
    సమాధానం: కమలాకరము. కరతలామలకము లో తల లోపించింది.
    కమలాకరము అంటే సముద్రము అన్న అర్ధాన్ని రవ్వా శ్రీహరిగారి నిఘంటువుని ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరిగింది. రామాయణంలో “ఇక్కమలాకరంబెంత దాటుటకు” అన్న 2-319 శ్లోకాన్ని ఉదహరించారు.
  16. దువ్వూరు రామిరెడ్డిగారినిలా పిలుస్తారు (5)
    సమాధానం: కవికోకిల. దువ్వూరివారి బిరుదు.
  17. సంతానంపట్ల ప్రేముంటే శరీరభాగం మధురం (5)
    సమాధానం: కడుపుతీపి. శరీరభాగం అంటే కడుపు. మధురం అంటే తీపి.
  18. కృష్ణపక్షం లో తరచుగా కనిపించే కనికరం (2)
    సమాధానం: కృప. అక్షరాలని మార్చి ఎన్నుకోమని సూచన.
  19. ఆకలి మానవ లోకాన్ని తిప్పి ఆడించే విష్ణుమూర్తి స్వరూపం (4)
    సమాధానం: వనమాలి. తిరిగిచూస్తే కనిపిస్తుంది.
  20. ఒక్కటిగా చేసే పనికిరాని మొక్కలు (3)
    సమాధానం: కలుపు. అంటే ఒక్కటిగా చెయ్యదం మరియూ కలుపు మొక్కలు అనే రెండర్ధాలుగా వాడడం జరిగింది.