అడ్డం
- కయ్యం సరిగా ఆరంభమైతే అందమైన పక్షి (4)
సమాధానం: కయ్యం అంటే కలహం. సరి అరంభంతో కలహంస - జీవనుడు కడవరకూ లేకుండా బేజారైతే పిచ్చుక (3)
సమాధానం: జీవనుడు చివరలేదు. బేజారై జీనువ గా మారింది - మన గదుల్లో భద్రంగా దాచుకొనేది (3)
సమాధానం: నగదు. అక్కడే భద్రంగా ఉంది. - మాట గజిబిజిగా తిరిగితే బంకలాగుంటుంది (3)
సమాధానం: జిగట. అటునుండి కనిపిస్తోంది. - ధృఢత్వము అంటే ముట్టిన గత బంధనం (5)
సమాధానం: గట్టితనము. తారుమారై అక్కడే ఉంది. - కోలములు సరిచేస్తే ఎద్దుల్ని అదిలించడానికి పనికొస్తుంది (4)
సమాధానం: ములుకోల. కోలములు సరిచెయ్యాలి. - కోపంలో వాయించాలనిపించేవి వాయిద్యాలు కావు (3)
సమాధానం: చెంపలు. కోపం వస్తే కొందరు వాయిస్తారు. - బరంపురం వాళ్ళం మాటవరసకి చూ. నిలువు 22 (2)
సమాధానం: మనం. మనం మనం బరంపురం అన్నది నానుడి. - కీటకములో తిరిగి ఆలోచించకుండా వెంటనే (2)
సమాధానం: టకీ. అక్కడే వెనుకనుండి చూడండి. - జంతు కులమున పుట్టిన ముంగిస (4)
సమాధానం: నకులము. చెల్లాచెదురుగా పుట్టింది. - మగతోడు లేకుండా సహగమనము చెయ్యడానికి స్థైర్యం కావాలి (4)
సమాధానం: సహనము. సహగమనము లో మగ తీసేస్తే వస్తుంది. - రెండుతోకలపిట్టలో పండితుడు జాడించేది (3)
సమాధానం: పిలక. అక్కడే ఉంది. - అధ్యాయనములో అనలేని కామంచిగడ్డి (3)
సమాధానం: ధ్యాయము. అధ్యాయనములో అన తీసెయ్యండి. - మోహం తమ కంటిలో కనిపిస్తోంది (3)
సమాధానం: తమకం. అక్కడే కనిపిస్తోంది. - రాక ఎక్కడికి పోగలవు భూమి వదిలి? (3)
సమాధానం: ఎకరా. అటునుండి చూడండి. - ఆ శకటం అంటే పిలుపా? (5)
సమాధానం: ఆవాహనం. శకటం అంటే వాహనం కదా. - సంస్కృత వ్యాకరణానికి ఆదిశేషావతారం (4)
సమాధానం: పతంజలి. ఈ వ్యాకరణకర్తకి ఆదిశేషావతారం అని పేరుంది. - రాయలసీమభాషలో ఎదురొచ్చిన నాయిక (2)
సమాధానం: భామ. ఎదురొస్తోంది. - చివర పోలేని ప్రవర్తన (2)
సమాధానం: కడ. పోకడ లో పోలేదు. - టీ.వి. దినమంతా చూసి కరదీపికని వెదకండి (3)
సమాధానం: దివిటీ. వెనుకనుండి వెదకండి. - తేలిక తెర తేలేని అల్లరి గుంపు (4)
సమాధానం: తెరలిక. తేలికతెర లో తే లేదు. - ఉపవాసం ఇతరుల పొట్టకోసమా? (5)
సమాధానం: పరకడుపు. పర అంటే ఇతరులు. పొట్ట అంటే కడుపు. - ఆడయేనుగు నటించేది (3)
సమాధానం: నర్తకి. అంటే ఆడ ఏనుగు మరియూ నటి అనే అర్ధాలున్నాయి. - భక్తులు పుణ్యక్షేత్రాలకి తిరిగి వెళ్ళేటపుడు ముఖ్యంగా పసుపుగుడ్డలో కట్టేది (3)
సమాధానం: ముడుపు. వెనుకనుండి కనిపిస్తోంది. - ప్రార్ధనలో ఆరా తీస్తే ఆదాయం (3)
సమాధానం: ధనము. ఆరాధనము అంటే ప్రార్ధన. ఆరా తీసేయండి. - చింపి పీలికలు కనబడేలా చేసిన చీమ (4)
సమాధానం: పిపీలిక. కనిపిస్తోంది.
నిలువు
- బ్రహ్మరాతలు రాసే ప్రదేశం కాబోలు (4)
సమాధానం: లలాటము. బ్రహ్మ రాసేదిక్కడే కదా? - మగ సహనం – సతికి అగ్నిపరీక్షా? (5)
సమాధానం: సహగమనం. వేరే చెప్పనవసరం లేదుగా? - జీతము మూటకూ కదిలే కొండ (6)
సమాధానం: జీమూతకూటము. అంటే కొండ. - నయగారములో పాడేవాడు సగంలో పోతే నాడి దొరికింది (3)
సమాధానం: నరము. పాడేవాదు సగం అంటే గాయ[కుడు]. నయగారములో గాయ తీసేస్తే మిగిలింది. - ఇస్లాం ప్రభువుల పాలనలో ముస్లింలు కానివారు కట్టినది (5)
సమాధానం: జిజియాపన్ను. చరిత్రపుటలు తిరగెయ్యండి. - ఇది పిండితే బాకీ వసూలవుతుందా? (2)
సమాధానం: ముక్కు. బాకీ ముక్కుపిండి వసూలుచెయ్యడం అన్నది వాడుక మాట. - ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాడు తల కోయడురా (6)
సమాధానం: కోతలరాయడు. అక్కడే ఉన్నాడు. - మేనత్తలతో ఉండే జీవి (2)
సమాధానం: నత్త. అక్కడే దాగుంది. - క్షీరముతో చెయ్యబడ్డ వంటకం (4)
సమాధానం: పాలకోవా. - సమ్మెటపోటులో ఉద్యోగుల పోరాటం (2)
సమాధానం: సమ్మె. అక్కడే ఉంది. - రకమునకొక దుర్గతి (4)
సమాధానం: నరకము. అంటే దుర్గతి కదా? - తార పర మతం లోకి మారితేనే పెరుగుదల సాధ్యం (6)
సమాధానం: తామరతంపర. అంటే పెరుగుదల. - బరంపురం వాళ్ళం మాటవరసకి చూ. అడ్డం 13 (2)
సమాధానం: మనం. 13 అడ్డం చూడండి. - శక్తి బలహీనపడితే దేవతలకి కానుక (2)
సమాధానం: బలి. బలిమి అంటే శక్తి. బలహీనపడడం అంటే చివరలోపించింది. - సముద్రము తలలేనివారికి కూడా కరతలామలకము (6)
సమాధానం: కమలాకరము. కరతలామలకము లో తల లోపించింది.
కమలాకరము అంటే సముద్రము అన్న అర్ధాన్ని రవ్వా శ్రీహరిగారి నిఘంటువుని ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరిగింది. రామాయణంలో “ఇక్కమలాకరంబెంత దాటుటకు” అన్న 2-319 శ్లోకాన్ని ఉదహరించారు. - దువ్వూరు రామిరెడ్డిగారినిలా పిలుస్తారు (5)
సమాధానం: కవికోకిల. దువ్వూరివారి బిరుదు. - సంతానంపట్ల ప్రేముంటే శరీరభాగం మధురం (5)
సమాధానం: కడుపుతీపి. శరీరభాగం అంటే కడుపు. మధురం అంటే తీపి. - కృష్ణపక్షం లో తరచుగా కనిపించే కనికరం (2)
సమాధానం: కృప. అక్షరాలని మార్చి ఎన్నుకోమని సూచన. - ఆకలి మానవ లోకాన్ని తిప్పి ఆడించే విష్ణుమూర్తి స్వరూపం (4)
సమాధానం: వనమాలి. తిరిగిచూస్తే కనిపిస్తుంది. - ఒక్కటిగా చేసే పనికిరాని మొక్కలు (3)
సమాధానం: కలుపు. అంటే ఒక్కటిగా చెయ్యదం మరియూ కలుపు మొక్కలు అనే రెండర్ధాలుగా వాడడం జరిగింది.