నా కవితా వ్యాసంగం మా ఊళ్ళో వాళ్ళకు తెలిసింది. వాళ్ళు నేనేదో మహాకవినై పోయినట్లు గౌరవించేవాళ్ళు. దాంతో నాకు ప్రోత్సాహం కలిగింది. ప్రతిదినం ఏటి ఒడ్డుకు పోయి కూర్చుండి నీళ్ళకు వచ్చే వాళ్ళను, పశువులను కడిగేవాళ్ళను, పాత్రలు తోముకునే వాళ్ళను చూస్తూ రకరకాల పద్యాలు రాసేవాణ్ణి.

ఏ ప్రక్రియలో ఐనా ప్రాథమిక అంశాలు కీలకమైనవి. శాస్త్రీయ సంగీతంలో ముందు సరళీస్వరాల మీద సంపూర్ణమైన పట్టును సంపాదించేందుకు చాలా కృషి చేయాలి. హిందుస్తానీ శైలిలో ఐతే కేవలం ‘ఆ’కార్ గాయనంలో నైపుణ్యం సంపాదించేందుకు సంవత్సరాల తరబడి సాధన చేస్తారు! సాహిత్యమూ అంతే. కవులు, రచయితలు కాదల్చుకున్నవారికి మొదట ప్రాథమిక అంశాలలో ప్రావీణ్యం ఉండటం అవసరం.

ఈ నేపథ్యంలో రాసిన కథలు చదివినపుడు ఎన్నడూ ఎరగని అనుభూతికి లోనవుతాం. అది ఒక మంచి కథ చదివిన సంతోషమా? కాదు. కథాంశంలోని దుఃఖమా? అదీకాదు. ప్రతీకథా చదివిన వెంటనే మరోకథ చదవలేము. కథ చదివిన తర్వాత కొంతసేపు కళ్ళుమూసుకుని మౌనముద్రలోకి వెళ్ళిపోతాం.

విజయ కథలన్నీ దాదాపు నగరాలకు సంబంధించిన మహిళల కథలు. అవి అన్ని తరగతులకు, వర్గాలకు చెందిన స్త్రీల జీవితాలకు ప్రతిబింబాలు. అసమానతలు, వివక్షలు, ఆంక్షలు, సమస్యల మధ్య సతమతమవుతున్న అతివల చిత్రాలు. పితృస్వామ్య ఆధిపత్యాలపై ప్రశ్నలు లేవనెత్తిన అభ్యుదయ రూపాలు.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

డిసెంబరు జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగే పుస్తక ప్రదర్శనలు తెలుగు సాహిత్యలోకానికి అతి ముఖ్యమైన సందర్భాలుగా పరిణమిస్తున్నాయి. ఈ ప్రదర్శనలే లక్ష్యంగా పుస్తకాల […]

దొస్తోయెవ్‍స్కీ ప్రధానజీవితదర్శనం బాధ్యతారహితనిశ్చేష్టతను, హేతువాదస్వర్గాన్ని, వ్యతిరేకిస్తుంది. రెండు రెళ్ళు నాలుగే. నిజమే. కాని రెండు రెళ్ళు అయిదు అనే స్వేచ్ఛ నీకు లేదని ఎందుకు అనుకుంటావు? విధినిర్ణయం జరిగిపోయింది. నిజమే, కాని దాని అర్థం నీ బాధ్యత లేదని కాదు.

బాల్యం గురించి ‘నా చిన్నప్పుడు’ అని ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నాకు బహుశా అది ‘నిస్సహాయత’గా వినిపిస్తుంది. యవ్వనపు రోజుల్ని తలచుకుంటే మోసిన బరువులు, ఈదేసిన బాధ్యతలు మాత్రమే జ్ఞప్తికి వస్తాయి. ‘ఆ రోజులే వేరు’ అని ఏ రోజు గురించీ అనుకోబుద్ది కాదు. ఇన్ని మైలురాళ్ళూ దాటాక సాధించిన విజయం ఏమిటంటే ‘అబ్బా, ఇదంతా ఈ క్షణంలో ముగిసిపోతే బావుండు’ అనిపించకపోవడం.

నిత్యజీవితంలో మనం చూసేదీ పాల్గొనేదీ ఎడతెగని పరుగుల ప్రక్రియలో. చేయవలసిన పనులు, వాటి గడువులు, టార్గెట్లు, ఎపాయింట్‌మెంట్లు – పరుగులే పరుగులు. ఇష్టమున్నా లేకపోయిన ఆ బాణీ కార్యకలాపాలలోకి అడుగు పెట్టినపుడు మన సమయం మన చేతుల్లోంచి జారిపోతుంది. నిలబడి, స్థిరంగా ఆలోచించి ముందుకు సాగే అవకాశం కోల్పోతాం.

ఓ‌ పెద్ద‌ ఇంటి ముందు ఆపింది నీరూ తన ఆడీ కార్‌‍ని. ఆ ఇంటి గేటు మూసుంది. దానికో మూలగా ఉన్న బల్ల మీద కూర్చుని తల మొబైల్లో దూర్చి తనలోతను నవ్వుకుంటున్నాడా ఇంటి వాచ్‍మన్. నీరూ గేటుకెదురుగా ఉందని గమనించే పరిస్థితిలో లేడు. హారన్ కొట్టింది గట్టిగా. ఉలిక్కిపడి పైకి లేచాడు. ఓ చేత్తో సెల్యూట్ పెడుతూ, ఇంకో చేత్తో తలుపు నెట్టుకుంటూ మరో పక్కకి పోయాడు. వాడిని కళ్ళతోనే కాల్చేస్తూ లోపలికెళ్ళింది నీరూ.

ఆశ్రమానికి చెందిన ఒక పెద్దాయన వచ్చి యువరాజ్ భుజాలను తాకి, “రాజా సార్” అని పిలిచారు. యువరాజ్ మేల్కొని లేచి, ఏమీ అర్థం కానివాడిలా ఆయన్ను, రమణుల చిత్రపటాన్ని చూశారు. దీర్ఘ నిశ్వాసంతో తన కళ్ళను, చెంపలను తుడుచుకొంటూ, పైకి లేచి తన జుబ్బాను కిందకు లాగి సర్దుకున్నారు. ఆయన ముఖం తేటపడింది. రమణులను చూసినప్పుడు ఆయన ముఖంలో సన్నని చిరునవ్వు మొలకెత్తింది.

మొన్నటికి మొన్న, రెండు నెలలైనా తిరగలేదు, వాళ్ళు దయ్యాల గురించి మాటలాడుకున్నారు. సాధారణంగా సమావేశాల్లో బంకు బాబు నోరు విప్పేవాడు కాదు. ఆ రోజు ఏమయిందోగాని, నోరు తెరిచి ‘నాకు దయ్యాలంటే భయం లేదు’ అన్నాడు. అంతే! అది చాలు, తక్కిన వాళ్ళకి బంగారం లాంటి అవకాశం దొరికింది. రాత్రి అతను ఇంటికి తిరిగి వెళుతుంటే అతని మీద ఒక దయ్యం దాడి చేసింది. పాపం అతనికి గాయాలయ్యాయి.

ఈ సందర్భంలో గతంలో జరిగిన ఒక హృదయ విదారకమైన సంఘటనని మన దృష్టికోణంలో పెట్టుకోవడం అప్రస్తుతం కాదు. వేవిళ్ళతో బాధపడే గర్భిణులకి ఉపశమనం కలిగించడానికి 1950, 1960 దశకాలలో థాలిడొమైడ్ అనే మందు వాడడం వల్ల దరిదాపు 10,000 మంది పిల్లలు వికలాంగులుగా పుట్టేరు.

భావనాబలం, సంకల్పం ఉంటే హిందూ జాతి గొప్పదిగా అవతరిస్తుoది అని గోల్వాల్కర్ అంటాడు. అదే భావనాబలంతో క్రైస్తవులు ముస్లింలు తమ జాతి గొప్పదని చాటుకోవచ్చు కదా అని నిలదీస్తాడు కరపాత్ర స్వామి. హిందుత్వకి అనుగుణంగా భారతీయ తత్వాన్ని ఆలోచనలని వక్రీకరించడాన్నీ తీవ్రంగా ఖండిస్తాడు. నిత్య అనిత్య వస్తు వివేకం అనే శంకర అద్వైత భావనని హిందూ సమాజ పరంగా అన్వయిస్తాడు గోల్వాల్కర్.

కర్రలకి నిలేసిన వేట తుపాకీ.
నిప్పుల్లో కాల్చుకునే, కాచుకునే, కాళ్ళు.
తుపాకి, గుహ, కొండ, అడవి, జత.
వెలవెల పోయిన కంబళ్ళు, వదిలేసిన టోపీలు, రెండు తోలు బూట్ల జతలు.
మంచి చలిలో…

ఇంటినానుకొని ఉన్న చెట్టు
ఇంటితో గుసగుసగా
ఇలా చెప్పింది

“ఇద్దరు మనుషులు కలిసినప్పుడు
ఆత్మీయంగా మాట్లాడుకునే మాటల్లోంచి
నాకు సంగీతం వినిపిస్తుంది. మరి నీకు?”

మధ్యాహ్నం ఎండలో కమిలిన నిన్ను పైటచెంగుతో తుడిచి గ్లాసుడు నీళ్ళిచ్చే ఆదరువు. ఎడా పెడా తుఫాన్ల బారినపడే నీ ఒంటిని తడిమి నిన్ను తిరిగి మనిషిని చేసే భరోసా. దిగంతాల కలగా చెదిరిన నాన్నను కంట్లో దాచుకుని నీ తలపై గొడుగులా అల్లుకున్న కాంతి. అక్కడే కథలు కథలుగా ఆమె నీ పూర్వీకులను గానం చేసింది. నీ అడుగులు అక్కడే మొలిచాయి. నీ ప్రాణం అక్కడే కప్పబడి ఉంది.