కంటికి పెట్టుకున్న కాటుక
ఎర్రగా ఉంటుంది
పెట్టుకున్న ఎర్ర తిలకం
నల్లగా ఉంటుంది
కుట్టేసిన పెదాలు
కిటికీలేని ఇంటిలా
Category Archive: సంచికలు
మాటలు రాని సృష్టికర్తకు
తనేంటో తెలుసుకోవడానికి
నీ కడుపులో పుట్టడం వినా
మరో మార్గం లేదని!
కాంతా! నీకో రహస్యం చెప్పనా?
గుట్టు రట్టు చేయనా!
దేహాన్ని సాది
వెలిగించుకున్న చెమట దీపాన్ని
ఆర్పినా భరించాలి.
చిల్లరతో కట్టిన కోటలో
లంకె బిందెలు మొలిస్తే
రహస్యాన్ని గౌరవించాలి.
నేలమీద రాలుపూల కొలాజ్‍పై
దిష్టిచుక్కలా పడ్డ నీడ
మిణుగురు సైన్యం రాకతో
వెలుతురు నదిలా మారిన లోయ
నశ్యం పీల్చిన మబ్బుతునక తుమ్ముకి
నేల రాలిన దారిచూపే చుక్క
నాడు-
ఎందుకిలా?
అడిగిందా ఇల్లాలు
నేడు-
ఎందుకిలా?
అడిగాడతడు
నాలోలోపల నైరూప్యచిత్రంలా
మగతలో ఊపిరి కూడదీసుకుంటున్న కల
ఒంటరిపాటుకి
తేనెతుట్టెను వేలాడదీసిపోతావు
కావలి కాస్తూ కాస్తూ మైమరుపులో
వాలిపోతా నీ భుజం మీద
తెలుగు లోకం నిండా సాహిత్యం పొంగి పొర్లుతోంది. పుస్తకాలు పుట్టగొడుగుల్లా లేస్తున్నాయి ప్రతి రోజూ. రచయితలందరూ డయల్ 100 కంటే ఎక్కువగా పాఠకులకు అందుబాటులో ఉంటున్నారు. చూస్తుంటే రచయితలకు మంచి రోజులొచ్చినట్టే పైకి అనిపిస్తుంది. పాఠకుడికి గ్రహస్థితి మాత్రం బాలేదనే సంగతి మరుగున పడిపోయింది.
శిఖర, జలపాతాల వెంట తెచ్చుకున్న తాళ్ళ సాయం తప్ప సాయం లేని ప్రమాదకర ప్రాంతాల్లో సాగటం ఎలా? అందుకనే అక్కడ నిత్య ‘ట్రెకింగ్ వీరుడు’, ‘జలపాత స్వాప్నికుడు’ యక్షుడిలాగ డాక్టర్ ప్రసాద్ వంటివారు సిద్ధంగా ఉంటారట. కాలిబాటల్లో, లోయల లోతుల్లో రెల్లుపొదల స్పర్శ ‘అమ్మ తల నిమిరినట్ట’నిపి
పెళ్ళిళ్ళ నిర్ణయాలలోను, దాంపత్య జీవితాలలోను, పిల్లల పెంపకంలోనూ తరాల పరిక్రమణలో వచ్చే మార్పులు, భారతదేశంలో ఎలా వస్తున్నాయో విదేశాలలోని భారతీయ కుటుంబాలలోను అదేవిధంగా వస్తున్నాయనేది నిరూపించే ప్రయత్నం ఈ నవలలో రచయిత్రి చేసింది. కుటుంబపరమైనదే కాకుండా సాహిత్యంలో, సభలూ సమావేశాలలో, సాహితీవేత్తల మనోభావాలలోని మార్పుల్ని కూడా పట్టిచూపించే ప్రయత్నం ఉంది.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
అమద్యాబాద్, 1 జనవరి: నూతన సంవత్సర సందర్భంగా నగరంలో తెలుగు తాగుబోతుల సమావేశం అట్టహాసంగా జరిగింది. ఎప్పణ్ణుంచో తాగుతున్నవాళ్ళు, ఇప్పుడిప్పుడే తాగడం మొదలు పెట్టినవాళ్ళు, […]
ఒకానొక కాలంలో విశ్వాసం ఒక జీవితకాల సాధన. మించి సాధించదగింది లేదు. ఈనాడు ‘నేను విశ్వాసిని’ అని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నాం. మనకు విశ్వాసం వద్దు. అది మూఢులకు. మనం మేధావులం. విశ్వాసం నీళ్ళను మద్యంగా మారుస్తుంది. మనకీనాడు మద్యం మంచినీళ్ళు.
“నేను నీకు చేసిన ద్రోహం ఏదీ లేదు. మన బిజినెస్‌లో డబ్బులేమీ నొక్కేయలేదు. అయినా అంతమాత్రానికే కాల్చిపడేయరు కదా ఎవరూ! నీ గురించి చెడు ప్రచారమేదీ చేయలేదు నేను. నీకు రావలసిన దేన్నీ తన్నుకుపోలేదు. మా మధ్య ఏదన్నా నడుస్తుందని అనుమానించడానికి సుజనతో అంత క్లోజ్‌గా ఎప్పుడూ లేను.” ఆగి అన్నాడు, “ఎవడన్నా నా మీదో, సుజన మీదో కోపం పెట్టుకుని ఫొటోలు మార్ఫింగ్ చేసి నీకు పంపుతారంటావా?”
ఈ పర్వతాల రంగులు కూడా వివిధ సమయాల్లో వివిధ రకాలుగా మనకు కనబడతాయి. సూర్యోదయ సమయంలో నారింజరంగు కలసిన పసిడి వర్ణం, మధ్యాహ్న సమయంలో మచ్చ లేని ధవళ వర్ణం, సూర్యాస్తమయ సమయంలో ధగధగల బంగారు వర్ణం… క్రమక్రమంగా అరుణారుణ గిరిశిఖరం!
ఆవిధంగా నేను బాగా గమనించింది ఏంటంటే, N ఏమాత్రమూ ఏదీ పట్టించుకునే పరిస్థితిలో లేడు, తన కుర్చీ చేతులను గట్టిగా పట్టుకుని అటూ ఇటూ మెలికలు తిరుగుతున్నాడు, కనీసం ఒక్కసారి కూడా నావైపు తలెత్తి చూళ్ళేదు, అయోమయంగా అగమ్యగోచరంగా ఉన్నాయి అతని చూపులు, శూన్యంలో దేనికోసమో వెతుకుతున్నట్టు, నేను మాట్లాడేదాంట్లో ఒక్క అక్షరం కాదు కదా అసలు నా ఉనికి కూడా ఆయన ఎఱుక లోకి కూడా వెళ్ళుండదు.
తోటాన్ అందులోకి కనెక్ట్ చేసుకుని రిసీవర్ చెవికీ భుజానికి మధ్య నొక్కి పట్టుకుంటారు. అదే ఒకే తీరున చెవిలో ర్‍ర్‍ర్‍ర్ర్‍ర్ మంటూ మోగడం మొదలవుతుంది. తోటాన్ అది వింటూ ఉంటారు. ఆయన తల వేలాడదీసిన లోలకంలా అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. కాసేపటికి ఒక పక్కకు ఒరిగిపోతుంది. కళ్ళు మూసుకుపోయి, నోరు తెరుచుకుని, భుజాలు సడలి పక్కనున్న ఆలివ్ గ్రీన్ బీరువా మీదకు ఒరిగిపోయి కూర్చునుంటారు.
పట్టుపురుగు కోరి యిల్లు కట్టుకొనగ
తనదు పట్టు తననె చుట్టి చచ్చినట్లు
మదిని రేగు కోర్కెలు మనిషిని బంధించునయ్య!
నా మనసు దురాశల నాశమొందగజేసి
నీ దరిని జూపు చెన్నమల్లికార్జునయ్య!
మనకు లాగే గగనానికీ
ఓ గాంధీ ఉన్నాడట తెలుసా!
గాంధీ పోయినరోజు తప్ప
364 రోజులు కనిపిస్తాడట!
వింటే ప్రతిచుక్కా
ఇలాంటి కథేదో చెప్తుంది!
సముద్రమొద్దు
నదీ సంగమమసలే వద్దు
ఉత్తరాయణం వేళ
చలి తగిలిన ఎండలో
ఆకులు రాలే మంచు పొడిలో
బ్రతుకుచెట్టు నన్ను విదిలిస్తుందా!
చీకటిని ఆహ్వానించారు
కరెంట్‌ను తరిమికొట్టి
నక్షత్రాలు వెలిగించారు
ఎక్కడో, ఈ భూగ్రహంపైనే
గాలి చెలరేగిందిట.
ఎవరో సత్యాన్ని కనుగొన్నారట.