బహూశా విశ్వనాథ సత్యనారాయణ రావణాసురుడంతటి వాడు. ఈమాట నేను చులకన భావంతో అనడం లేదు. ఆయన సర్వజ్ఞత, సమర్థతల మీద అపారమైన గౌరవంతో అంటున్నాను. ఆయన ఊహాదృష్టి ప్రసరించని ప్రదేశం ఈ చతుర్దశ భువనాల్లో ఉండి వుండదు. ఆయన ఊహలూ, కల్పనల అపురూపత మరే కవిలోనూ కానరాదు.

ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? అన్న ప్రశ్నకి సమాధానం, గణితంలో ప్రవేశం ఉన్నవాళ్ళకి కూడా ఇంగ్లీషులో చెప్పటమే చాల కష్టం. గణితంలో ప్రవేశం లేని వారికి ఇంగ్లీషులో చెప్పబూనుకోవటం కష్టతరం. గణితంలో ప్రవేశం లేని వారికి తెలుగులో చెప్పటానికి ప్రయత్నించటం కష్టతమం.

స్వర్గ తుల్యమైన సుఖాలు వదులుకుని కట్టుబట్టల్తో సన్యసించాలంటే ఎంతటి మనోధైర్యం కావాలి? తథాగతుడైనాక ఒక్కసారి కూడా ‘నా మాట నమ్ము’ అని అనలేదని వింది.

వేపచెట్టుకింద తన కైనెటిక్ హోండాను నిలిపి దానికి ఆనుకుని నిలబడి, మేము చేస్తున్న ఆచారాలన్ని చూస్తోందో యువతి. “ఎవరామె?” అని అడిగాను. “ఆమే!…” గుసగుసగా చెప్పింది అక్క.

అభ్యుదయ కవిత్వం తెలుగువారిని ఉత్తేజపరిచిన 1950లలో ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారివంటి కవుల రచనలకు ఇంతటి ప్రజాదరణ కలగటానికి ఏకైక కారణం ఘంటసాల స్వరపరచి పాడడమే.

సర్వ సమగ్రమైన తెలుగు నిఘంటువు ప్రచురించటానికి సుమారు నలభై సంవత్సరాలు పట్టింది. అది ఈరోజు కొనదల్చుకున్నా దొరకదు. మనకి ఉన్న ఈ ఒకే ఒక సమగ్రమైన నిఘంటువు ఈ రోజున మనకు దొరకదు. ఇది హాస్యాస్పదమే కాదు; అవమానకరం కూడాను!

ప్రతీ రోజూ పట్టమ్మాళ్ ఇంటికి కూరలమ్మే ఒకామె కూతురు పెళ్ళికి పిలిస్తే, పట్టమ్మాళ్ వెళ్ళడమే కాకుండా అక్కడ తన పాటతో పెళ్ళికొచ్చిన పలువురినీ అలరించారట. సంగీతంలోనే కాక ఒక మనిషిగా కూడా ఎంతో ఔన్నత్యం చూపిన వ్యక్తి పట్టమ్మాళ్.

ఇరవయ్యో శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన సాహితీ మూర్తుల గురించి, వారి సాహిత్యాన్ని గురించి తెలుసుకోవడం, చర్చించడంతో పాటు, తెలుగు సాహితీ మిత్రుల్ని ముఖతః కలుసుకునే అవకాశాన్ని వదులుకోరని ఆశిస్తున్నాం.

జులై 2009 సంచికలో–
నిద్రిత నగరం – వైదేహి శశిధర్ కవితా సంకలనం పై కె. వి. గిరిధరరావు సమీక్ష, వెల్చేరు నారాయణరావు విశ్లేషణాత్మక వ్యాసం: కవిత్వం లో ‘ప్రభావం’ అంటే ఏమిటి?, జెజ్జాల కృష్ణ మోహన రావు స్మృతి పథం: ఫాదర్స్ డే. ఇంకా కథలు, కవితలు, వ్యాసాలు.

అయినా పట్టు విడవకుండా ఈ పాటనే సాధన చేసే వాడిని. ఈ పాట తప్ప మరే పాటా పాడకుండా దాదాపు ఒక సంవత్సర కాలం ఈ రాగమాలికే సాధన చేసినట్టు గుర్తు.

మనం ఏ పద్యం చదివినా, విన్నా, అంతకు ముందు కొన్ని పద్యాలు వినే వుంటాం. అప్పుడు మనకి ఒక పద్యం అర్థం అయే తీరు, మనం అంతకు ముందు చదివిన, విన్న పద్యాల మీద ఆధారపడి వుంటుంది.

ముఖ్యంగా మన తెలుగిండ్లలో ఆడపడుచులకు వుండే స్వతంత్రం చెప్పనలవి గానిది. పెండ్లయి అత్తింటికి పోయినా పుట్టింటి ధ్యాస వుంటూనే వుంటుంది వారికి. అన్నలూ, తమ్ములూ, వారి కాపురాలూ క్షేమంగా వుండాలని కోరుకునేది ఆడబడుచే.

అప్పుడు అబ్బిగాడు చంటాడు. అకస్మాత్తుగా వాడికి జబ్బుచేసి ప్రాణమ్మీదికి వచ్చినప్పుడు, “స్వామీ! ఆపద మొక్కుల వాడా! బ్రతికి బట్ట కడితే, వీడి పుట్టువెంట్రుకలు నీ సన్నిధిలో తీయిస్తాను” అంటూ జానకి ఆ మొక్కు పెట్టుకుని ఐదేళ్ళకు పైనే అయ్యింది.

ఇక్కడిదంతా ఒక ఫాషనైపోయింది. ఇన్నేళ్ళుగా పనికొచ్చిన పధ్ధతులేవీ ఇప్పుడు నచ్చవుట. ఇప్పుడు కొత్తగా ఏదో పొడిచెయ్యాలని మా మానేజర్ గాడి ఉద్దేశం.

నేను మాట్లాడినప్పుడల్లా ఆయనకి తన అమెరికా ప్రయాణం, ఎందుకొచ్చాడు అన్నది గుర్తొస్తుందట. వాళ్ళబ్బాయిని నేను జాగ్రత్తగా పంపానన్నదీ గుర్తొస్తుందట. అంతే…

పొడుగైన భవంతులలోకి దూసుకొస్తూ ప్రయాణీకుల విమానాలు. పొగ, దుమ్ము, పరిచయమైన అవే ఆకారాల్లో, మబ్బుల్లా దట్టంగా. కిటికీల గుండా మంటలు బైటికి నాలికలు చాస్తూ.