చుట్టపు చూపుగా వచ్చినవాళ్ళు
చూసి పోవాలే తప్ప
ఉండి పోకూడదు
గదులు ఖాళీలుండవు
మదులూ ఖాళీలుండవుకొంప కొల్లేరయినా
ఊరు వేగై అయినా
కొలువు తప్పదు
చెదిరిపోతుందని తెలిసినా
ముస్తాబు తప్పదువీధి గుమ్మంలోంచి
వెళ్ళిపోవాల్సిన వానలకి
నగరమెప్పుడూ సిద్ధం కాదు
డ్రైనేజీల్లేని నగరాలు
గొడుగుల్లేని జవరాళ్ళుతడిసి తడిసి ప్రవహించడమేతప్ప –
వెలుతుర్లేని చీకట్లో
చెప్పకుండా వచ్చి వెళ్ళిపోతే మంచిది
ఉదయానికీ ఉద్యమానికీ
అడ్డు పడకూడదువానని ప్రేమించడానికి
ఆకుపచ్చని అడవిని ఊహించడానికి
స్థిమితం కావాలిఎప్పుడైనా వాన కురిసినరోజు
సెలవు ప్రకటిస్తే బావుణ్ణు
ఇంటిముందు కాగితప్పడవల్తో
దారాల వానలో
గెంతులేయచ్చు
ఘల్లునమోగే జల్లులో
జవరాలిలా

రచయిత ఇంద్రప్రసాద్ గురించి:
ఆవంత్స సోమసుందర్ అంతేవాసిగా సాహిత్యంతో ప్రారంభమయిన ఇంద్రప్రసాద్ గారి సాహిత్య ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నడిచి వచ్చిన దారి (కవిత్వం 1993), కాలం సైకత తీరం (కవిత్వం 2023), మూడు పడవలు (కవిత్వం 2024) అనే సంకలనాలను ప్రచురించారు.
... పూర్తిగా »