రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మార్చి 2026

(వేలూరి వేంకటేశ్వరరావు అమెరికా వచ్చిన తొలినాళ్ళలో)

చరిత్రలాగే సాహిత్య విమర్శ అనేది ఒక నిరంతర ప్రవాహం. అది గతసాహిత్యాన్ని వర్తమానంతో అనుసంధానించి పునర్విశ్లేషించే ఒక వారధి. దండి రాసిన కావ్యాదర్శమ్, విద్యానాథుని ప్రతాపరుద్రీయమ్, ముమ్మటుడి కావ్యప్రకాశమ్, ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకమ్, రాజశేఖరుడి కావ్యమీమాంసవంటి ప్రాచీన లాక్షణిక గ్రంథాలను చదివినప్పుడు, వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు విమర్శనాత్మక దృక్పథాన్ని ఎంత శాస్త్రీయంగా విశ్లేషించారో అర్థమవుతుంది. అయితే, ఆ ప్రాచీనజ్ఞానాన్ని ఆధునిక సాహిత్యానికి, ఆధునిక సామాజిక కోణాలకు ఎలా అన్వయించుకోవాలి అన్నదే నేటి విమర్శకుల ముందున్న ప్రధానాంశం.

ప్రాచీన కావ్యమీమాంసలో చర్చించిన అనేక వర్గీకరణలు, రస-ధ్వని సిద్ధాంతాలు నేటి సాహిత్యానికి అనువర్తనీయాలే. ప్రాచీన భారతీయ కావ్యవిమర్శనుండి మనం ప్రధానంగా అలవర్చుకోవాల్సింది సౌందర్యాన్ని శోధించే తత్త్వాభినివేశలక్షణాన్ని. అయితే, భారతీయ రససిద్ధాంతాలు వైయుక్తిక స్థాయిలో రసానందాన్ని చర్చిస్తే, ఆధునిక విమర్శన సిద్ధాంతాలు సామాజిక స్థాయిలో కూడా వాటి ప్రభావాలను విశ్లేషిస్తుంది. సాహిత్యం ఆనందాన్ని, రసాన్ని కేవలం వైయుక్తిక స్థాయిలోని మాత్రమే అందియివ్వదు; అది సామాజిక స్థాయిలో వివిధవర్గాలపై వివిధరకాలైన ప్రభావాలను చూపిస్తుంది. ఇక్కడే పాశ్చాత్య విమర్శన సిద్ధాంతాలు మనకు కొత్త ఆయుధాలను అందిస్తాయి. ఉదాహరణకు, జాక్ డెరిడావంటివారు ప్రతిపాదించిన వినిర్మాణవాదం ఒక రచనలో ఒకే స్థిరమైన అర్థం ఉండదని చెబుతుంది: అవి సామాజిక నేపథ్యాలను బట్టి, స్థలకాలాదులబట్టి మారుతుంది. ప్రసిద్ధ రష్యన్ సాహిత్య విమర్శకుడు మిఖాయిల్ బాఖ్తిన్ సిద్ధాంతం ప్రకారం, గొప్ప క్లాసిక్ రచనలు ఎన్నటికీ ఒకే కాలానికి లేదా ఒకే కోణానికి పరిమితం కావు; అవి బహుళ స్వరాలను, బహుళార్థాలను (polyphony) కలిగి ఉండి, తరాలు మారేకొద్దీ పాఠకులకు ఎన్నెన్నో కొత్త అర్థాలను స్ఫురింపజేస్తూనే ఉంటాయి. పాఠకుడినిబట్టి, కాలాన్నిబట్టి అర్థాలు మారుతూ ఉంటాయి. ఒక ఆధునిక కవితనో, కథనో విశ్లేషించేటప్పుడు ప్రాచీన లాక్షణికులు ప్రతిపాదించిన రస, ధ్వని సిద్ధాంతాల మూలాలను మనం విస్మరించలేం. అంతర్లీనంగా ఉండే భావాన్ని పట్టుకోవడానికి ధ్వని సిద్ధాంతం నేటికీ అద్భుతమైన సాధనమే. కానీ, అదే సమయంలో సాహిత్యంలోని భావాల విస్తృత సామాజిక, రాజకీయ, ఆర్థిక, మానసిక ప్రభావాల వివేచనకు ఆధునిక మానవీయశాస్త్ర సిద్ధాంతాలు అత్యావశ్యకం.

నిజమైన విమర్శకుడు ప్రాచీన సాహిత్యంలోని గాంభీర్యాన్ని, నిర్మాణ కౌశలాన్ని జీర్ణించుకోవాలి. అలాగే, ఆధునిక విమర్శ సిద్ధాంతాలైన నిర్మాణాత్మకవాదం, సామాజికశాస్త్ర దృక్పథం, మనోవిశ్లేషణలను తన పరిశీలనకు ఆయుధాలుగా మలచుకోవాలి. వెల్చేరు నారాయణరావుగారిలాంటి పండితులు చేసిన కృషిలో మనకు కనిపించేది ఈ సమన్వయమే. వారు ప్రాచీన ప్రబంధాలను విశ్లేషించినా, ఆధునిక కవిత్వాన్ని అంచనా వేసినా అందులో ప్రాచీన మీమాంస తాలూకు సునిశితత్వం, ఆధునికత తాలూకు సామాజికశాస్త్ర దృష్టి కలగలిసి ఉంటాయి. ఈ రెండింటి సమన్వయమే భారతీయ భాషలలో సాహిత్య విమర్శకు ప్రాణం పోస్తుంది. కొత్తపాతల మేలుకలయికగా సాగే ఇటువంటి విమర్శే తెలుగు సాహిత్యానికి శ్రీరామరక్ష.

[వేలూరి వేంకటేశ్వరరావుగారు సాహిత్యవిమర్శ గురించి మాతో పంచుకొన్న అనేకానేక ఆలోచనల్లో కొన్ని సంభాషణలు పై ముందుమాటకు స్ఫూర్తి. ఇప్పుడు ఆయన ఇంద్రసభలో కూర్చుండి ‘స్వర్గంలో స్ట్రిప్‌టీజ్’ చూస్తున్నా అక్కడినుండే మనల్ని గమనిస్తూ, బహుశా తన మరణవార్తపై వచ్చిన స్పందనలపై ఇప్పటికే ఒక వ్యంగ్యకథను అల్లుతూ ఉంటారని ఊహించవచ్చు. వీడ్కోలు వేలూరి గారూ! మీరు పరిపూర్ణంగా జీవించారు, ప్రపంచాన్ని, సాహిత్యాన్ని, మనుషుల్ని మనసారా ప్రేమించారు. మీ మాటలు, రచనలు, ఎత్తిపొడుపులు, శ్రేయోక్తులు ఈమాట కుటుంబానికి సదా స్మరణీయాలు — సం.]

కంప్యూటర్ చిప్ కథ – 11: హెర్ట్‌జియన్ తరంగాలు

రచన: కొడవళ్ళ హనుమంతరావు
ఈ ఈ నొక్కి చదవండి...

కాంతి రూపాలన్నీ – సూర్య రశ్మి, కొవ్వొత్తి వెలుగు, మిణుగురు పురుగు మెరుపు – విద్యుత్ రూపాలే

3

వేలూరిగారి నిష్క్రమణ పెద్ద లోటు

రచన: సాయి బ్రహ్మానందం గొర్తి
ఈ ఈ నొక్కి చదవండి...

మాటలకంటే ఎక్కువ కొట్లాడుకునేవాళ్ళం. ఆ మాటల మధ్యలోనే తెలుగు సాహిత్యమూ, దాని వెనుకనున్న హిపోక్రసీ ఇవన్నీ సంభాషణల్లో భాగమయ్యేవి.

3

అక్కడ పుస్తకాలు తగలబడ్డాయి!

రచన: చంద్రలత
ఈ ఈ నొక్కి చదవండి...

అచ్చుయంత్రం వేల, లక్షల పుస్తకాలు ప్రజల మీదకు పడేస్తున్నది. ఈ యాంత్రిక యుగంలో ఎప్పటికైనా గ్రంథ దహనోద్యమం ప్రారంభం కాక తప్పదు. ఎందుకంటే, అచ్చు యంత్రాలు లేని రోజుల్లో, మంచి గ్రంథాలు నిలిచి చెత్త గ్రంథాలు పోయేందుకు ఎవరూ ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన అవసరం లేక పోయేది.

4

వ్యంగ్యం ఆయన కథకు చిరునామా

రచన: వాసిరెడ్డి నవీన్‌
ఈ ఈ నొక్కి చదవండి...

ఒక్కమాటలో చెప్పాలంటే, వేలూరి కథలు అమెరికా తెలుగువాళ్ల వ్యవహారశైలిపై సుతిమెత్తగా చురకలంటించిన వ్యంగ్య కథలు. కథని, పాత్రలను నిర్మించటంలో, నడిపించటంలో ఆయనకొక ప్రత్యేక పద్ధతి ఉంది. అది అమెరికాలోని ఇతర తెలుగు రచయితల శైలికి భిన్నమైంది. హాస్య, వ్యంగ్య ధోరణిలో కథలు నడిపినా, వాటిల్లో ఆవేదన, ఆవేశం ఉన్నాయి. అవి పాఠకులను అలరిస్తూనే ఆలోచింపజేస్తాయి.

1

వేలూరి వేంకటేశ్వరరావుగారి కావ్యదహనోత్సవం — కథాసంగ్రహం

రచన: వేలూరి వేంకటేశ్వర రావు
ఈ ఈ నొక్కి చదవండి...

వేలూరి వేంకటేశ్వరరావుగారు రాసిన ‘కావ్యదహనోత్సవం’ ఆడియో రూపంలో కథాసంగ్రహం.

పరిచయకర్త/స్వరం – కొప్పర్తి రాంబాబు

0

వేలూరి వేంకటేశ్వరరావు రచనలు: బాపూ

రచన: వేలూరి వేంకటేశ్వర రావు
ఈ ఈ నొక్కి చదవండి...

బాపు గురించి వేలూరి వేంకటేశ్వరరావు రాసిన వ్యాసానికి ఆడియో రూపం.

చదివిన వారు: కొలచిన భార్గవి

0

వేలూరి వేంకటేశ్వరరావు రచనలు: వార్ధక్యం

రచన: వేలూరి వేంకటేశ్వర రావు
ఈ ఈ నొక్కి చదవండి...

వేలూరి వేంకటేశ్వరరావుగారి రచన వార్ధక్యం ఆడియో రూపం ఇక్కడ వినగలరు.

0

వేలూరి వేంకటేశ్వర రావు రచనలు: కాటుక కంటినీరు పద్యం

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

వేలూరి వేంకటేశ్వరరావుగారికి ఇష్టమైన కాటుక కంటినీరు పద్యంపై వారి వ్యాసానికి ఆడియో రూపం.

చదివిన వారు: రాజేష్ భరద్వాజ

0

తెలుగు నిఘంటువు గురించి వేలూరి వేంకటేశ్వర రావు

రచన: వేలూరి వేంకటేశ్వర రావు
ఈ ఈ నొక్కి చదవండి...

తెలుగు నిఘంటువు గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి వ్యాసం చదివిన వారు: రాజేష్ భరద్వాజ

0

కుమ్నో ఫిలాంగ్*, షిల్లాంగ్

రచన: తమ్మినేని యదుకులభూషణ్
ఈ ఈ నొక్కి చదవండి...

ఆకుల మీదుగా
రాలిపడే వానచినుకులు
లోయలో మృదువుగా
వినిపించే అలౌకిక ధ్వనులు

0

నీళ్ళున్న ఎండమావి

రచన: పులిపాటి కృష్ణచైతన్య

వెన్నెల పరుచుకోవాల్సిన పున్నమి నాడే మబ్బులు మూగినట్టు
కొండల్ని పిండి చేయగలిగే యవ్వనంలోనే
నానావిధభయసంజనితనిర్బలత

0

కాంతి దూరం

రచన: ఇంద్ర ప్రసాద్

నక్షత్రాలు కనపడినంత కాలం
చూస్తూ ఉండు
ఒకరోజు నీకూ నక్షత్రాలకీ మధ్య
దట్టమైన ధూళిమేఘం
చిరస్థావరం కట్టుకోవచ్చు

0

ఒప్పుకోలు

రచన: రఘు శేషభట్టర్

మనం దేని మీద పంతాలు పోతామో
అది అసత్యమో అర్ధసత్యమో ఐనప్పుడు
ఒక్క ఒప్పుకోలు కొన చాలు

0

ఇదే చివరిసారి…

రచన: విజయ్ కోగంటి
మూలం: Concha Méndez

ఆకాశాన్ని నిలువునా చీల్చే
అంతు లేని దుఃఖం
ముంచెత్తినపుడల్లా
ఈ దుర్భరబాధ ఇదే చివరిసారి అని
ఇంకెప్పుడూ కలగదని
అనుకుంటూ ఉంటాను.

4

అవతీర్ణపరిమళం

రచన: పరిమి శ్రీరామనాథ్
ఈ ఈ నొక్కి చదవండి...

అరవై వరకూ వ్యాసాలున్న ఈ సంపుటి మురళీధరరావుగారి సారస్వతప్రేమ, పరిశోధన, పాండిత్యం అనే మూడు నదులు సంగమించిన ప్రయాగ. ఆయన 15 సంవత్సరాలపాటు తెలుగు, హిందీ, సంస్కృతము, ప్రాకృతము, ఆంగ్లముల సాహిత్యాలతో పాటు పలు ప్రపంచభాషా సాహిత్యాల చరిత్రలను కూలంకషంగా, తపస్సువంటి అధ్యయనం చేశారు.

4

అస్తిత్వవాద సాహిత్యం: 5ఆ. కాఫ్కా

రచన: సూరపరాజు రాధాకృష్ణమూర్తి

ఈ ఆదివారం రాసిన సుదీర్ఘమైన ఉత్తరంలో తన పెళ్ళినిశ్చయం ప్రకటించాడు: ‘అతి ముఖ్యమైన విషయం ఉత్తరం చివరివరకు వాయిదా వేశాను. కుమారి ఫ్రీడా బ్రెండెన్‌ఫీల్డ్‌తో నా పెళ్ళి నిశ్చయమయింది. అమ్మాయిది బాగా ఉన్నవాళ్ళ కుటుంబం.

0

తమిళ సంగ సాహిత్యం-3: కుఱుందొగై

రచన: చంద్ర మోహన్

ప్రాచీన తమిళ పద సంపద చాలా విస్తారమైనది. క్లుప్తత, గాఢత సంగ కాలపు తమిళ భాష ముఖ్య లక్షణాలు. వాటిని బిగువు చెడకుండా తెలుగు చేయడం కష్టసాధ్యమైన పనే. ‘ఈమాట’ పాఠకులు నా అనువాద ప్రయత్నాన్ని సహృదయతతో స్వీకరిస్తారనే భావిస్తాను.

1

మధుకుల్యలవంటి కవితలు రాసిన మహెజబీన్

రచన: న్యాయపతి శ్రీనివాసరావు
ఈ ఈ నొక్కి చదవండి...

మహెజబీన్ కవితలు మధుకుల్యలు, తేనె వాకలు. వాక్యం చలువరాయి అయితే, కవిత ఒక చల్లని ఇల్లు. పాఠకులు ఎంతసేపైనా సేదదీరగల అద్భుతమైన సృజనాత్మకత ఈమె సొంతం.

2

కళాసాగరం కర్ణాటకం-2

రచన: శ్రీనివాస్ బందా
ఈ ఈ నొక్కి చదవండి...

బేలూరులోని ఈ చెన్నకేశవాలయం మానవకళాచాతుర్యానికి పరాకాష్టగా, అవధి లేని అందాన్ని ప్రదర్శించింది. అదొక అత్యద్భుతపు, అశాశ్వతత్వపు విరోధాభాస. కళారూపావిష్కరణ కాలాతీతమే అయినా, కాలం కొట్టే కరుకు దెబ్బలను భరించక తప్పదులెమ్మని చరిత్ర చెప్పడమే ఆ విరోధాభాస.

6

మనసులు దోచే మనస్లు – 3

రచన: దాసరి అమరేంద్ర
మూలం: నిమ్మగడ్డ శేషగిరి
ఈ ఈ నొక్కి చదవండి...

మేము నడుస్తోన్న దారి క్షేమం కాదనీ, అడుగు ఏమాత్రం తడబడినా దిగువనున్న బుధిగండకి మాకోసం ఎదురుచూస్తోందనీ మా అందరికీ తెలుసు. అంతా కలసి 30 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న దారి… అడుగడుగూ చూసుకుంటూ వెళ్ళవలసిన దారి… సరిగ్గా అదే సమయంలో నా హెడ్ లాంప్ పని చెయ్యడం మానేసింది.

2

ఓడిస్సీ – 4: మరులు గొలిపే మహిళ

రచన: వేమూరి వేంకటేశ్వర రావు
మూలం: హోమర్

“మరణించినవారి లోకం కంటే బ్రతికున్నవారి లోకం ఎంత అందంగా ఉందో…” అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఉదయభానుడి కిరణాల వెచ్చటి స్పర్శకు ఒడిస్సియస్ కళ్ళు తెరిచాడు. ఎదురుగా సర్సీ కనిపించింది. ఇంద్రధనుస్సులోని సప్తవర్ణాలతో మెరుస్తూన్న ఆమె దుస్తులు ఆమె సహజ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయి.

0

రాంగునంబరండి బాబయ్యా

రచన: వివినమూర్తి

అయ్యన్నీ వొగ్గేసుకుని ఆడనుండి ఈ బెంగలూరు వట్టుకొచ్చాడయ్య! మా మునసబు గోరి సిన్నోడు లేరయ్య. ఆరు దేవుడండయ్య! నేనే ఆరెంట బడ్డానండి! ఆయన గోరికి సెక్కూరిటీ ఏపారమంటండి. ‘కాపలాలు కాయాలిరా సత్తీ కాస్తావా’ అన్నారండి.

0

జయహో జీవనమా!

రచన: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
మూలం: అరవింద్ రాయ్

నేను కుక్కను కాలేనా ఏంటి? నేనవుతా. కచ్చితంగా అవ్వగలను. ఇలాంటి చావుతో నా ఉనికి మాసిపోనివ్వను. తరాలకు తరాలు ఉనికి నిలుపుకోవాలనుకుంటున్నాను. నన్నెవరూ ఆపలేరు. మళ్ళీ మొఱిగాడు. ‘భౌ భౌ భౌ…’

0

అనువాదంలో అనునాదం

రచన: దాసరి అమరేంద్ర
ఈ ఈ నొక్కి చదవండి...

ఏదైనా రచన మనకు నచ్చడానికి రెండు కారణాలు ఉంటాయి. ఆ రచనలలోని సార్వజనీనత, ఆ రచన అందించే ఆలోచన, విజ్ఞానం, సంస్కారం – ఇది మొదటి కారణం. ఆ రచనలో మన ప్రతిబింబం కనిపించడం, అందులోని అనుభవాలూ అనుభూతులూ మనవి కూడా అవడం రెండో కారణం. ఈ ‘బ్రతుకాట’ను నేను అనువదించినవుడు ఈ రెండో తరహా అంశాలు ఎంతో తరచుగా తటస్థపడ్డాయి. నాలో అనునాదం కలిగించాయి.

2

కావ్యదహనోత్సవం (ఈ-పుస్తకం)

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

1960 ఆరంభంలో, వేలూరిగారు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్ ఉన్నత విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఆంధ్రవిశ్వవిద్యాలయ వేదికపై డిసెంబరు 14, 1960 నాడు సుమారు వెయ్యిమంది ప్రేక్షకుల ముందు ప్రదర్శించిన ఉత్సవం ఈ కావ్యదహనోత్సవం.

1

యూట్యూబ్‍లో ఈమాట: ఫిబ్రవరి 2026

రచన:
ఈ ఈ నొక్కి చదవండి...

గతనెలలో ఈమాట యూట్యూబ్ ఛానెల్‌కు కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ

0

గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహితీ పురస్కారాలు – 2026

రచన: గుంటూరు జిల్లా రచయితల సంఘం
ఈ ఈ నొక్కి చదవండి...

గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహితీ పురస్కారాల కోసం కథ, కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నది.

0
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.