“ఒక గంట జీవితం” కథ ఒక సాధారణ హోటల్ సన్నివేశంతో మొదలవుతుంది. కానీ అది కేవలం హెూటల్ సన్నివేశం మాత్రమే కాదు. ఒక వ్యక్తి మనసులోని తుఫానులు, ఆలోచనలు, క్షణభంగురమైన జీవితానుభవాలు కలిసిన ఒక గాథ. ఈ కథలో రచయిత చూపించిన భావాల వెనుక ఒక లోతైన తాత్త్వికత ఉంది: జీవితం అంటే ఏమిటీ? ఏది నిజం? ఏది మాయ? ఒక గంటలో మనిషి అనుభవించే ఆనందం, దుఃఖం, విసుగు — all compressed into a fleeting moment.
ఈ కథ కేవలం ఒకరి జీవితానికి మాత్రమే పరిమితమైనది కాదు. మనిషి మనస్తత్వానికి అనుగుణంగా నిరంతరం మనసు పొరలలో చోటు చేసుకునే సంఘర్షణ. మనిషి చుట్టూ పరిభ్రమించే సమయం, సందర్భాలు ఆలోచన ధోరణులు ఈ కథలో మనం గ్రహిస్తాము.
కథలో అనేక దశలు
మనిషి జీవితం అనేక దశలతో ముడి పడుతూ ఉంటుంది. దశలవారీగా మనిషి అంతరంగం మారుతుంటుంది. కానీ, బైరాగి ఒక గంట జీవితంలోనే మనిషి అంతరంగం మారిపోయే అనేక దశలను చూపిస్తాడు.
- మొదటి దశ – రాత్రి నగర జీవితం
- రెండవ దశ – కథలో పాత్రధారి హెూటల్ లోపలి వాతవారణం పరిశీలన
- మూడవ దశ – హోటల్ అద్దాల వెనక నీడల్లా కనిపించే అభాగ్యులు, అనాథలు, వృద్ధులు వారి అంతరంగ పరిశీలన
- నాల్గవ దశ – ముసలమ్మను చూసినప్పుడు ఆమె గత జీవితాన్ని ద్వేషించడం, వేశ్యల జీవితం, పతనం గుర్తు చేసుకొంటాడు.
- ఐదవ దశ – హూటల్లో యువతుల గుసగుసలు వారి నవ్వులు అతని మనసును పరవశింపజేస్తుంది. అతడు మరుక్షణం ఇది శాశ్వతం కాదు. ఆనందం వెనుక ఎప్పుడూ శూన్యతే ఉంటుంది అనుకుంటాడు.
- ఆరవ దశ – టి.బి. ఆస్పత్రి మరణించిన యువతి జ్ఞాపకం అతని కళ్ల ముందు మెదులుతుంది. అతని దృష్టిలో ‘మరణమే శాశ్వత సత్యం, సౌందర్యం, జీవితం మసకబారిపోయినా మరణం మాత్రమే నిజం అనుకుంటాడు.
- ఏడవ దశ – వాయులీనం సంగీతం అనుభూతి కలిగించినప్పటికి, అది ఆనందం, దుఃఖం, అనుభూతులతో నిండిన ఒక జీవన స్పర్శగా భావిస్తాడు. సంగీతంలా అటు ఆనందం, దుఃఖం కలబోసినప్పుడే జీవితం సంపూర్ణ సత్యంగా భావిస్తాడు.
- ఎనిమిదవ దశ – ఒక గంట జీవితంలో మనసు ద్వారా దర్శించిన వాస్తవిక జీవితం చవి చూపాను అనుకొంటాడు.
కథలో కనబడే జీవిత దృశ్యాలు
మనిషి మనసు ఆడే నాటకంలో జీవిత దృశ్యాలు ఈ విధంగా మనకు కనిపిస్తాయి-
ఒంటరితనం తనలో తాను అన్వేషణ:
కథానాయకుడు హోటల్ ముందర నిలబడినప్పుడు రచయిత మనసులో ఒక వింత ఖాళీ స్పష్టమవుతుంది. రాత్రిపూట బయటకు వచ్చే “నిశాచరులు” అనగా అంధకారపు జీవులు, ఆసలైన జీవితపు మరో ముసుగు అని రచయిత సూచిస్తాడు. పగలు పెద్దమనుషులుగా కనిపించే వారు రాత్రిపూట మాసిన బట్టలతో తిరుగుతారని చెప్పడం ద్వారా రచయిత మానవ ద్వంద్వత్వాన్ని చూపిస్తాడు. ఇక్కడ ఆయన మనసులో ఒక ప్రశ్న ఉంది: “ఏది నిజం?” పగలు కనిపించే సన్మానం నిజమా? లేక రాత్రి బయటపడే ముసుగులేని స్వరూపమా?
కాఫీ, సిగరెట్ – జీవన ప్రతీకలు:
హోటల్ లోపల కూర్చుని కాఫీ తాగడం, సిగరెట్ కాల్చడం రచయితకు కేవలం అలవాట్లు కావు, అవి జీవితపు చేదు- మధుర అనుభవాలకు ప్రతీకలు, కాఫీ చేదు, సిగరెట్ విషం కానీ వాటిలోనే ఆయనకు తాత్కాలిక ఉపశమనం. జీవితం విషమే అని ఆయన భావన, కానీ అదే విషం మనిషిని మళ్ళీ బ్రతకనిస్తుంది అనే వ్యంగ్యత ఇక్కడ కనిపిస్తుంది.
సౌందర్యం VS. విచారం:
రచయిత దృష్టిలోకి వచ్చిన యువతుల సౌందర్యవివరణలో ఆయన మనసు క్షణం పాటు పరవశమవుతుంది. కానీ వెంటనే ఆయన ఆలోచనలు మరణం, రోగం, క్షీణతల వైపు దూసుకెళ్తాయి. అందమైన వక్షోజాలు, మెరుస్తున్న జుట్టు, నవ్వులall these bring joy, but simultaneously remind him of impermanence. సౌందర్యం ఎంత మోహనమైనా, దాని వెనుక విచారమే ఉందని ఆయన భావజాలం చెబుతుంది.
మరణపు జ్ఞాపకాలు:
కథలో రచయిత గుర్తుకు తెచ్చుకున్న టి.బి. ఆసుపత్రిలో చనిపోయిన అమ్మాయి వ్యధభరిత జీవన స్థితి గుర్తు చేస్తుంది. మృతక సౌందర్యం, మూతబడిన కళ్ళు — ఈ జ్ఞాపకం ఆయన మనసులో శాశ్వత గాయంగా ఉంది. సౌందర్యం, మరణం అనే ఈ రెండూ విడదీయలేనివి అనే భావనను ఆయన వ్యక్తం చేశాడు.
సంగీతం అంతరార్థం మానవజాతి శోకం:
కథ చివర్లో వాయులీన స్వరాలు వినిపించడం వాస్తవాన్ని తాత్కాలికంగా ముంచెత్తుతుంది. సంగీతం ఆయనకు ఆత్మానుభూతి, కానీ అదే సమయంలో అది మానవజాతి శోకగీతంలా వినిపిస్తుంది. “We are lost” అన్న వాక్యంతో రచయిత మొత్తం మానవజాతి భవిష్యత్తుపై దిగులును వ్యక్తం చేస్తున్నాడు. ఆనందం, దుఃఖం, మరణయాతను all, MERGE IN THE ECSTASY OF AGONY.
క్షణక్షణం మారే అంతరంగ దశలు:
చివరగా కథానాయకుడు “నేనొక గంట జీవించాను. చాలా వాస్తవంగా జీవించాను” అని చెప్పడం ద్వారా రచయిత చెప్పదల్చుకున్నది స్పష్టమవుతుంది: జీవితం ఎంత పెద్దదో, ఎంత చిన్నదో అనేది కొలమానం కాదని, ఒక గంటలోనూ మనిషి సంపూర్ణంగా జీవించగలడని రచయిత స్పష్టం చేస్తాడు. అనుభవం యొక్క లోతు మాత్రమే జీవితానికి అర్థం ఇస్తుంది.
ఈ కథలో మనం చూస్తున్నది బయటి సంఘటనలు కాదు, కానీ ఒక మనసు అత్యుత్తమ మానసిక ఉత్కర్షను పొందిన క్షణాల్లో ఎలా స్పందిస్తుందో. అందం, పతనం, ఆకర్షణ, మరణం, సత్యాన్వేషణ ఇవన్నీ ఒక గంటలో కలసి, మనిషి మనసు నిజాన్ని ఎలా వెతుకుతుందో ఈ రచన మనకు చూపిస్తుంది. జీవితం అనేది అనేక రకాల క్షణాల సమాహారం కానీ వాటిలో కొన్ని క్షణాలు మాత్రమే శాశ్వత గుర్తుగా నిలుస్తాయి.
మానసిక విశ్లేషణ
ఈ కథలో ప్రధాన పాత్ర మనస్సు మూడు స్థాయిల్లో విహరిస్తుంది:
పరిశీలనా స్థాయి
అతడు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంతో గమనిస్తాడు. రాత్రివేళ కనిపించే ఆగంతకులు. ఆ పేదవాళ్ల దుస్థితి, అదేసమయంలో కొన్ని వెలుగు వెలుగు జ్ఞాపకాలు, సమ్మోహితం చేసే శరీర సౌందర్యం – all of these are registered with an intense gaze. ఇదంతా, తాను తటస్థంగా ఉండి చేసిన పరిశీలన కాదు. ఇది అంతరంగ శోధన. అతని అంతర్గతంలోని అగాధాల్ని తరచి చూడడంలో ఈ దృశ్యాలు స్పష్టమైన అద్దంలా పనిచేస్తాయి.
ఆత్మవిమర్శ స్థాయి (Self-Reflection Layer)
అతడు తన ముఖాన్ని అద్దంలో చూసినప్పుడు. ‘ఇది నేనా?’ అన్న అనుమానంతో మొదలయ్యే ఆత్మవిమర్శ అనేక జ్ఞాపకాలు, అనుభావాలను బయట పెడుతుంది. మిత్రుడు గోకుల్ గుర్తుకు వస్తాడు, మిస్ పాండ్యా జీవితం మీద కోపం వస్తుంది, మరణించిన పేషెంట్ గుర్తుకు వస్తుంది. ఇవన్నీ అతనిలో మానసిక వ్యధ నుండి ఉద్భవించిన ఒక నిర్దిష్టమైన వేదన మనసును ప్రశ్నలతో కలచివేస్తుంది.
అనుభూతి స్థాయి
కథ చివర్లో వచ్చే వయలిన్ సంగీతం ఇతని చైతన్యంలో విస్మృతి, విభ్రమం, తాత్విక ఉద్రేకం కలిగిస్తుంది. ఈ సంగీతం అతని ఆత్మను ఆవహించి, “ఏదో సాధించలేని శూన్యం” వైపు లాక్కెళు తుంది. ఇది రాగం కాదు, ఒక లోతైన మానసిక ప్రక్రియ. ఈ మానసిక స్థితిని మానవ జీవితంలో అరుదుగా మాత్రమే తాకే “తూర్పు కాంతి”గా భావించవచ్చు.
ప్రధాన మానసిక అంశాలు
- ఒంటరితనం: అతని పాత్ర సమాజంతో కలిసిపోలేకపోతున్న ఒంటరితనాన్ని ప్రతిబింబిస్తుంది.
- అస్తిత్వం మీద సందేహం: “ఈ అందం నిజమా? ఈ దుర్భాగ్యం నిజమా?” అనే ప్రశ్నలు అతని మానసిక స్థితిని తిరగబెడతాయి.
- సౌందర్యాన్వేషణ: శృంగార దృష్టిలో మొదలయిన అభిమానం చివరికి శూన్యపు సత్యంగా పరిణమిస్తుంది.
- సమాజం పట్ల విరక్తి: పాండ్యా లాంటి వ్యక్తుల పట్ల కర్తను ఓ వికృత కోపం, విరక్తి అనుసరిస్తుంది.
- సంగీత ద్వారా మానసిక విముక్తి: వయలిన్ స్వరాలు అతన్ని మానవ స్థితిని అధిగమించబోతున్నంత స్థాయికి తీసుకెళతాయి.
తాత్వికావలోకనం
ఈ కథ అశాంతిని రేకెత్తించినా, ఇది తాత్విక చింతనను తప్ప వేదనను కలిగించదు. జీవితానికి, సౌందర్యానికి, మరణానికి మధ్య ఉన్న అగాధమే ఈ కథకు ఆత్మ. చివరకు, ఆ ‘ఒక గంట జీవితం’ ఒక కలా? మౌన రోదనా? లేక వాయిదా వేయబడిన ఆత్మహత్యా? అన్న సందేహం పాఠకుడికి మిగిలిపోతుంది.
“ఒక గంట జీవితం” అనేది ఒక మానసిక సందర్శన, ఒక మౌన యాత్ర. ఈ కథలోని మనిషి మనలోనే ఉన్నాడు. అతను భిన్నంగా అనిపిస్తున్నా, అతని సమస్యలు మనవే. ఈ కథ మనం చూసే ప్రతి వెలుగు, ప్రతి చీకటి, ప్రతి నవ్వు, ప్రతి కన్నీటి వెనుక మనకు గుర్తు చేయదలచిన పరిమితులు, వాస్తవాలు ఉన్నాయి. ఇవే మానవ జీవితపు అసలు స్వరూపాలు.
బైరాగి కవి, కథ రచయితగా ఒక గంట జీవితం కథలో మనిషి మనసు చేసే గారడీలను తెలియజేసాడు. అనుక్షణం మనసు స్పందనలు, ప్రతిస్పందనలు ఎలా మార్పు చెందేది ఈ కథలో మనకు చూపిస్తాడు. బైరాగి వాక్యాలలో వినిపించే పదడాంబికం కంగున శబ్ధం చేసినప్పటికీ, కథాశైలిలో, కథనంలో ఎలాంటి హంగులు కనిపించవు. మనిషి అంతరంగంలోని లోతైన మానసిక ప్రవృత్తుల సూక్ష్మ పార్శ్వాలను ఆవిష్కరించగల తక్కువమంది తెలుగు కథకులలో బైరాగి ఒకడు అని ఈ కథ ద్వారా నిరూపించుకొన్నాడు.