చీకటి పడినది తల్లీ దీపం చూపవేలనే!
మాకై దీపం చూపవేలనే?
ఆటల పాటల ప్రొద్దు బుచ్చినవి
పిట్టలు గూటికి తిరిగి వచ్చినవి
రెక్కలార్చి పవలెల్ల నొచ్చినవి
సంజమనక నిను దరియ వచ్చితిమి
కోపమేలనే ?
మాకై దీపం చూపవేలనే?
పాప పుణ్యములు పరచిన బాటల
కూడని వేడుక కూడిన చోటుల
పయనించాం మా పసి చెలగాటల
మలిన దేహులము, చల్లని చేతుల చాపవేలనే ?
మాకై దీపం చూపవేలనే?
నీ గొంతుక వినిపించని గేహం
మా మదిలో దుర్భర సందేహం
దీపికగా వెలిగే నీ స్నేహం
ఈ దోబూచుల పెనుజీకటిలో
దాపవేలనే ?
మాపై కోపం చూపనేలనే?
తల్లీ దీపం చూపవేలనే?