వెన్నెలా లేదు
నక్షత్రాలూ లేవు
అమ్మ ఉంది
జోలపాడుతూ.
అమ్మ కళ్ళు
చెమ్మగిల్లాయి
ఒళ్ళోని పిల్లాడి నిద్ర చూసి
వాడులేని లోకమంతా
గొంతులోకి పొంగుకొచ్చి…
పాట ఓ క్షణకాలం ఆగింది.
ఎక్కడి నుంచో చిరుగాలి వీచింది
పిల్లాడి ముంగురులను కదిలిస్తూ…
నిద్ర చెడి
పిల్లాడు కదిలాడు.
అమ్మ ఎక్కువ ఆలోచించకుండా
జోలపాట
మళ్ళీ మొదటి నుంచి పాడింది.