రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

Diapers and Memories

రచన: ధీరజ్ కశ్యప్
ఫిబ్రవరి 2023

కనురెప్పలు మూతపడి
మళ్ళీ తెరుచుకున్నట్టుగా
స్టార్‌బక్స్ తలుపులు
మంచు తుఫాను దాడులకు అడ్డుగోడలై

గెట్ ఇన్ గెట్ ఇన్!
             థాంక్ యూ!
బ్రూటల్ ఔట్ దేర్ హాఁ?!
             ఓహ్ యా. డెడ్లీ స్టార్మ్.
స్టే వార్మ్!

ఎన్ని అర్థాలు
ఒక్క మాటలో

ఇదిగో వెచ్చదనం
అదిగో ప్రపంచం
ట్రైన్ స్టేషన్ రివాల్వింగ్ డోర్
క్షణానికొక మనిషిని పుట్టిస్తూ

హార్వర్డ్ నెక్స్ట్ స్టాప్!

బోస్టన్ చలి దాడులు
జీవితపు లోతుల్ని తీసి
మొహాల మీద
నిస్సహాయపు నవ్వులు పులిమి పోతాయ్.

గడ్డకట్టిన జీవితాలు
మాటలు మర్చిపోయి
ప్రేమలు కరువై
అరచేతులు రుద్దుకుంటూ
గొంగళ్ళు కప్పుకున్న
మానవాళి ఆనవాళ్ళు.

ట్రైన్ స్టేషన్ బయటకొచ్చి చూస్తే
ఎలక్ట్రానిక్ బిల్‍బోర్డుపై
బోర్లా పడుకుని
నవ్వులు చిందిస్తూ
నెలల పిల్లాడు.

నెలల పిల్లాడి పిర్రలు
మనుష్యుల మనస్సులు.
డైపర్స్ అండ్ మెమొరీస్
మరొక్క దానికి చోటు ఎపుడు ఉంటూనే ఉంటుంది.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • డెఫినిషన్స్
  • క్షణికాలు
  • #జర్నీ_బ్లూస్
  • వంగిన విశ్వం
  • నీతో నువ్వే

ఇటువంటివే…

  1. నిశ్శబ్దం లో నీ నవ్వులు
  2. నీ ఆలోచనలు
  3. తడిచేతుల సముద్రం
  4. అనామకం
  5. మధ్యాహ్న హాసం

ఫిబ్రవరి 2023 సంచికలో ...

  • Diapers and Memories
  • అపురూపం
  • అమూర్తం
  • అమ్మ చెప్పిన అబద్ధం
  • ఆక్సిజన్ మాస్క్‌
  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 16
  • ఊహల ఊట 21
  • గడినుడి – 76
  • తరగతి గది కథలు
  • ది వేస్ట్‌ లాండ్: 2. బరియల్ – మొదటి దృశ్యం
  • నాకు నచ్చిన పద్యం: అమృతం కురిసిన మైథిలి మనస్సు
  • పరిచయం: డాక్టర్ కథ
  • పాదరసపు కలలు
  • ఫిబ్రవరి 2023
  • యూట్యూబ్‍లో ఈమాట: గతనెలలో
  • వాడి కథ
  • సోల్జర్ చెప్పిన కథలు: రెండు గంటల కోర్స్
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

సోల్జర్ చెప్పిన కథలు: రెండు గంటల కోర్స్
నాకు నచ్చిన పద్యం: అమృతం కురిసిన మైథిలి మనస్సు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.