అవస్థ

అంతా పాత కథే
జ్ఞాపకాల గాయాలు
సలుపుతూ
లోపలా బయటా
అంతా ఎడారిలా
స్పృహ కోల్పోయిన క్షణాలు

మిణుకు మిణుకు మంటున్న
దీపం౼
ఆ దృశ్యం వెక్కిరిస్తూ
ఇక౼
విశ్వమంతా శూన్యంగా
అనిపిస్తూ౼

ఏదో
భళ్ళున పగిలిన శబ్దం
నిలుచున్నచోటే
భూమిలోకి కూరుకుపోతున్నట్టుగా
అవును ౼
ఉలికిపాటు
అంతా ఏదో గజిబిజిగా
పూలు పూయలేని మొక్కల మధ్య
ఊపిరాడని తనమేదో!