ఏదో చెట్టుకు పూసి
ఎక్కడో రాలిపోయే జీవితం
రాళ్ళపై రక్తపు మరకలు
అస్తమిస్తున్న సూర్యుడి కళ్ళు
మూతలు పడుతున్న వేళ
ఎన్ని హృదయాలు పగిలాయో
ఎలా చెప్పను!?
నక్షత్రాలన్నీ తల్లడిల్లుతుంటే
పూలన్నీ మౌనంగా చూస్తుంటే
పూర్ణిమ విచ్చుకోకుండానే
ఆ రేయి గడచిపోతుంటే
గుండెకు గుచ్చుకునే
ఆ సమయాలను
ఎలా చెప్పను!?
నిజాలను దాచలేని,
అసత్యాలు పలకలేని
దుఃఖం
ఎలా చెప్పను!?