ఒక పాత కోటలో అది ఒక గది. మధ్యలో, ఒక శవవాహిక మీద తెల్లని దుస్తుల్లో పడుక్కున్న ఒక యువతి శవం ఉంటుంది. నాలుగు ప్రక్కలా, గోడలపై కాగడాలు వెలుగుతూ ఉంటాయి. కుడిప్రక్కన వెడల్పుగా ఉన్న ఒక కిటికీ, అందులోంచి దూరంగా రెండు కొండలు, వాటి మధ్యలోనుండి ఒక సముద్రపు తునకా కనిపిస్తూ ఉంటాయి.

మార్గరెట్టు టీచరు మొహమాటపడుతూ మొహమాటపడుతూ లోపలికి వొచ్చేరు. అతి బలవంతాన పాలు తాగేరు. ఆవిడ నెమ్మదితనం, మాటతీరు, మనిషీ అన్నీ అమ్మకీ బామ్మకీ నచ్చేయి. తర్వాత తెగమెచ్చుకున్నారు. ఆవిడ దగ్గర నెమ్మదితనాన్ని, గట్టిగా అరుస్తున్నట్టు మాటాడకండా మాటలాడ్డాన్ని నేర్చుకోవాలి.

ఈమాటలో అక్టోబర్ 2017 సంచికలో, సి. ఎస్. రావ్ కవి తిలక్‍పై రాసిన వ్యాసం గ్రంథచౌర్యానికి లోనయింది. యోగి వేమన విశ్వవిద్యాలయం తరపున తిలక్ శతజయంతి సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో సమర్పించిన పత్రాల సంకలనం తిలక్ సాహిత్యం – సందేశంలో, ఎస్. పి. యూసుఫ్, ఎం. సి. జె. అన్న రచయిత ఈమాటలో వచ్చిన వ్యాసాన్ని కొన్ని మార్పుచేర్పులు చేసి ప్రకటించారు.

స్వీరా నగరాన్ని ఒక ఆరుబయలు మ్యూజియం అనడం సబబు. అక్కడ మనకు లభించగల చక్కని అనుభవం ఏమిటీ అంటే గమ్యమంటూ లేకుండా ఆ నగరపు వీధుల్లో గంటలతరబడి తిరుగాడటం, ఆ ప్రక్రియలో కాస్సేపు మనల్ని మనమే కోల్పోవడం. ఏ ఆలోచనలకూ తావు లేకుండా సేదదీర్చే ఆ వాతావరణం ఏ మనిషినైనా మత్తెక్కిస్తుంది.

ఇక్కడ ఫ్రీ ప్రెస్ జర్నల్‌లో కార్టూనిస్ట్‌గా ఉన్నది నేనొక్కడినే కాదు. మరో కార్టూనిస్ట్ కూడా అక్కడ తన బొమ్మలతో, తన సృజనాత్మకతో, తన కార్టూన్ల వెటకారపు చావు దెబ్బలతో రాజకీయ నాయకులని హేళన చేస్తూ ఉన్నాడు. అతను మీకు బాగా తెలిసినవాడే! అతని పేరు చెప్పేయంగానే అతడిని మీరు ఇట్టే గుర్తు పట్టేస్తారు.

దాదాపు నెల క్రితం సంగతి. ఒక ట్రైనీని ఇలాగే పిలిచి నిలబెట్టాడు. సెలవు మీద వెళ్ళి, తిరిగి సాయంత్రం ఆరు గంటలకి రిపోర్ట్ చెయ్యాల్సి ఉండగా, రాత్రి తొమ్మిదింటికి రిపోర్ట్ చేయడం – ఆ ట్రైనీ చేసిన నేరం. చేతులని నేలమీద ఆనించి, కాళ్ళని గోడకి తన్నిపెట్టమన్నాడా ట్రైనీని. వొంటి బరువంతా భుజాల మీద పడి, అతను చిగురుటాకులా వణకడం, మూడు రోజులవరకూ భుజాలు సవరించుకుంటూ తిరగటం గుర్తొచ్చింది.

కరెంటు పోయింది, ఫాన్ మూల్గుతూ మూల్గుతూ ఆగడం వింటూంటే ఇంకా నవ్వొచ్చింది. కిటికిలోంచి కొబ్బరిచెట్టు మట్ట గాల్లో ఊగుతోంది. కుడీ ఎడమా కుడీ ఎడమా… కుడికాలి పైన ఎండ పడి సుర్‌సుర్‌మంటోంది. కాలు పక్కకు జరుపుదామనుకున్నాను. జరిపాను. జరగలేదు. అది నామాట వింటల్లేదు. రూమ్ అంతా తెల్లగా పొగ. మెడ కిందినించొకటి చెమట చుక్క జారి పొట్టమీదనుంచి ఇంకా కిందకి, చక్కిలిగిలి పెడితే గట్టిగా నవ్వొచ్చింది.

నేను అనుభవించాను. అన్ని వేళలా, నన్ను బయటే నిల్చోబెట్టారు. పాలక నిర్వాహణ శిక్షణ అన్నది ‘నేను ఆజ్ఞాపించడానికి పుట్టాను’ అని నమ్మించడానికి చేసే నేలబారు వశీకరణ విద్య తప్ప మరోటి కాదు. అయితే నాకు మాత్రం అలా చెప్పలేదు. నాకేసి వచ్చిన మాటలు అన్నీ ‘నువ్వు వేరే’ అన్న అర్థాన్నే మోసుకొచ్చి నాకు చెప్పాయి: ‘మా దయ వల్ల, మా కరుణ వల్ల, మాకున్న సమతాధర్మంవల్ల మాత్రమే నీకు ఇక్కడ కూర్చునే అవకాశం కలిగింది. కాబట్టి ఆ కృతజ్ఞతతో మాకు విశ్వాసబద్ధుడిగా ఉండు.’

చాటింగ్ ఆపేసి ఫోన్ వంక చూస్తూ ఉన్నాడు. అతణ్నే చూస్తూ ఉంది. కాలేజీలో ఒకరిద్దరు నచ్చారు. కానీ వాళ్ళు తనతో మాట్లాడే మనుషుల్లా అనిపించలేదు. లైట్ తీసుకుంది. ఇంటర్ దాకా లావుగా ఉండేది. ఇంట్లో అమ్మా నాన్నా కూడా లావు కాబట్టి తనది బొద్దుతనంగా కనిపించేది. ఇంజినీరింగ్‌లో చేరాక చుట్టూ ఉన్నవాళ్ళ మధ్య లావు సంగతి తెలియడం మొదలైంది. ఎవరూ వెక్కిరించేవారు కాదు. కానీ తనకే ఏదోలా ఉండేది.

అమ్మకి ఇంత తలపొగరెందుకో అర్థం కాదు. కోపంగా ఉంది. బాబాయి మేము చెడిపోయే సలహాలేం ఇవ్వడుగా? అదీగాక అసలు ఊళ్ళో ఎంత బాగుంటుంది. మామిడిపళ్ళు, పనసపళ్ళు, కొండ మీద రకరకాల అడవిపళ్ళు, ఇంటి చుట్టూ దడుల మీద కాసే దోసకాయలు, పుచ్చకాయలూ… ఎన్నెన్ని దొరుకుతాయని? నదిలో స్నానం చేసి ఆడుకోవడం ఎంత హాయి! ఇవన్నీ వదిలేసి ఇక్కడ కూచుని బుట్టలు అల్లుతానంటుంది.

“నన్నొదిలి వెళ్ళిపోతావా నువ్వు?”
అన్నది తను! నాని, పెచ్చులు ఊడిపోతోన్న
ఆ ఇంటిని గట్టిగా మరి నా ప్రాణం
పోతున్నంతగా హత్తుకుని అన్నాను ఇక:
‘లేదు. ఉంటాను, నీతోనే నేను’

రుషులను చూడటానికి వారి ఆశ్రమాలకు దేవతలు వచ్చినట్లే, ఆ అరణ్యంలో సీతారాములను చూడటానికి, జగత్తులోని పూర్వపరాలలోని ప్రేమికుల జంటలు -రోమియో జూలియట్; ముంతాజ్ షాజహాన్; పార్వతి శివుడు; లైలా మజ్నూ; వీనస్ అడోనిస్; క్లియొపాట్రా ఏంటొనీ; భాగ్యమతి కులీకుతుబ్ షా; ఎంకి నాయుడుబావ; ఎలిజబెత్ ఫిలిప్; జేన్ టార్జాన్; హెలెన్ పారిస్; అనార్కలి సలీమ్, మరియా వాన్ట్రాప్ -ఎందరెందరో ఆ చుట్టు పట్ల చరించారేమో మరి!

మళ్ళీ –
ఆకుల కదలికలకు కూడా
ఉలిక్కిపడుతూ
కొమ్మపైన వాలిన పిట్ట అరుపులో
సమాధానాన్ని వెతుక్కుంటుంటావు
వసంతంలో పూచే
పూల పలకరింపుకై ఎదురుచూస్తూ.

చాలా దయతో బోలెడంత దూరాన్ని ప్రేమగా
దోసిలినిండుగా ఇచ్చి
మెడచుట్టూ ఖాళీ కాగితాన్ని
చీకటి శాలువాలా చుట్టి ఆకాశమనుకోమనీ
అక్షరాల నక్షత్రాలను అంటించుకోమనీ
వెళ్ళిపోయావు.

తడి తడిగా కబుర్లు చెప్పుకుంటూ
కదులుతున్న కాలువ నీళ్ళు
గెనం మీద పచ్చిక ఒడిలో
కునుకేసి కలలు కంటున్న మిడత
నా ఎత్తు ఎదిగిన చెరుకు తోటలో
ఎగిరి పోతున్న చిలకల జంట

అతడు తనువంతా అశ్రుకణమయ్యాడు
విలపించాడు విలవిల్లాడాడు
చిగురుటాకులా కంపించిపోయాడు
వేయి దేవుళ్ళను వేడుకొన్నాడు
అదే ప్రేమతో అదే ఇష్టంతో
ఆమె చేతిని తాకాడు

నేనూ, నాది, నాకు అనే నా రోజువారి ప్రతిబింబాల నుండి ఒక్కసారిగా ఈ మాటలు నన్ను కాలం వెనక్కి తీసుకెళ్ళి సుడిగాలిలో చిక్కి అంతర్ధానమైన జ్యోతింద్రనాథ్ వంటి అవ్యవసాయకులను పరిచయం చేసుకోవడం, వారి చేతుల్లో మొహన్ని దాచుకోవడం, వాటిని ముద్దాడుకోవడం చేస్తాయి. దేశం కోసమని, మన కాళ్ళ మీద మనం నిలబడి చూపాలని ప్రయత్నించి – అప్పులతో, నష్టాలతో సర్వనాశనంతోనూ మిగిలిన మనుష్యులు ఎంతమందో!

సంతోష సన్నివేశములకు, త్వరితగతిని సూచించుటకు, ప్రాసానుప్రాసలను ఉపయోగించి గానయోగ్యముగా నుండు వృత్తములలో మానిని, కవిరాజవిరాజితములు అత్యుత్తమ శ్రేణికి చెందినవి. నేను కొన్ని సంవత్సరములుగా పరిశోధించి కనుగొన్న విశేషమేమంటే, తాళవృత్తములను మాత్రాగణములకు తగినట్లు పదములను ఎన్నుకొని వ్రాసినప్పుడు అవి గానయోగ్యముగా నుండి ఛందస్సు సంగీత సాహిత్యముల రెండు ముఖములని తెలుపుతుంది.

ఒక పాఠకుడిగా ఝాన్సీ రాణి ప్రతి కదలికకు చలించిపోయాను. ఆవిడ ప్రేమలో పడ్డట్టే లెక్క. ఆపై, తెలివయిన గుర్రాన్ని అధీనంలో వుంచుకోడం, సకాలంలో గొప్ప వ్యూహరచన చేయడం, స్వదేశీ విదేశీ వీరులకు ధీటుగా ధైర్య ప్రదర్శన! గట్టి పట్టుదలతో తనని మోసం చేసినవారిని సైతం ఆశ్చర్యంలో పడేసే ఎత్తుగడలు! భలే మనిషి- పోనీ, భలే రాణి!

2021వ సంవత్సరానికి తానా బహుమతి గెల్చుకున్న రెండు నవలల్లో చింతకింది శ్రీనివాసరావుగారి మున్నీటి గీతలు ఒకటి. సిక్కోలు (శ్రీకాకుళం) మత్స్యకారుల జీవితాలను హృద్యంగా అక్షరబద్ధం చేసిన 210 పేజీల నవల ఇది. కేవలం జాలర్ల బతుకులను ఆధారంగా చేసుకుని రాసిన మొట్టమొదటి తెలుగు నవల.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: