డెఫినిషన్స్

భాష ఎవరిదనీ
అలా అనుకోవడానికి?
ఆమె: పెదాలు మాత్రమే ముద్దు కాదు

నిద్ర ఎప్పుడొచ్చింది నీకు?
అతను: జుట్టు ముడేసుకుని నవ్వుతున్నది నువ్వే

ఊరికే ఊసుపోని నిర్వచనాలు
ఎన్ని కవితల్లో పారబోస్తావేంటీ?
ఇల్లు: ప్రకృతంటే కేవలం మీరిద్దరే పొండి

తీరిక లేదనే అంటుంది తింగరి ప్రపంచం
మెట్లు: ముద్దాడినప్పుడల్లా నత్తగుల్లల్లా చుట్టుకుంటూ ఎన్నాళ్ళు మమ్ము మోస్తారు?

గుర్తులా?
ఎవరు చేస్తారు వాటిని?
ఊరు: మిమ్మల్ని ప్రేమలో చంపి పాతరేసింది నేనని తెలుసా?


కాశి రాజు

రచయిత కాశి రాజు గురించి: పీజీ ఇన్ రూరల్ డెవలప్‍మెంట్, భూమధ్యరేఖ (కవిత్వం ), 2014. ...