కల

మళ్ళీ ఓ కల రాలింది
ఏరుకుని దోసిట్లో పట్టలేను
అబద్ధాలను ముట్టుకోలేం కదా

ఏదో ఇష్టమైన వాయిద్యం
గుండెంతా మోగించిన చప్పుళ్ళు
మరింత ఇష్టంగా నిద్రలేచిన రెక్కలు

కానీ
ఎప్పట్లాగా అప్పటి నేను ఎగరలేదు
మళ్ళీ చిగురవ్వలేదు
కళ్ళు నలిపాక వాడిపోనూలేదు.

ఈసారి ఇప్పటి నేనే
మళ్ళీ కొత్తగా మోడవ్వక్కర్లేదు!

మరపు ఓ అబద్ధమని గుర్తుచేస్తూ
ఇలా కల.