విలక్షణమైన రచనాపటిమ, ప్రత్యేకమైన శైలి-శిల్పాలతో కలాన్ని మంత్రదండంగా మార్చిన కథా రచయిత చంద్ర కన్నెగంటి. ఏ వస్తువుని ఎంచుకున్నా అందులో తగినంత కొత్తదనాన్ని నింపి, నిగూఢమైన సూచకాలతో సందేశాన్నివ్వగల మాంత్రికుడాయన. కథకుడిగానే కాక, కవిగా కూడా ఆయన సుపరిచితుడే. ఆయన వ్రాసిన కథల్లోంచి పన్నెండు ఆణిముత్యాలని ఎంచుకుని, శ్రీనివాస్ బందా తన స్వరంలో ఆడియో కథలుగా అందిస్తున్నారు.

రచయిత శ్రీనివాస్ బందా గురించి:
దిల్లీలో స్థిరపడిన విజయవాడ వాసి శ్రీనివాస్ బందా మాజీ సైనికుడు, కార్పొరేట్ ఉద్యోగి. సంగీత సాహిత్యాలంటే చిన్నప్పటినుంచీ మక్కువ ఎక్కువ. ఆ మక్కువే ఒకప్పుడు ఆకాశవాణికీ, దిల్లీ చేరేక నేపథ్య గాత్రధారణకూ పునాది అయింది. తన ఆర్మీ అనుభవాలను కథలుగా మలిస్తే, అవి ‘సోల్జర్ చెప్పిన కథలు’గా ‘ఈమాట’లో ధారావాహికంగా వెలువడ్డాయి. కాగితం మీదికి దిగే ప్రతి అక్షరానికీ ఒక సామాజిక బాధ్యత ఉంటుందని నమ్మే శ్రీనివాస్‌కు, ఆలోచింపజేసే ఏ రచన అన్నా ఇష్టమే.
... పూర్తిగా »