గడినుడి – 39 సమాధానాలు

అడ్డం

  1. సమయానికి న్యాయము తోడైతే చావే (5)
    సమాధానం: కాలధర్మము
  2. ఆకాశం నుండి ఊడిపడే రాయి (4)
    సమాధానం: వడగల్లు
  3. ఆంధ్రులకింకా ప్రత్యేకంగా దొరకనిది (2)
    సమాధానం: హోదా
  4. అట్నుండి చూస్తే మూడొందల్లా కనిపిస్తుంది కానీ ఇది కందకం (3)
    సమాధానం: దవంత్రి
  5. గుబాళంచే ఈ చెట్టుని జ్ఞాపకం ఉంచుకుంటాము (4)
    సమాధానం: మరువము
  6. దీనితో పూజ చేస్తున్నారంటే శిక్షా? (3)
    సమాధానం: బడిత
  7. గారాబము అన్నమాటకి అర్ధం తెలియాలంటే 36తో కలిపి ఈ జంటపదాలు వాడొచ్చు (2-4)
    సమాధానం: మురిపెము
  8. చెట్టునుండి కింద పడ్డ తుంటరి (4)
    సమాధానం: రాలుగాయ
  9. జీడి నల్లి (5)
    సమాధానం: అగ్నిముఖము
  10. ప్రశ్నించే పాదం (3)
    సమాధానం: అడుగు
  11. అజాగ్రత్త జన్మలో అప్పుడప్పుడు కనిపించే అవంతి (3)
    సమాధానం: అగ్రజ
  12. మలినము అంటుకునే కలము సుమా! (5)
    సమాధానం: కసుమాలము
  13. ఈ కలుపుమొక్క నాలుగు కోసులదూరంలో చెట్టుకి కాస్తుంది (5)
    సమాధానం: ఆమడకాయ
  14. వడ్డి ఒకటి అనడానికి బదులుగా వాడే మాట (3)
    సమాధానం: లాభము
  15. జూదంలో మీ ఎత్తు ఫలించాలంటే ఇది వెయ్యాలి (3)
    సమాధానం: పాచిక
  16. అమలుచేయాలంటే ఆ కాలు పట్టుకోవాలి (5)
    సమాధానం: ఆచరణము
  17. కల చెదిరి తలమునకలు కాగా గాలి వీచింది (4)
    సమాధానం: తలునము
  18. ఎంతో మెల్లగా మాట్లాడినా కూడా గ్రహించే శక్తి ఉండే శ్రవణేంద్రియం (4)
    సమాధానం: పాముచెవి
  19. ఎముక బాణం (3)
    సమాధానం: శలాక
  20. సమీప కాల ఇతివృత్తము (4)
    సమాధానం: పురాకథ
  21. లోపాయికారీ కక్కుర్తి (3)
    సమాధానం: లాలూచి
  22. చూ. 13 అడ్డం (2)
    సమాధానం: ముద్దు
  23. సిద్ధించాలంటే సరిగా మసలుకో (4)
    సమాధానం: సమకోలు
  24. స్వప్నలేఖిని చేసే పక్షుల రొద (5)
    సమాధానం: కలకలము

నిలువు

  1. దుండగము కాదనకుము (5)
    సమాధానం: కాకుదనము
  2. క్షమయా…(3)
    సమాధానం: ధరిత్రి
  3. ఆణిముత్యానికి విముక్తా? మణికారుడిని అడగాలి (4)
    సమాధానం: ముక్తామణి
  4. పెళ్ళికి రావల్సినవారు? (5)
    సమాధానం: వధూవరులు
  5. ఇదే (2)
    సమాధానం: గడి
  6. ఉద్యోగరీత్యా బయటూళ్ళకెళ్తే ఇది మీకు ఇస్తారు (5)
    సమాధానం: దారిబత్తెము
  7. జీవంలేని లక్షణం (5)
    సమాధానం: అచేతనము
  8. జమున లయ నడుమ మొదలైన కన్నీరు (6)
    సమాధానం: నయనజలము
  9. విజృంభించు వేడి? కాదు,ఒక వంటకం (5)
    సమాధానం: పెరుగువడ
  10. లంక చుట్టుపక్కల వధూవరులకు ఇచ్చే ధనంతో నగ వస్తుంది (6)
    సమాధానం: అలంకరణము
  11. మకర సంక్రాంతి మొదలు కర్కటక సంక్రాంతి మధ్య కాలం (6)
    సమాధానం: ఉత్తరాయణము
  12. ఒక అధోలోకం లో తలాకు ఇస్తే గందరగోళం కాదూ? (6)
    సమాధానం: అతలాకుతలం
  13. కుట్ర పన్నాలంటే ఇంద్రజాలం సాధనం కావాలి (5)
    సమాధానం: మాయోపాయము
  14. గాలికబుర్లు వినాలంటే విజయవాడ విశాఖపట్నం వెళ్ళాలా? (5)
    సమాధానం: ఆకాశవాణి
  15. బహుజనపల్లివారి శబ్ద సముద్రం? (5)
    సమాధానం: రత్నాకరము
  16. ఆశ్వయుజ మాసంలో వచ్చే పర్వదినాలు (5)
    సమాధానం: నవరాత్రులు
  17. విశేషంగా లిఖించబడింది (5)
    సమాధానం: విరచితము
  18. కథ కంటికెక్కితే బొంత కావాలి (4)
    సమాధానం: కంథటిక
  19. తలకిందులైన పండితులా? కాదు, పక్షి (3)
    సమాధానం: లావుక
  20. ఖర్చు చెయ్యడానికి ముందు ఇది కావాలి (2)
    సమాధానం: జమ