రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

పిచ్చివాడి పాదముద్ర

రచన: శివసాగర్
మే 2019

క్లాక్ టవర్‌కు వేలాడుతోన్న
వేశ్య విషాద స్తన్య సంగీతం మీద
పిచ్చివాడి పాదముద్ర

సజీవదహనంలో బూడిదైన
కంచికచర్ల కోటిగాడి
అంటరాని స్వప్నం మీద
పిచ్చివాడి పాదముద్ర

నెత్తురు కక్కుతోన్న
నాగేటి చాళ్ళ మీద
కాలం కసితో పెట్టిన నిశాని
పిచ్చివాడి పాదముద్ర

పిచ్చెక్కిన చందమామ
మత్తెక్కిన సముద్రానికి
రాసిన తొలి ప్రేమలేఖలో
పిచ్చివాడి పాదముద్ర

ఈ పిచ్చివాడి పాదముద్ర
కన్నీళ్ళ కీకారణ్యంలో
గాయపడ్డ కలతనిద్ర

(జూన్ 25, 2000)

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నాకోసం ఎదురు చూడు
  • శివసాగర్ జైలు డైరీ నుంచి… మూడు పేజీలు
  • పిచ్చివాడి పాదముద్ర

ఇటువంటివే…

  1. నాకోసం ఎదురు చూడు
  2. ఓ చందమామ
  3. కెరీరిజం
  4. అక్కరలేనితనం
  5. వాన

మే 2019 సంచికలో ...

  • ఇద్దరు పిల్లలు
  • ఉద్యమ కవితా శివసాగరం
  • కొంగర జగ్గయ్యతో ముఖాముఖీ
  • కొలమానం
  • గడినుడి – 31
  • చిరుగాలి సితారా సంగీతం
  • చివరి వాల్‌పోస్టర్…
  • తోడు
  • త్రిపథ: …మనవి ఆలకించరాదటే
  • త్రిపథ: కొన్ని రామాయణ విశేషాలు
  • నాకోసం ఎదురు చూడు
  • పిచ్చివాడి పాదముద్ర
  • మంటో కథలు: ఖుదా కీ కసమ్
  • మే 2019
  • శివసాగర్ జైలు డైరీ నుంచి… మూడు పేజీలు
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 31
  • సాహిల్ వస్తాడు, రాక తప్పదు!
  • సౌందర్యం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

శివసాగర్ జైలు డైరీ నుంచి… మూడు పేజీలు
తోడు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.