గడినుడి – 43 సమాధానాలు

అడ్డం

  1. ఇక్కడ తలగుడ్డ వేసేరంటే మీరనుకున్నది సాధిస్తారు (5)
    సమాధానం: కోటలోపాగా
  2. ఈ శుద్ధులు ఆచరించడం మేధాశక్తికి పరీక్షలు కాబోలు (7)
    సమాధానం: అష్టావధానములు
  3. గౌరమ్మ చిన్నది అయినా ఎర్రనిది (3)
    సమాధానం: గవర
  4. అగ్ని పువ్వు (4)
    సమాధానం: అంగారము
  5. దందడిగ సైనికులు పట్టుకొనే డాలు (3)
    సమాధానం: దడిగ
  6. కాబట్టి సగం అడవి కాలిపోయింది (2)
    సమాధానం: కాన
  7. అల్లుడు తిరగబడితే ఊడి పడతాడు (2)
    సమాధానం: డుల్లు
  8. పైకి మంచివాడిలా కనిపించే దుష్టుడు ధరించే మొసలి (4)
    సమాధానం: గోముఖము
  9. సన్నటి నడుము గల స్త్రీ (4)
    సమాధానం: తనుమధ్య
  10. పండని అబద్ధం (4)
    సమాధానం: పచ్చికోత
  11. ఆలస్యం అయినా కిన్నెర చివరికి మధ్యలో చేరి బంగారమయ్యింది (5)
    సమాధానం: తామరసము
  12. మాడినప్పుడు చేసే ధ్వని అనుకరణ (4)
    సమాధానం: మలమల
  13. కలవరపాటుతో చేసే యుద్ధము (3)
    సమాధానం: కంగారు
  14. కాగితం రెక్క (3)
    సమాధానం: పత్రము
  15. ఎనుపోతు కా హారము? (4)
    సమాధానం: కాసరము
  16. వినడానికి కల్లు దొరికే ప్రదేశంలాగనిపించినా అది దేవాలయం (5)
    సమాధానం: సురస్థానము
  17. గాడుపుమేపరి నిట్టూర్పు (4)
    సమాధానం: పాముబుస
  18. గుట్టు తెలిసినవాడు గోదావరీ తీరం దగ్గర కనిపిస్తాడు (4)
    సమాధానం: అంతర్వేది
  19. చిక్కులు ముందుండే వరాహం (4)
    సమాధానం: ముళ్ళపంది
  20. కలయంపిని మధ్యలో పాడుచేసిన జంతువు (2)
    సమాధానం: కపి
  21. బృహస్పతిభార్య ఒక సంవత్సరం చివర పోయింది (2)
    సమాధానం: తార
  22. ఈ ఆవుని మచ్చిక చేసుకోడం కష్టం (3)
    సమాధానం: నరవ
  23. తిరుమల పొంగలి లో వెతికితే శిలాయంత్రం కనిపిస్తుంది (4)
    సమాధానం: తిరుగలి
  24. సివాలు చేసే గ్రామదేవత (3)
    సమాధానం: అంకమ్మ
  25. ఓర్వలేని బుద్ధి ఉంటే కదనము కుట్టును (7)
    సమాధానం: కనుకుట్టుదనము
  26. ఇల్లాలి మొగుడు ఇంటికీ మొగుడే! (5)
    సమాధానం: భవన భర్త

నిలువు

  1. ఇరవైని శాపాలు తారుమారుచేస్తే బండారము బయటపడుతుంది (5)
    సమాధానం: కోశాగారము
  2. ప్రపంచం మధ్యలో అక్షరం మారితే వెలితి కనిపిస్తుంది (3)
    సమాధానం: లోపము
  3. కూడి తగాద చేస్తే ఓండ్ర (5)
    సమాధానం: గాడిదకూత
  4. కథారంభంబెట్టిదనిన? (3)
    సమాధానం: అనగ
  5. సంతాపం శ్మశానం కలిపే ప్రియుడు (4)
    సమాధానం: వగకాడు
  6. దేహానికీ దంతాలకీ కావల్సింది (3)
    సమాధానం: ధావన
  7. వయసు మీద పడితే వచ్చే తెల్ల వెంట్రుక (2)
    సమాధానం: నర
  8. పిల్లికి బిచ్చం పెట్టనివాడు (3)
    సమాధానం: లుబ్ధుడు
  9. ఉదాహరణకి చిలుక తారుమారయిందంటే మారణాయుధంగా వాడొచ్చు (3)
    సమాధానం: క్షిపణి
  10. వినడానికి చెడు అహారం లాగ అనిపించినా ఇదొక ఆభరణవిశేషం (3)
    సమాధానం: ముక్కెర
  11. ఎటునుండి చూసినా గుదికాలు (3)
    సమాధానం: మడమ
  12. ఆడవాళ్ళకి ఆగ్రహం వస్తే దూరేగది కాబోలు (5)
    సమాధానం: కోపాగారము
  13. గద్ద భక్తుడు (4)
    సమాధానం: రామదాసు
  14. వినడానికి మూడు బాధల్లా అనిపించినా అరాటపడడాన్ని ఇలా అంటాం (5)
    సమాధానం: తాపత్రయము
  15. వృద్ధుడు అయినా బలరాముడు ఎందుకు మధ్యలో దూరేడు? (3)
    సమాధానం: ముదుసలి
  16. బ్రహ్మతండ్రికి తండ్రి (3)
    సమాధానం: ముత్తాత
  17. ప్రతిష్ఠ చేయడంలో ఒక అక్షరం లోపిస్తే ఉనికి తెలుస్తుంది (3)
    సమాధానం: స్థానము
  18. సందేహంలో పడ్డ సవతి సౌకర్యం (3)
    సమాధానం: వసతి
  19. కిందనుండే కొలువుకూటం దేశాన్ని పాలిస్తుంది (5)
    సమాధానం: దిగువసభ
  20. ఉగాది పండుగనాడు ఇతని మాటలు వింటాం (5)
    సమాధానం: పంచాంగకర్త
  21. మేఘంలో ఉండే అగ్ని(4)
    సమాధానం: ఇరమ్మద
  22. దీనిమీద బ్రహ్మాస్త్రమా? (3)
    సమాధానం: పిచ్చుక
  23. అప్పు దొరకాలంటే శిరస్సుని ఇలా పెట్టాలి (3)
    సమాధానం: తాకట్టు
  24. నాడి తెలియాలంటే యమలోకంలో కన్ను మొదట బలివ్వాలి (3)
    సమాధానం: నరము
  25. కూచిమంచి ఆరోగ్యం (3)
    సమాధానం: తిమ్మన
  26. గ్రామదేవత మావటి కాలు నరికింది (2)
    సమాధానం: అంకు