చేతిలో నీ చిత్రపటం
తడి అంటిన అంచులు
కోరుతూ నిర్ణయం
తడి ఆరిన పెదవులు
విశ్లేషిస్తూ ప్రశ్నల్తో నేను
విపులీకరిస్తూ జవాబుల్తో నువ్వు
ఒకటొకటిగా చెరిగిపోతూ సంకోచాలు
రెక్కలు విచ్చుకొంటూ ఆనందాలు
సరాసరి ఇద్దరం
సర్దుకొంటూ మనసు
తలంబ్రాలే ఆరంభాలు
పూదండలు మార్చుకొంటూ
కైదండలు గైకొంటూ
కనుచివరల్లో కలుస్తూ
తలపూలరేకులు సడలించుకొంటూ
తలపులమాలలు ముడివీడుకొంటూ
నీ సన్నిధిలో పెన్నిధి ఎంచుతూ
నిను గెలుస్తూ ఆశలవారధి కట్టేస్తూ
నా ఊహల్లో మనం
బలపడ్డ భావం నిలకడగా బంధం
ఇక నిత్యం మన నీలిరాగం
గుండెలో మన చిత్రపటం