మినీకవితలు కొన్ని


నీడ కోసం

నీడ కోసం నది వొడ్డున కూర్చున్నాను

నీటిలో ఏదో లీలగా వొక అలజడి అయింది

తేరిపార చూస్తే

తెరమరుగయింది..!!

    క్రియేటివిటీ

క్రిటిక్‌లో క్రియేటివిటీ..

చటుక్కున కరెంటు పోయి

కటిక చీకటి అయిపోతే

చిటుక్కున చిరాకొచ్చింది..!

అటూ ఇటూ కదిలినా

ఎటూ తేలని ఆలోచనలతో

ఎటు పోవాలో తోచక

అటు తిరిగి పడుకున్నాను..!!

    తాపీగా…

తాపీగా కూర్చుని తమలపాకులు తింటుంటే

తాటి ఆకులు కదిలాయ్‌

తలెత్తి చూస్తే

తాటి కాయ తల మీద పడింది..!!

    జనాలు…

ఊరికే వుంటే ఊరుకోరు జనాలు

ముంగిలా వుంటే మింగేస్తారు జనాలు

గమ్ముగా వుంటే కుమ్మేస్తారు జనాలు

ఉరకలేస్తుంటే ఊదేస్తారు జనాలు

జాలిగా వుంటే జారుకుంటారు జనాలు

జాగ్రత్తగా వుంటే జబ్బనుకుంటారు జనాలు

మంచికి పోతే,అలాంటి మార్గమే లేదంటారు!