చనిపోయినవారి ఆత్మక్షోభ
స్మారక స్థూపాలు
ఆ రాళ్ళరక్తపు మరకల్లో
వారి జీవితాల్ని చిదిమేసిన పాదముద్రలే భయపెడ్తాయి
వారి జ్ఞాపకాల్ని పదే పదే కెలికే
వారి నిస్సహాయ క్షణాలే మరీ మరీ బాధిస్తాయి
వారి లేకపోయినతనాన్ని అనుక్షణం అనుభవిస్తున్న
ఆత్మీయుల ఆర్తనాదాలే వినిపిస్తాయి
ఏ కొందరికైనా
మరణించిన ప్రతి మనిషీ స్మారక స్థూపమే!
ఎంత పోరాటం ఆఖరువరకూ?