నీవేమో నీ ప్రతాపంతో ఇంద్రుని గెలిచావు. కానీ నన్ను చెరపట్టి లాక్కు రమ్మన్నావు. చెరబట్టడం ఏం వినోదం? నీకు వినోదం గావచ్చు గానీ, చెరబట్ట బూనితే నా మనస్సు బాధ పడదా?

అప్పుడే కళ్ళు ఎత్తి నా కేసి చూసిన ఆమె కళ్ళు ఒక్క క్షణం నా కళ్ళతో కలుసుకున్నాయి. ఆ కళ్ళలో నాకు చాలా చిరపరిచితమైన భావాలు! అప్రయత్నంగా చేతిలోని పెన్ను టేబిల్ పై పడేసాను. పరీక్షగా ఆమె కళ్ళలోకి చూసాను.

అతనికి తెలుసు. ఆమె భౌతికంగా ఈ ఇంట్లో ఉంటుంది. ఇన్ని దేశాల కథలు చదివిన ఆమె మానసికంగా ఎక్కడ ఉంటుందో, కట్టడులు సంకెళ్ళు వేసుకునే ఆ ఇంటిలోని వారికి తెలియదు. ఆమె ఎందుకు ఏడుస్తున్నదీ వారికి తెలియదు.

ఈమాట సెప్టెంబర్ 2008 సంచికకు స్వాగతం. ఎప్పటిలాగే ఈ సంచికలో కొత్త కథలు, వ్యాసాలు, కవితలు, పుస్తక సమీక్షలు. ఈ సంచిక నిర్మాణంలో సహాయపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఈ సంచికపై కూడా మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తున్నాము.

జీవితాంతమూ అనాదరణకి గురైన ఫ్రేగె ఆధునిక కంప్యూటర్ కి మూలమైన తార్కిక గణితానికి సంస్థాపకుడిగా, అరిస్టాటిల్ స్థాయి మేధావిగా, వైశ్లేషిక తత్వానికి (analytic philosophy) మూలపురుషుడిగా గుర్తిస్తారు.

పౌరాణిక ఇతివృత్తాన్ని తీసుకొని సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యను లోతుగా చర్చించి, ”భారతీయులంతా ఒక్కటే” అనే జాతీయతా వాదాన్ని స్థాపించే నాటకంగా దీన్ని అభివర్ణించవచ్చు.

అప్పుడప్పుడూ గలగలపారే
ఆలోచనల సవ్వడి కూడా లేకుండా
కాలం నా కనురెప్పల క్రింద
మాగన్నుగా ఒదిగిపోతుంది.

మల్లికార్జున భట్టు పద్యాన్ని మొల్ల చూసే ఉంటుంది. చూసింతర్వాత ఆకర్షింపబడి కొద్ది మార్పులతో తన పద్యాన్ని తాను వ్రాసుకొని పైపద్యం మీద తన గౌరవం ప్రకటించింది.

ఉన్నట్లుండి, “ఫ్రాంక్, నిజం చెప్పు. నేను ‘సెన్సిటివ్’నా కాదా” అని శాల్ అడిగింది.
“నువ్వు సెన్సిటివ్వే. కాదని ఎవడన్నాడు? నా రోజెలా గడిచిందని అడుగుతావు, అది సెన్సిటివ్వేగా. పైగా నువ్వు కిటికీలోంచి బయటకి చెత్త పారేయడం నేనెప్పుడూ చూడలేదు”
“అబ్బా, సెన్సిటివ్ అంటే అది కాదు. …”

వ్యావహారిక భాషలో పద్యాలను రాయడంవల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. భాషపైన, వ్యాకరణంపైన అంతగా అధికారం లేకున్నవారు కూడా పరిశ్రమించవచ్చు. దీనివల్ల ఛందస్సు ప్రక్రియ ఏ కొందరికో మాత్రమే కాక అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ కళకు మళ్ళీ ఒక నవజీవనం కలుగుతుంది, నవ చైతన్యం పుడుతుంది.

జ్యోతిష్కులు భ్రమల్లోనూ, అజ్ఞానంలోనూ బ్రతుకుతున్నారని సైన్సు అంటుంది. కాదని జ్యోతిష్కులు నిజంగా భావిస్తే నిరూపించవలసిన బాధ్యత వారి మీదే ఉంటుంది. ఏది ఏమైనా మన నమ్మకాలని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే తప్పేముంది?

అనువాద రచనలు మూల భాష తెలిసిన వారిని,అనువాద భాష మాత్రమే తెలిసిన వారిని సమానంగా రంజింపజెయ్యాలని ఎలా ఆశిస్తామో, అలాగే అనుభవాల గురించి రాసిన రచనలు కూడా ఆ అనుభవాల నెరిగిన వాళ్ళకి, ఎరగని వాళ్ళకి కూడా సంతృప్తి నియ్యాలని ఆశించటంలో తప్పులేదు.