తనకు తెలిసిన జీవితాన్నే, తనకు అనుభవంలోకి వచ్చిన సామాజికాంశాలనే తన కథల్లో ప్రదర్శించినాడు సుబ్బరామయ్య. ఆయన తన కథల్లో కల్పననూ, ఊహలనూ ఎప్పుడూ ఆశ్రయించలేదు. తాను జీవించిన విజయవాడ పట్టణమే ఆయన కథల్లో వేదికగా వుండటాన్ని కూడా మనం గుర్తుపట్టవచ్చు. పెద్దిభొట్ల అనగానే మధ్యతరగతి అని గుర్తుండిపోయేలే చాలా కథలు రాసినాడు ఆయన.
శీర్షికలు సంచికలు
విశ్లేషిస్తూ ప్రశ్నల్తో నేను
విపులీకరిస్తూ జవాబుల్తో నువ్వు
ఒకటొకటిగా చెరిగిపోతూ సంకోచాలు
రెక్కలు విచ్చుకొంటూ ఆనందాలు
సరాసరి ఇద్దరం
సర్దుకొంటూ మనసు
రజని రచించి కూర్చిన పద్యనాటికలను విశ్వవీణ అనే పేరుతో సంపుటం చేశారు. ఈమాట గ్రంథాలయం కోసం అరుదైన ఈ పుస్తకం పరుచూరి శ్రీనివాస్ ఈమాటకు పిడిఎఫ్ రూపంలో అందించారు. ఆ సందర్భంగా ఆ పుస్తకపు ముందుమాటగా రజని రాసిన సంగీతనాటకాలు అనే వ్యాసం ఇక్కడ ప్రచురిస్తున్నాం. – సం.
రేచన వ్రాసిన కవిజనాశ్రయము మొదటి తెలుగు గ్రంథము కాదని శాసనముల, తదితర ఆధారముల ద్వారా నిరూపించబడినది. కొన్ని శతాబ్దములకు ముందు ఛందోనియమముల కొఱకు వాడబడిన హలంతములైన పదములను అజంతములుగా ఉచ్చరించేవారని శాసనముల ద్వారా నిరూపించడమైనది.
జోగినాధం నెమ్మదిగా లేచి కూజా దగ్గరికి వెళ్ళి నీళ్ళు గ్లాసులోకి వంచుకున్నాడు. చేతితో గ్లాసు పైకెత్తి పట్టుకుని ఒక్క క్షణం చూసి తర్వాత గడగడ త్రాగాడు. అది గమనించి శర్మ అనే మరో గుమాస్తా నవ్వి, “మన కూజాలో నీళ్ళన్నీ ఒక్క జోగినాధంగారే కాజేస్తున్నారండీ… అదేమి చిత్రమో ప్రతి అరగంటకూ ఆయనకు దాహమవుతూ ఉంటుంది” అన్నాడు.
వేదులవారి కవిత్వంలో ఒక గాఢ విషాదపు జీర కనిపిస్తుంది. మహాప్రస్థానానికి పీఠికగా ఇచ్చిన యోగ్యతా పత్రంలో లోకమంతటి బాధా శ్రీశ్రీ బాధైతే, కృష్ణశాస్త్రి బాధ లోకమంతటిదీను అంటాడు చలం. అది కృష్ణశాస్త్రి ఒక్కడిదే అనుకోనక్కరలేదు. దాదాపు భావ కవులందరిలోనూ ఆ లక్షణముంది. వేదులవారి కవిత్వంలో ఐతే మరీను.
సాహిత్యం జీవితాన్ని ఉన్నతీకరిస్తుంది. విమర్శ సాహిత్యాన్ని ఉన్నతీకరిస్తుంది. పొరలు పొరలుగా, గజిబిజిగా, గందరగోళంగా, సంక్లిష్టంగా ఉన్న మానవజీవితాన్ని సాహిత్యం వడకట్టి, దాని సారాంశం తేటతెల్లం చేస్తుంది. అటువంటి సాహిత్యాన్ని పరిశీలించి, శోధించి, తాలు తప్ప వేరు చేసి, విలువ కట్టి, అందులో ఉత్తమమైనదేదో వెలికితీస్తుంది విమర్శ. (డీటీఎల్సీవారు ప్రచురించిన తెలుగు విమర్శ: కొన్ని ఆలోచనలు అన్న సంకలనం నుంచి పునర్ముద్రణ.)
అడ్డం చవక పరిహాసం సమాధానం: సరసం ఆజ్ఞ. సంధిలో ఆగమం కంటే వేరైనది సమాధానం: ఆదేశం భక్ష్యములఁదిను సుజనులాస్వాదించు వస్తువు సమాధానం: దినుసు కపటి […]
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
క్రితం సంచికలోని గడినుడి 19కి గడువు తేదీలోపు ఎవ్వరూ సరైన సమాధానాలు పంపలేక పోయారు.
సరిచూపు సహాయంతో కరక్టుగా నింపిన మొదటి అయిదుగురు: 1. కె. వి. గిరిధరరావు 2. భమిడిపాటి సూర్యలక్ష్మి 3. గిరిజ వారణాసి 4. పంతుల సుధారాణి 5. స్మృతి. వీరందరికీ మా అభినందనలు.
తెలుగులో లలిత సంగీత సృష్టికర్త, గాయకుడు, రచయిత, గేయనాటక సంగీత రూపకకర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, రేడియో జేజిమామయ్య బాలాంత్రపు రజనీకాంతరావుగారి గురించి క్లుప్తంగా చెప్పడం అసంభవం. రజనిగా పదిమందీ పిలుచుకునే ఆయన పూర్ణాయుర్దాయం తర్వాత కాలధర్మం చెందటం సహజమే అయినా ఒక తరం ముగిసిపోయిందన్న బాధ కూడా కలగకమానదు. ఈ సందర్భంలో, ఈమాటలోని ఆయన రచనలు ఒకసారి గుర్తు చేసుకుందాం. చలంతో రజని ముఖాముఖీ; బాలల సంగీత రూపకం కొండనుంచి కడలి దాకా; తెలుగులో మేఘసందేశం ఆడియో రూపకం; పరుచూరి శ్రీనివాస్ సమగ్ర పరిచయ వ్యాసం తెలుగు లలిత సంగీతంలో రజనీ గంధం; కొడవటిగంటి రోహిణీప్రసాద్ రాసిన 88 ఏళ్ళ యువకులు; కొత్తగా ఈ సంచికలో, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు సంపాదకీయంలో వెలువడిన ప్రసారతరంగిణి రేడియో కార్యక్రమాలపై వ్యాస సంకలనం నుంచి రెండు వ్యాసాలు; రజనితో అనుబంధం గురించి మంగళంపల్లి బాలమురళీకృష్ణ పంచుకున్న ముచ్చట్లు; ఎన్నో వివరాలు విశేషాలతో నిండిన రజని రేడియో ఇంటర్‌వ్యూ; ఒక అరుదైన ఆంగ్ల సంగీతరూపకం, ఎ థిమాటిక్ మ్యూజిక్ పీస్ ఆదికావ్యావతరణం – ది బర్త్ ఆఫ్ ఆన్ ఎపిక్; రజని బహుముఖ ప్రజ్ఞను స్థాలీపులాకన్యాయంగానైనా పాఠకులకు పరిచయం చేస్తాయని ఆశిస్తున్నాం. ఇవే కాక, కథలు, కవితలు, సమీక్షలు…
అయితే కన్విన్స్ కండి, కాకపోండి. ఫరక్ కుచ్ భీ నహీ పడేగా. జరగాల్సింది ముందుగా వ్రాసిపెట్టినట్లుగానే జరుగుతుంది కాదనడానికి మై కౌన్ హుఁ? ఇదంతా నా థియరీ అనబడు ఒక సత్య శోధన, స్ట్రయిట్‌గా సూటిగా తార్కికంగా మీ పిల్లల సృజనాత్మకతని మీ తెలీని తనంతో హత్య చేయనీయకుండా ఆపే ప్రయత్నం.
కానీ గురూ, చూడు ఈ రచయిత వాక్యం తాజాగా ఉన్నది. శైలి భిన్నంగా మెరుస్తుంది. కథ ఎత్తుకున్న తీరు తీర్చిదిద్దిన తీరుగా కలదు. ఇతగాడిని చదివి నేను మహదానందపడ్డా. నా ఈ ఆనందం నీకూ పంచాలనుకుంటున్నా, రా, నువ్వూ సంబరపడుదువు కాని మిత్రమా. ఈ కథాసంకలనం పేరు ఆ నేల, ఆ నీరు, ఆ గాలి.
ముఠాతత్వం అన్నది విమర్శలో కూడ ఇప్పుడు కనిపిస్తోంది. ఒక్కొక్కసారి ఈనాటి కవులు, రచయితలు తమ విమర్శకులను తామే సృష్టించుకుంటున్నారేమో అన్న అనుమానం, తమపై విమర్శ (ప్రశంస) తామే రాయించుకుంటున్నారేమో అన్న అనుమానం కూడ సహజంగానే కలుగుతుంది. అది సత్యదూరం కూడ కాదు. (డీటీఎల్సీవారు ప్రచురించిన తెలుగు విమర్శ: కొన్ని ఆలోచనలు అన్న సంకలనం నుంచి పునర్ముద్రణ.)
చామనచాయలో వుండే ఆయన కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా వుంటాయి. ఆ ఎరుపు కనపడకుండా నల్లకళ్ళద్దాలు కాపు కాస్తూ వుంటాయి. ఆయన పెదాలు మాడిన కెంపు రంగులో వుంటాయి. వాటిని పొగలుగక్కే సిగరెట్లు దాచి పెడుతుంటాయి. ఆయన వంటి మీద లాల్చీ షరాయిలు ఎప్పుడూ లేత మొగలి రేకుల్లా తళతళమంటుంటాయి.
కొవ్వొత్తి, అగ్గిపెట్టె తెచ్చినతను నోటికి చెయ్యడ్డం పెట్టుకుని ముందుకు కదిలే ధైర్యం తనకు లేదన్నట్లు అడ్డంగా తలూపుతూ ఉన్నచోటనే కుప్పకూలిపోయాడు. మిగిలిన ఇద్దరూ పలాయనమంత్రం పఠించటానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా, వాళ్ళు; వాళ్ళ రాకడతోనే వాళ్ళ వెనకే యాంత్రికంగా మూసుకుపోయిన గుమ్మం తలుపుల్తో యుద్ధం చేస్తున్నారు.
ఇక, నవలలో పరచిన వ్యవసాయ విజ్ఞానం కంటే, చివరిలో ప్రత్యక్షమయే ఆత్మీయ స్నేహం తీరు కంటే, నోస్టాల్జియా కంటే (ఎవరి నోస్టాల్జియా వారిదైనప్పటికీ బెంగటిల్లడం ఒకటే), రచయిత చెప్పే కర్మసిధ్ధాంతం కంటే, ముఖ్యంగా అందరూ ఈ నవలలో ప్రస్తుతం తఱచి తఱచి చూడాల్సింది రచయిత నిరూపించిన, ప్రకృతితో మమేకమయిన మన జాతి తాత్త్వికతనే.
ఈ చల్లటి గాలిలో
స్వేచ్ఛగా ఎగురుతున్న తూనీగనై
కొన్ని సార్లైనా
ఏ పందెపు గాలానికీ చిక్కకుండా
ఏమీ ఆలోచించకుండా
దేనికోసమో పరుగులెత్తకుండా
ఇలా వుండనీ
తెల్లని జాజుల గంధం మోస్తూ పిల్లగాలి
వయ్యారంగా ఊగిసలాడే వంగపూలు
ఊసులలో తేలిపోతూ నల్లటి హంసల జంట
హరివిల్లు పానుపు పవ్వళిస్తూ మేఘమాల